
పణజి: గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉపాధి కల్పనకు రూ.500 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సోమవారం నువెం అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో కుంభకోణాలకు చెక్ పెట్టడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయ్ పథకం కింద బలహీన వర్గాల వారికి నెలకు రూ.6,000 అందిస్తామని చెప్పారు.
మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంపు, మార్గోవా, పణజిల్లో వర్కింగ్ విమెన్‌కు హాస్టళ్లు, పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.80 మించకుండా చూడటం వంటి పలు హామీలను ఆదివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ప్రకటించింది. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment