
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. బుధవారం ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్‌ను ఢిల్లీలో కలిశారు. సాయంత్రం విజయ్ రావత్ బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలని ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఆమోదిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రిటైర్‌మెంట్ అనంతరం తన తండ్రి బీజేపీలో చేరడంతో ఇప్పుడు తనకు కూడా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అయితే దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment