
BJP Manifesto 2022 Punjab: పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ పలు తాయిలాలు ప్రకటించింది. తమను గెలిపిస్తే ప్రభుత్వోద్యోగాల్లో 75 శాతం, ప్రైవేట్ ఉద్యోగాల్లో 50 శాతం రాష్ట్ర యువతకే దక్కేలా రిజర్వేషన్లు కేటాయిస్తామని శనివారం విడుదల చేసిన మూడో మేనిఫెస్టోలో పేర్కొంది.
ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 35 శాతం కేటాయిస్తామని చెప్పింది. డిగ్రీ పూర్తయ్యాక రెండేళ్ల దాకా నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది.