కీలక ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ఎలా? | Received one representations on presentation of budget; examining it and will take call on it | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 4 2017 4:11 PM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన కమిషన్ బుధవారం నగారా మోగించింది. అయితే ఈ కీలక ఎన్నికలకు ముందు ఈ మాసాంతంలో నిర్వహించనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు బడ్జెట్ ప్రవేశంపై తమకు ప్రతిపక్షాలనుంచి అభ్యంతరాలు అందాయని ఎన్నికల కమిషన్ ఛైర్మన్ నసీం జైదీ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీంతో బడ్జెట్ సమర్పణ మార్చి 11వ తేదీకి తరువాతకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement