Breadcrumb
- HOME
ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
Published Mon, Feb 14 2022 7:16 AM | Last Updated on Mon, Feb 14 2022 8:54 PM
Live Updates
మూడు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ అప్డేట్స్
ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. యూపీలో సాయంత్రం 6 గంటల సమయానికి 60.69 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్ లో 55 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
అటు, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఒకే విడతలో పోలింగ్ చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 సీట్ల కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 59.37 శాతం పోలింగ్ నమోదైంది.
గోవాలో భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఇక్కడ 75.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా, అన్నింటికి ఇవాళ పోలింగ్ చేపట్టారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగం సక్సెస్
గోవాలో చాలావరకు పోలింగ్ బూత్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వినియోగించారు. తద్వారా క్యూలో నిల్చున్న ఓటర్లను లెక్కించేందుకు వీలుపడిందట. భవిష్యత్తులో ఈ తరహా టెక్నాలజీని మరింతగా ఉపయోగిస్తామని గోవా నోడల్ ఐటీ ఆఫీసర్ ప్రవీణ్ వోల్వోట్కర్ వెల్లడించారు.
యూపీ రెండో ఫేజ్ పోలింగ్ శాతం
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 రెండో ఫేస్ ఎన్నికల్లో 60.44 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది.
గోవాలో పోలింగ్ శాతం
గోవాలో ఐదు గంటల వరకే 75.29 శాతం ఓటింగ్ పూర్తైనట్లు ఈసీ వెల్లడి
ఉత్తరాఖండ్‌లో పోలింగ్ శాతం
ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సాయంత్రం ఐదు గంటల వరకు 59.37 శాతం ఓటింగ్ దాటింది.
ఈసీ చీఫ్‌కి బీజేపీ ఫిర్యాదు
‘ట్రిపుల్ తలాక్’ చట్టం వేలమందిని కాపాడింది
ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం.. వేలమంది ముస్లిం మహిళలను కాపాడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఓవైపు యూపీలో రెండో దశ ఎన్నికల వేళ.. యూపీ కాన్పూర్ డెహాత్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ పాలనలో యూపీ ముస్లిం మహిళలకు భద్రత లభిస్తోంది. విద్యావంతులు అవుతున్నారని ప్రధాని పేర్కొన్నారు.
ఇక సమాజ్‌వాదీ పార్టీని కుటుంబ పార్టీగా, దోపిడీ దారులుగా అభివర్ణిస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఎస్పీ కూటమి విధానంపైనా సెటైర్లు విసిరారు.
పనిలో పనిగా.. గోవా పోలింగ్ జరుగుతున్న క్రమంలో.. అక్కడ హిందువుల ఓట్లను చీల్చేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది ఆ పార్టీ బహిరంగంగా చేస్తున్న వాదన అని, ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రధాని కోరారు.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ శాతం ఇలా..
యూపీలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.07 శాతం పోలింగ్ నమోదైంది. గోవాలో 44.62 శాతం, ఉత్తరాఖండ్‌లో 35.20 శాతం పోలింగ్ నమోదైంది.
11 గంటలకు పోలింగ్ శాతం ఇలా..
ఉదయం 11 గంటల వరకు గోవాలో 26.63 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 23.03 శాతం, ఉత్తరాఖండ్‌లో 18.97 శాతం పోలింగ్ నమోదైంది.
బీజేపీ 60కి పైగా సీట్లు సాధిస్తుంది: సీఎం పుష్కర్ సింగ్ ధామీ
ఉత్తరాఖండ్ సీఎం, ఖతిమా నుంచి బీజేపీ అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మా పథకాలన్నీ ఉత్తరాఖండ్ ప్రజలకు రక్షణ కవచాన్ని అందించాయి. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో ప్రజలకు బాగా తెలుసు. ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీకి 60కి పైగా స్థానాల్లో గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను' అని సీఎం పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు.
సంపన్నమైన గోవా కోసం ఓటు వేయండి: అమిత్ షా
గోవాలోని మా సోదరీమణులు, సోదరులు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. 'సుస్థిరమైన, నిర్ణయాత్మకమైన, అవినీతి రహిత ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి భరోసా ఇస్తుంది. కాబట్టి బయటకు వచ్చి సంపన్నమైన గోవా కోసం ఓటు వేయండి' అని అమిత్ షా ఓటర్లను కోరారు.
I urge our sisters and brothers of Goa, to vote in large numbers. Only a stable, decisive and corruption-free government can ensure the development of the state. So come out and vote for a prosperous Goa.
— Amit Shah (@AmitShah) February 14, 2022
పోలింగ్ బూత్‌లను సందర్శించిన ఉత్పల్ పారికర్
గోవా మాజీ సీఎం దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పనాజీలోని పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఆయన నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Utpal Parrikar, son of former Goa CM late Manohar Parrikar visits polling booths in Panaji. He is contesting as an independent candidate in the constituency.#GoaElections2022 pic.twitter.com/7sxzdtLHmN
— ANI (@ANI) February 14, 2022
ఉత్తరాఖండ్ పోలింగ్‌లో రగడ
సీఎం, బీజేపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
ఓటేసిన గోవా గవర్నర్
గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఆయన భార్య రీతా శ్రీధరన్ తలైగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 15లో ఓటు వేశారు.
Goa Governor PS Sreedharan Pillai and his wife Reetha Sreedharan cast their votes at polling booth number 15 of Taleigao Assembly Constituency#GoaElections2022 pic.twitter.com/IGhPWBS04O
— ANI (@ANI) February 14, 2022
100కుపైగా పింక్ బూత్‌లు
యూపీలో రెండో విడత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ‘‘మొత్తం 12,538 పోలింగ్ బూత్‌ల్లో 4,917 బూత్‌లను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. 60 వేల మంది పోలీసు సిబ్బంది, 800 కంపెనీల పారా మిలిటరీ దళాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే 100కు పైగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశాం’’ అని పేర్కొన్నారు. వీటిని సఖి లేదా పింక్ బూత్స్ అని పిలుస్తున్నారు. కొన్నింట్లో దివ్యాంగులను కూడా నియమించారు.
హోరెత్తిన ప్రచారం
యూపీ రెండో దశ పోలింగ్‌కు ప్రచార పర్వం శనివారంతో ముగిసింది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. సమాజ్‌వాదీ–ఆరెల్డీ తరఫున అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరి కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోశారు. ఇక బీఎస్పీ ప్రచారమంతా మాయావతి చుట్టే తిరిగింది. యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
బరిలో మంత్రులు, ప్రముఖులు
యూపీ రెండో దశ పోలింగ్‌లో పలువురు మంత్రులు బరిలో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా షాజహాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఏకంగా 8సార్లు నెగ్గారు. ఎన్నికల తేదీలు ప్రకటించాక బీజేపీ నుంచి ఎస్పీలోకి దూకిన మంత్రి ధరంసింగ్ సైనీ నకుద్లో పోటీ చేస్తున్నారు. సహాయ మంత్రులు బల్దేవ్ సింగ్ ఔలఖ్ (బిలాస్పూర్), మహేశ్ చంద్ర గుప్తా (బదౌన్), గులాబ్ దేవీ (చందౌసీ), ఛత్రపాల్ గాంగ్వర్ (బహేరీ) కూడా ఈ దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న వారిలో ఉన్నారు. ఇక సమాజ్‌వాదీ నుంచి సీనియర్ నేత మహ్మద్ ఆజం ఖాన్ రాంపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఆయన జైలు నుంచే ఎన్నికల బరిలో దిగారు. ఆజం ఖాన్ కొడుకు అబ్దుల్లా ఆజం కూడా స్వర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా మరో రాజకీయ కుటుంబమైన రాంపూర్ నవాబుల వారసుడు హైదర్ అలీ ఖాన్ బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ టికెట్‌పై బరిలో ఉన్నారు.
ప్రారంభమైన పోలింగ్
మూడు రాష్ట్రాల ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర ప్రదేశ్, గోవాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌లో మాత్రం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.
రెండో దశలో... ఎవరిదో పై చేయి
పేరుకు రెండో దశే అయినా, యూపీలో సోమవారం జరగనున్న పోలింగ్‌లో ఏకంగా 2 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భాగ్యరేఖలను నిర్దేశించనున్నారు. అందుకే 55 అసెంబ్లీ స్థానాల్లో జరుగుతున్న ఈ పోలింగ్ అధికార బీజేపీ, సమాజ్‌వాదీతో పాటు అన్ని పార్టీలకూ కీలకంగా మారింది. 9 జిల్లాల పరిధిలో పోలింగ్ జరుగుతున్న ఈ రెండో దశలో బీజేపీదే పై చేయి కావచ్చని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. ఎస్పీకి కంచుకోటలుగా ఉంటూ వస్తున్న ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు కూడా ఈ దశలో ఎక్కువగా ఉండటం పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది...
యూపీలో రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 9 జిల్లాలు సహరన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బదౌన్, బరేలీ, షాజహాన్‌పూర్ పరిధిలో 55 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరింటి దాకా జరిగే పోలింగ్‌లో 2.01 కోట్ల మంది ఓటర్లు 586 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం ఓటర్లలో 1.07 కోట్ల మంది పురుషులు, 93.7 లక్షల మంది మహిళలు కాగా 1,261 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. 55 సీట్లలో 9 ఎస్సీ స్థానాలున్నాయి. బిజ్నోర్ సహా 8 అసెంబ్లీ స్థానాలను సున్నితమైనవిగా గుర్తించారు. ఇక్కడ మరింత భద్రత ఏర్పాట్లు చేసినట్టు అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఉత్తరాఖండ్, గోవాల్లో నేడు పోలింగ్
డెహ్రాడూన్/పనాజీ: ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలకు సోమవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని 70, గోవాలోని 40 స్థానాలకూ ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. ఉత్తరాఖండ్‌లో 81 లక్షల మంది ఓటర్లుండగా, 152 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 632 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, విపక్ష నేత దిగంబర్ కామత్ తదితరులు బరిలో ఉన్నారు. ఐదోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాఖండ్‌లో పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరింటి దాకా జరుగుతుంది. 11,697 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు. 2017 ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఏకంగా 57 సీట్లు నెగ్గింది. ఇక గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13 సీట్లు గెలుచుకున్నాయి. చిన్న పార్టీలు, స్వతంత్రుల సాయంతో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 11 లక్షలకు పైగా ఓటర్లున్నారు. 301 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Related News By Category
Related News By Tags
-
ఆ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తథ్యం
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఓటమి చవిచూస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ ఓటమి ప్రభావం వచ్చ...
-
ప్రచార సమయం పెంపు.. పాదయాత్రలకు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న రాష్ట్రాల్లో కోవిడ్–19 సంబంధిత ఆంక్షలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మరింతగా సడలించింది. పరిమిత సంఖ్యలో జనంతో పాదయాత్రలు చేసుకోవడానికి అనుమతిచ్చి...
-
ఎన్నికల ప్రచార ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షల్ని సడలించింది. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిప...
-
కరోనానే పెద్ద పరీక్ష!
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు రోజురోజుకీ పెరుగుతున్న కరోనా తీవ్రత పెద్ద పరీక్ష పెడుతోంది. ఓ వైపు పెరుగుతున్న కేసులకు తోడు మరోవైపు అనుకున్న స్థాయిలో ముందుకు సాగని వ్యాక్సినేషన్ ప్రక్రి...
-
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్లతో మొ...
Comments
Please login to add a commentAdd a comment