Second phase polls
-
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 958 మందికిగాను 953 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలను విశ్లేషించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్(ఏడీఆర్)తెలిపింది. అభ్యర్థుల ఆస్తుల సరాసరి రూ.2 కోట్లని తెలిపింది. అత్యంత ధనికులైన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారేనని పేర్కొంది. సుర్‌గ్రుజా రాచకుటుంబ వారసుడైన టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. అంబికాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఈయన 2018 ఎన్నికల సమయంలో రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మణేంద్రగఢ్ స్థానంలో పోటీ చేస్తున్న రమేశ్ సింగ్ రూ.73 కోట్ల పైచిలుకు ఆస్తులు, రజిమ్‌లో పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా రూ.48 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ప్రకటించారని వెల్లడించింది. కాంగ్రెస్‌కు చెందిన 70 మంది అభ్యర్థుల్లో 60 (86%)మంది, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 (81%)మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే)కి చెందిన 62 మందిలో 26 (42%) మంది, ఆప్‌నకు చెందిన 44 మందిలో 19 (43%) మంది అభ్యర్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారని వివరించింది. ఆస్తులే లేవన్న ముగ్గురు అభ్యర్థులు భట్గావ్ సీటుకు పోటీ చేస్తున్న కళావతి సార్థి, బెల్టారాలో పోటీ చేస్తున్న గౌతమ్ ప్రసాద్ సాహు అనే స్వతంత్ర అభ్యర్థులు, ఖర్సియాలో పోటీలో ఉన్న జోహార్ ఛత్తీస్‌గఢ్ పార్టీకి చెందిన యశ్వంత్ కుమార్ నిషాద్ తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అదేవిధంగా, రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు అతి తక్కువగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ముంగేలి ఎస్సీ రిజర్వుడు సీటుకు పోటీ చేస్తున్న నేషనల్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌రత్న ఉయికే తన వద్ద కేవలం రూ.500 ఉన్నట్లు తెలిపారు. రాయ్‌గఢ్‌లో ఆజాద్ జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న కాంతి సాహు రూ.1,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా, బెల్టారా బరిలో నిలిచిన ఆజాద్ జనతా పార్టీకే చెందిన ముకేశ్ కుమార్ చంద్రాకర్ రూ. 1,500 ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ తెలిపింది. సీఎం బఘేల్‌కు అత్యధిక ఆదాయం ఆప్ అభ్యర్థి విశాల్ కేల్కర్, కాంగ్రెస్ నేత, సీఎం భూపేశ్ బఘేల్, బీజేపీ నేత ఓపీ చౌధరి తమకు అత్యధిక ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. కేల్కర్ తన మొత్తం ఆదాయం రూ.2 కోట్లుగా, సీఎం బఘేల్, చౌధరిలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు. 52 శాతం మంది 12వ తరగతిలోపే మొత్తం అభ్యర్థుల్లో 499(52 శాతం) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు తెలపగా మరో 405(42%)మంది గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్నట్లు వెల్లడించారని ఏడీఆర్ విశ్లేషించింది. 19 మంది అక్షరాస్యులమని మాత్రమే తెలపగా, ఆరుగురు నిరక్షరాస్యులమని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు విద్యార్హతలను పేర్కొనలేదు. -
మణిపూర్ చివరి దశలో 76% ఓటింగ్
Live Updates: మణిపూర్ చివరి దశలో 76% ఓటింగ్ ఇంఫాల్: మణిపూర్ శాసనసభ చివరి దశ ఎన్నికలు శనివారం జరిగాయి. 6 జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,247 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సేనాపతి జిల్లాలోని కారోంగ్ అసెంబ్లీ స్థానం పరిధిలోని నగాంజ్మూ పోలింగ్‌స్టేషన్ వద్ద ఇద్దరిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్పారు. దీంతో ఇక్కడ కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. చివరి దశలో 76.04% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా సేనాపతి జిల్లాలో 82.02% శాతం, థౌబాల్ జిల్లాలో 78% ఓటింగ్ రికార్డయినట్లు వెల్లడించింది. మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఓ,.ఇబోబి సింగ్ థౌబాల్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► మణిపూర్‌లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. తౌబాల్ జిల్లాలోని పోలింగ్ కేంద్రం ఓట్లు వేయడానికి ప్రజలు క్యూకట్టారు. ‘నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని, తాము ఉద్యోగ అవకాశాల కోసం ఓటు వేస్తున్నాము’ అని ఓటు వేసిన యువతీయువకులు మీడియాతో పేర్కొన్నారు. ►మణిపూర్ రెండో విడత పోలింగ్: ఉదయం 11 గంటల వరకు 28.19% ఓటింగ్ నమోదు మణిపూర్ రెండో విడత పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 28.19 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాల వారీగా ఓటింగ్ శాతం: 1 తౌబల్ 29.55% 2 చందేల్ 28.24% 3 ఉఖ్రుల్ 30.66% 4 సేనాపతి 27.86% 5 తమెంగ్లాంగ్ 20.41% 6 జిరిబామ్ 32.68% ►మణిపూర్‌లో పోలింగ్ సంబంధిత హింసలో ఇద్దరు మృతి మణిపూర్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా వేర్వేరుగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. స్థానిక మీడియా ప్రకారం.. మొదటి సంఘటన తౌబాల్ జిల్లాలో జరగగా, రెండవది సేనాపతి జిల్లాలో జరిగినట్లు సమాచారం. 41/52 Paorolon poll started on time taking due covid safety measures.#ECI #ElectionCommissionOfIndia #CEOManipur #SVEEP #ManipurVotes2022 #CovidSafeElections #ManipurElection2022 pic.twitter.com/l0cFuPZBZp — The CEO Manipur (@CeoManipur) March 5, 2022 ►మణిపూర్‌లోని బీజేపీ నేత నివాసం వెలుపల పేలుడు మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో బీజేపీ బహిష్కరణకు గురైన ఛ బిజోయ్ నివాసం వద్ద గుర్తుతెలియని కొందరు దుండగులు బాంబును పేల్చినట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ►రెండో విడత ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.40% ఓటింగ్ నమోదైంది ►హీరోక్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాధేశ్యామ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయన మాట్లాడుతూ.. కనీసం 5000 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మణిపూర్ ఎన్నికలు..ప్రధాని ట్వీట్: ►నేడు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల ప్రజలందరూ అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. Today is the second phase of the Manipur Assembly elections. Calling upon all those whose constituencies are polling today to vote in large numbers and mark the festival of democracy. — Narendra Modi (@narendramodi) March 5, 2022 ►మణిపూర్ మాజీ సిఎం & కాంగ్రెస్ నాయకుడు ఓక్రమ్ ఇబోబి సింగ్ సాంకేతిక లోపం కారణంగా పోలింగ్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆలస్యంగా ఓటు వేశారు. ►మొదటి విడతలో ఫిబ్రవరి 28న పోలింగ్ జరిగిన 5 నియోజకవర్గాల్లోని 12 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ►ఎలాంటి విరామం లేకుండా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లు సమాచారం. ►ప్రారంభమైన మణిపూర్ రెండో విడత ఎన్నికలు.. శనివారం 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంఫాల్: మణిపూర్ అసెంబ్లీ చివరి, రెండో విడత పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో ఆరు జిల్లాలకు చెందిన 22 నియోజకవర్గాల్లోని 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 1,247 పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎలక్టోరల్ అధికారి రాజేష్ అగర్వాల్ చెప్పారు. -
ముగిసిన మూడు రాష్ట్రాల పోలింగ్
-
టీడీపీ కంచుకోటల్లో వైఎస్సార్సీపీ పాగా
సాక్షి, అమరావతి: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారులు ఉనికి కోసం పాట్లు పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి నియోజకవర్గంలో పది పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం ఒకే ఒక పంచాయతీతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో తాను ఘనాపాటి అని చెప్పుకునే బుచ్చయ్య.. పంచాయతీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. జనసేనతో పొత్తు పెట్టుకుని కూడా ఆయన టీడీపీ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయారు. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న మండపేట నియోజకవర్గంలో 43 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరుచోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందడం విశేషం. చేతులెత్తేసిన హేమాహేమీలు ► శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం కంతేటిలో వైఎస్సార్సీపీ అభిమాని గెలుపొందారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని తన సొంత గ్రామం కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు టీడీపీ మద్దతుదారుడిని గెలిపించలేకపోయారు. ► మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు స్వగ్రామం చినమేరంగిలోనూ టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి పరాజయం పాలయ్యారు. ► విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నేత అయ్యన్నపాత్రుడు పార్టీ మద్దతుదారులను గెలిపించుకోలేక చేతులెత్తేశారు. ప్రతిరోజూ మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయడం తప్ప నియోజకవర్గంలో ఆయనకు పట్టులేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. ► 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ అభిమాని గెలుపొందారు. ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీకి అండగా ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి, పల్లెపాడు, నిడదవోలు నియోజకవర్గంలోని కోరుమామిడి, పెండ్యాల, మోర్త, పసలపూడి, అన్నవరప్పాడు, కాపవరం గ్రామాల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ► టీడీపీకి అండగా ఉండే కృష్ణా జిల్లాలోని కొల్లేటి లంక గ్రామాలు ఈసారి మూకుమ్మడిగా వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించాయి. గుడివాడ నియోజకవర్గంలోని టీడీపీకి పెట్టనికోటగా ఉండే చౌటపల్లిలో ఈసారి ఆ పార్టీ అభిమాని ఓటమిపాలయ్యారు. మోటూరులోనూ అదే పరిస్థితి. ఇనుమొల్లులో ఆంజనేయులుకు చుక్కెదురు ► గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంలోని తన సొంత గ్రామం ఇనుమొల్లులో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ 12 వార్డులకుగాను పది వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలవడం గమనార్హం. ► అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు సొంత గ్రామం అంకంపల్లిలో టీడీపీ మద్దతుదారు ఓటమిపాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ తనకు కంచుకోటల్లాంటి గ్రామాల్లో బోల్తా పడింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం విశేషం. ► ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, పార్టీ రహిత ఎన్నికలు కావడంతో దాన్ని ఆసరాగా తీసుకుని తామే గెలిచినట్లు చంద్రబాబు చెప్పుకోవడం చూసి ఆ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. ప్రజా క్షేత్రంలో టీడీపీ నేతలు మొహాలు చాటేస్తున్నారు. -
రెండో విడత స్థానిక ఎన్నికలూ ప్రశాంతం
సాక్షి, అమరావతి: చెదురుమదురు ఘటనలు మినహా రెండో విడత ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలోనే జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు దాదాపు సగం పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయినట్టు తెలిపారు. సాధారణ ఎన్నికల స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట గట్టి నిఘా ఉంటుందని తెలిపారు. మూడో విడతలోనూ అవాంతరాల్లేకుండా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. -
ముగిసిన రెండో దశ ప్రచారం.. 13న ఎన్నిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగియగా ఇప్పుడు రెండో దశ ఎన్నికలకు వేళయింది. రెండో దశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఈనెల 13వ తేదీన మొత్తం 2,786 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిసి చర్చించారు. ఈ మలి దశ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. రెండో విడతలో 13 జిల్లాలలోని 18 రెవెన్యూ డివిజన్లలోని మొత్తం 3,328 పంచాయతీలలో 33,570 వార్డుల ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది. వీటిలో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,786 పంచాయతీలలో ఎన్నికలు జరగనుండగా మొత్తం 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డులు 12,605 ఏకగ్రీవమవడంతో మిగిలిన 20,796 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులకు 44,879 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదృష్టం పరీక్షించుకోనున్న అభ్యర్థులు 13 జిల్లాల్లో ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు రెండో విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఏజెన్సీలోని పంచాయతీలో ఎన్నికలు మధ్యాహ్నం 1.30 గంటల వరకే ఉంటాయి. ఇక్కడ పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక కూడా అదే రోజు కొనసాగుతుంది. రెండో విడతలో 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లోని 167 మండలాల్లో శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు తొలి విడతలో కౌంటింగ్ నిలిచిపోయిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో కలెక్టర్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా: టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలోని 10 మండలాలు విజయనగరం జిల్లా: పార్వతీపురం డివిజన్లో 15 మండలాలు విశాఖపట్నం జిల్లా: నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలు తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం, రంపచోడవరం డివిజన్లలోని 14 మండలాలు పశ్చిమగోదావరి జిల్లా: కొవ్వూరు డివిజన్లోని 13 మండలాలు కృష్ణా జిల్లా: గుడివాడ డివిజన్లోని 9 మండలాలు గుంటూరు జిల్లా: నరసరావుపేట డివిజన్ 11 మండలాలు ప్రకాశం జిల్లా: ఒంగోలు, కందుకూరు డివిజన్లలోని 14 మండలాలు నెల్లూరు జిల్లా: ఆత్మకూరు డివిజన్లోని 10 మండలాలు కర్నూలు జిల్లా: కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 13 మండలాలు అనంతపురం జిల్లా: ధర్మవరం, కల్యాణదుర్గం డివిజన్లోని 19 మండలాలు వైఎస్సార్ కడప జిల్లా: కడప రెవెన్యూ డివిజన్ 12 మండలాలు చిత్తూరు జిల్లా: మదనపల్లి రెవెన్యూ డివిజన్ 17 మండలాలు ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం? -
రెండో దశలో 539 ఏకగ్రీవాలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 167 మండలాల పరిధిలో 3,328 పంచాయతీలకుగాను 539 ఏకగ్రీవమయినట్లు ఎస్ఈసీ ప్రకటించారు. మిగిలిన 2786 పంచాయతీలకు ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించారు. రెండో దశలో జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలు.. శ్రీకాకుళం: 278 పంచాయతీలకి గాను 41 పంచాయతీలు ఏకగ్రీవం విజయనగరం: 415కి గాను 60 ఏకగ్రీవం విశాఖ: 261కి గాను 22 ఏకగ్రీవం తూర్పు గోదావరి: 247కి గాను 17 ఏకగ్రీవం పశ్చిమ గోదావరి: 210కి గాను 15 ఏకగ్రీవం కృష్ణా: 211కి గాను 36 ఏకగ్రీవం గుంటూరు: 236కి గాను 70 ఏకగ్రీవం ప్రకాశం: 277కి గాను 69 ఏకగ్రీవం నెల్లూరు: 194కి గాను 35 ఏకగ్రీవం చిత్తూరు: 276కి గాను 62 ఏకగ్రీవం అనంతపురం: 308కి గాను 15 ఏకగ్రీవం వైఎస్ఆర్ జిల్లా: 175కి గాను 40 ఏకగ్రీవం కర్నూలు: 240కి గాను 57 ఏకగ్రీవం -
ఇక ప్రచార హోరే..
మెదక్ రూరల్: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి ఆరు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో విడతలో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 60 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 362 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు బీఫాంలను ఇచ్చిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారికి బ్యాట్, కత్తెర గుర్తులను కేటాయించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు తర్వాత 60 ఎంపీటీసీ స్థానాలకు చివరి రోజు 22 నామినేషన్లు ఉపసంహరించున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 26 నుండి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 60 ఎంపీటీసీ స్థానాలకు 454 నామినేషన్లు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం రెండేసి చొప్పున వచ్చిన నామినేషన్లను అధికారులు తొలగించగా మొత్తం 382 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 57 నామినేషన్లు వేయగా అందులో రెండేసి చొప్పున ఉన్న నామినేషన్లను తొలగించగా, మొత్తం 47 నామినేషన్లను పరిగణలోకి తీసుకున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు గురువారం నుండి ప్రచారాలను నిర్వహించనున్నారు. రెండో రోజు నామినేషన్లు ఇవే.. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం రెండో రోజు జోరుగా కొనసాగింది. ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలకు 18 మంది, 64 ఎంపీటీసీ స్థానాలకు 131 మంది నామినేషన్లను దాఖలు చేశారు. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఎనిమిది మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఆయా మండల కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించారు. -
మలివిడత పోరుకు ముగిసిన ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌కు ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఏప్రిల్ 18న 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించిన 97 నియోజకవర్గాల్లో మలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఇక కర్నాటకలో 14 లోక్‌సభ స్ధానాల్లో, మహారాష్ట్రలో 10, యూపీలో 8, అసోం, బిహార్, ఒడిసాల్లో ఐదేసి నియోజకవర్గాలు, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో మూడు, జమ్మూ కశ్మీర్లో రెండు, మణిపూర్, త్రిపుర, పుదుచ్చేరిల్లో ఒక్కో నియోజకవర్గంలో 18న పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఒకేసారి అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో ధనప్రవాహం అధికంగా ఉన్నట్టు గుర్తించిన ఈసీ ధన ప్రభావానికి చెక్ పెట్టేందుకు పలు చర్యలు చేపట్టింది. రెండో విడత పోలింగ్‌లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు రాజకీయ పార్టీలు దిగ్గజ నేతలతో పాటు తమ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచారానికి చివరిరోజు కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో పలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలో పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 115 నియోజకవర్గాల్లో ఈనెల 23న మూడో విడత పోలింగ్ జరగనుండటంతో అగ్రనేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టి సారించారు. -
518 వార్డులూ ఏకగ్రీవం
కొండమల్లేపల్లి : మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. జిల్లాలో 52 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, 518 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాల్లోని మొత్తం 304 గ్రామ పంచాయతీలు, 2,572 వార్డులకు ఎన్నికలు నిర్వహించేదుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అందుకు ఈనెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. ఉపసంహరణ గడువు ఆదివారం సాయంత్రంతో ముగియడంతో 52 గ్రామ పంచాయతీ సర్పం చ్‌లు ఏకగ్రీవమైట్లు అధికారులు ప్రకటించారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్లో నేటినుంచి ప్రచారం హోరెత్తనుంది. ఇక ప్రచారమే.. ఈనెల 21న దేవరకొండ డివిజన్లో జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో బరిలో ఉండే సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే అధికారులు సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి గుర్తులను కేటాయించడంతో బరిలో ఉండే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీ కానున్నారు. -
‘వల’స ఓటు
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఊళ్లో ఉన్న ఓటర్లే కాదు, పొట్టకూటì æకోసం వలసవెళ్లిన ఓటర్లూ ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేయనున్నారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల చూపంతా పట్నం వైపు మళ్లింది. హైదరాబాద్ ఇతర పట్టణాల్లో నివాసం ఉంటున్న పల్లె ఓటర్ల మద్దతు కూడగట్టే పనిలో బిజీ అయ్యారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లోని పోటీదారులు హైదరాబాద్‌కు పరుగులు పెడుతున్నారు. అక్కడున్న తమ గ్రామ ఓటర్లను ఒక దగ్గరకు పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు. ఎన్నికల రోజు గ్రామానికి వచ్చేందుకు రవాణా చార్జీలు ముందుగానే అప్పజెప్పడంతో పాటు అవసరమైతే ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వలసదారులతో పాటు యువకులు, విద్యావంతులు, ఉద్యోగులను ప్రత్యేకంగా కలిసి మద్దతు కోరుతున్నారు. మరి వలస ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో.. సాక్షి, మెదక్: జిల్లాలోని మొదటి విడుత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లో 154 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 136 పంచాయతీల్లో సర్పంచ్‌గా బరిలో ఉండేందుకు నామినేషన్లు వేశారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఎవరైనా ఉపసంహరించుకుంటే ఆ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగితా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వందకుపైగా పంచాయతీల్లో పోటీ ఉండే అవకాశం ఉంది. 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్ పదవికిపోటీ పడుతున్న నాయకులు ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో జరగనున్నాయి. రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల్లో వలసలు ఎక్కువగా ఉంటాయి. పాపన్నపేట, హవేళిఘనపూర్ మండలాల్లో వలసలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ వలసవెళ్లిన వారు ఐదు నుంచి ఆరువేల మంది ఉంటారు. ఎక్కువ మంది హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారి కూలీ, పరిశ్రమల్లో కార్మికులు, దుకాణాలు, మాల్స్, అపార్ట్స్‌మెంట్‌లో పనిచేస్తుంటారు. అలాగే కొంత మంది ఆటోలు నడుపుతున్నారు. మరికొంత మంది చెరుకుబళ్లు నడుపుతుంటారు. ఉపాధి కోసం పట్నంలో ఉన్నప్పటికీ వీరి ఓట్లు మాత్రం స్వగ్రామాల్లోనే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో గ్రామానికి వచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో సర్పంచ్ అభ్యర్తుల దృష్టి వలస ఓటర్లపై పడింది. వారి మద్దతుకూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతి గ్రామంలో వేల సంఖ్యలో.. పెద్దశంకరంపేట మండలంలోని మక్తలక్ష్మాపూర్, చీలపల్లి, బూర్గుపల్లి, వీరోజుపల్లి, జూకల్, కట్టెల వెంకటాపూర్ గ్రామాలకు చెందిన సుమారు ఐదువేల మంది బీరంగూడ, కూకట్పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పనిచేస్తూంటారు. ఆయా గ్రామాల నుంచి సర్పంచ్‌గా పోటీపడుతున్న నాయకులు రెండు రోజులుగా హైదరాబాద్ వెళ్లి వీరిని కలిసి మద్దతు కోరుతున్నారు. ఎన్నికల రోజు స్వగ్రామం వచ్చేందుకు వాహనాలు పెడుతున్నారు. అలాగే పోటా పోటీగా ఖర్చులకు డబ్బులు అప్పజెబుతూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. టేక్మాల్ మండలంలోని పల్వంచ, కాదులూరు, ఎల్లుపేట, ఎల్లంపల్లితాండ, అచ్చన్నపల్లి, టేక్మాల్, తంపులూరు చెందిన సుమారు 6వేల మంది హైదరాబాద్‌లోని బోయినిపల్లి చుట్టు పక్కల పనులు చేసుకుంటున్నారు. గ్రామాల్లో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు వలస ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. అల్లాదుర్గం మండలంలోని అప్పాజిపల్లి, రాంపూర్, కాయిగితంపల్లి, ముప్పారంతండా, చిల్వెర, బైరన్‌దిబ్బ, ముస్తాపూర్, మాందాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు కూకట్పల్లి, బాల్నగర్ ఏరియా , పటాన్చెరు ప్రాంతాల్లోని పరిశ్రమలు పనిచేస్తున్నారు. పాపన్నపేట మండలం కొంపల్లి, కొడుపాక, డాక్యాతండా, లింగాయిపల్లి, గాజులగూడెం, పాపన్నపేట, కందిపల్లి, గోదూరు గ్రామాల నుంచి వలసలు వెళ్లిన ఓటర్లు ఉన్నారు. రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లి, రేగోడ్, సంగమేశ్వర్తండా, కొండాపురం, జగిర్యాల, ఆర్.ఇటిక్యాల, చౌదరిపల్లి, గజ్వాడ గ్రామాలకు చెందిన సుమారు 3వేల మందికిపైగా ఓటర్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరి ఓట్ల కోసం ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఆరు మండలాల నుంచి ఉన్నతవిద్య కోసం హైదరాబాద్‌లో ఉంటున్న యుకువలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారిని, వ్యాపారస్తులను సైతం సర్పంచ్ పోటీదారులు కలిసి వారి మద్దతు కోరుతున్నారు. అయితే పట్నంలో ఉంటున్న పల్లె ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. -
పోటాపోటీగా...
కరీంనగర్: రెండో విడత ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో శనివారం నామినేషన్ల జోరు కొనసాగింది. పోటాపోటీగా ర్యాలీలు తీసి నామినేషన్ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు అందజేశారు. జిల్లావ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు 199 మంది, వార్డుసభ్యుల స్థానాల కోసం 970 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండోవిడతలో మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల్లోని 107 గ్రామపంచాయతీలకు, 1,014 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మానకొండూర్, తిమ్మాపూర్‌లో భారీగా.. మానకొండూర్‌లో 27 సర్పంచ్ స్థానాలుండగా 57 మంది, తిమ్మాపూర్‌లో 23 సర్పంచ్ స్థానాలకు 54 మంది నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల వేడిని పుట్టించారు. నామినేషన్ల దాఖలుతో గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. -
రెండో విడతా అదే జోరు
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని మనూరు, నాగల్గిద్ద, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, నారాయణఖేడ్ మండలాల పరిధిలోని 190 గ్రామ పంచాయతీలకు సంబంధించి 190 సర్పంచ్, 1,598 వార్డు పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. నారాయణఖేడ్ మండలంలో 51 గ్రామ పంచాయతీలు, 440 వార్డులు, మనూరులో 22 పంచాయతీలు, 176 వార్డులు, నాగల్గిద్దలో 31 పంచాయతీలు, 248 వార్డులు, కంగ్టిలో 34 పంచాయతీలు, 290 వార్డులు, కల్హేర్‌లో 26 పంచాయతీలు, 224 వార్డులు, సిర్గాపూర్‌లో 26 పంచాయతీలు, 212 వార్డులకు సంబంధించి అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఒక్కో మండలంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు 8 నుంచి 13వరకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10.30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5గంటలవరకు కొనసాగింది. మధ్యాహ్నం 12గంటల వరకు మందకొడిగా నామినేషన్లు రాగా మధ్యాహ్నం తర్వాత గ్రామాలు, తండాల నుంచి అభ్యర్థులు, వారి అనుచరులు తరలివచ్చారు. నారాయణఖేడ్ మండలానికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయం, దీని ఆవరణలోని సీఎల్ఆర్సీ భవనంలో నామినేషన్లు స్వీకరించారు. మనూరు, కల్హేర్, కంగ్టి ఉమ్మడి మండలాల వారీగా ఆయా మండలాల్లో నామినేషన్లు స్వీకరించారు. ఆయా పదవులకు పోటీచేసే అభ్యర్థులు తమ మద్దతుదారులు, గ్రామస్తులతో కలిసి డప్పుచప్పుళ్లు, బాజాభజంత్రీలు వాయిస్తూ తరలివచ్చారు. టీఆర్ఎస్ మద్దతుదారులు నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని, కాంగ్రెస్ మద్దతుదారులు ఆపార్టీ నాయకుడు నగేష్ షెట్కార్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను ఎంపీడీఓలు, తహసీల్దారులు పర్యవేక్షించారు. గిరిజన మహిళలు నామినేష్ల దాఖలుకు తరలివచ్చి సంప్రదాయ నృత్యాలు చేశారు. యువకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా డివిజన్లోని మండల పరిషత్ కార్యాలయాల నుంచి అన్ని మార్గాల్లో 100మీటర్ల పరిధిలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులతోపాటు వారిని ప్రతిపాదించే వారి ని మాత్రమే కార్యాలయ ఆవరణలోకి అనుమతించారు. మిగిలిన వారిని కార్యాలయం బయటే ఉంచారు. గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో పట్టణంలో ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. హోటళ్లు, టీకొట్లు కిక్కిరిసిపోయాయి. -
రెండో దశలోనూ భారీగా నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెండో దశ పంచాయతీ సమరానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని 181 పంచాయతీల సర్పంచ్‌గిరీ దక్కించుకునేందుకు ఆశావహులు పోటాపోటీగా రాత్రి పొద్దుపోయేవరకు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థా నాలకు 253 నామినేషన్లు వేయగా.. 1656 వార్డు స్థానాలకు తొలిరోజు 570 మంది నామినేషన్లు సమర్పించారు. అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల పరిధిలో ఈ నెల 25న పోలింగ్ జరుగనుంది. రాజధానికి అనుకొని ఉన్న ఈ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది. అలకలు, బుజ్జగింపులు, కుల, మత, వర్గ సమీకరణలతో పల్లెపోరు ఉత్కంఠగా మారింది. ప్రచారహోరు.. మొదటి దశ నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో ప్రచారం ఊపందుకుంది. అధికారికంగా కేవలం రెండు గ్రామాల సర్పంచ్ పోస్టులు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు ఈ పంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఆదివారం ఆఖరి గడువు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత తుది బరిలో నిలిచే అభ్యర్థుల ఎవరో తేలనుంది. ఇదిలావుండగా, నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో గ్రామాల్లో విందు, మందు, క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ నెల 21న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. -
తొలిరోజు భారీగా.. నామినేషన్లు
మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు నిర్వహించే మిర్యాలగూడ డివిజన్లో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం మంచి రోజు కావడం వల్ల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీగా నామినేషన్లు వచ్చాయి. రెండో విడతలో మొత్తం పది మండలాల్లో 276 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు, 2376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిం చనున్నారు. అందుకు పది మండలాల్లో 83 క్లస్టర్ పంచాయతీలలో నామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజ కవర్గాల పరిధిలో ఉన్న పది మండలాలో తొలిరో జు భారీగా నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థా నాలకు 437 మంది నామినేషన్లు, వార్డు సభ్యుల కు 576 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆరీ ్డఓ జగన్నాథరావు పలు క్లస్టర్ పంచాయతీలను ప ర్యటించి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. -
నామినేషన్ల హోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పల్లె పోరులో నామినేషన్లు వెల్లువెత్తాయి. ఈనెల 21న జరిగే గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు బుధవారం అర్ధరాత్రి వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సాగింది. సాయంత్రం 5 గంటలకే గడువు ముగిసినా ఆలోపే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి చేరుకున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణకు సమయం పట్టింది. జిల్లావ్యాప్తంగా తొలిదశలో 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రామ సర్పంచ్ పదవులకు 673 మంది 982 నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. అలాగే 1,580 వార్డు స్థానాలకు 3,684 మంది 4,735 నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణే కాదు.. పరిశీలనలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రాత్రి పొద్దుపోయే వరకు స్క్రూట్నీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో ఎన్ని నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఎనిమిది ఏకగ్రీవం! మొదటి దశలో ఎనిమిది గ్రామాల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పదవులకు సింగిల్ నామినేషనే దాఖలు కావడంతో గెలుపు లాంఛనప్రాయంగా మారింది. ఈనెల 13న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజు. కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి (నర్సింలు), జిల్లేడ్ చౌదరిగూడ మండలం ముష్టిపల్లి (యాదమ్మ), ఫరూఖ్‌నగర్ మండలంలోని ఉప్పరిగడ్డ తండా (రేఖాచందానాయక్), కొత్తూరు మండలం పరిధిలోని మల్లాపూర్ తండా (సభావట్ రవినాయక్), నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ (జెట్ట కుమార్), కాన్హా (సరిత)సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట సర్పంచ్ స్థానానికే కవిత ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆమె విజయం ఖాయమైంది. చింతకొండపల్లి గ్రామ సర్పంచ్‌గా పార్వతమ్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెండో దశకు నేటినుంచి నామినేషన్లు ఈ నెల 25న పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీలకు శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. రెండో దశలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, మంచాల, యాచారం. కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల పరిధిలోని 181 గ్రామ పంచాయతీలు, 1656 వార్డు స్థానాలకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. -
గుజరాత్లో ముగిసిన రెండవ విడత పోలింగ్
-
గుజరాత్లో ముగిసిన రెండవ విడత పోలింగ్
సాక్షి, గుజరాత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ మేవానీ (వడగావ్), సురేశ్ పటేల్ (మణినగర్) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ (గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున), డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ వంటి ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. -
గుజరాత్ రెండో విడత పోలింగ్.. లైవ్ అప్ డేట్స్
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. కాగా, 18న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ లో 2 కోట్ల 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ మేవానీ (వడగావ్), సురేశ్ పటేల్ (మణినగర్) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ (గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున), డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ వంటి ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, భారీ ఓటింగ్‌లో పాల్గొనాలంటూ ప్రజలకు పిలుపునిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Today is Phase 2 of the Gujarat elections. I request all those voting today to vote in record numbers and enrich this festival of democracy. — Narendra Modi (@narendramodi) December 14, 2017 - హర్దిక్ పటేల్ స్వగ్రామం విరామ్‌గామ్‌లో ఓటింగ్‌లో పాల్గొంటున్న ప్రజలు - ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ - ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ - ఓటింగ్‌లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్న హర్దిక్ పటేల్ తల్లి ఉషా పటేల్. ఓటు వేసినట్లు ఇంకు మార్క్ చూపిస్తున్న హర్దిక్ తండ్రి భరత్. - ఓటింగ్ అనంతరం మీడియా ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా - ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం శంకర్ సిన్హ్ వాఘేలా - అహ్మదాబాద్ వెజల్పూర్ లోని పోలింగ్ బూత్ నంబర్ 961 వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఆర్థికశాఖా మంత్రి అరుణ్ జైట్లీ - ఛోటా ఉదయ్‌పూర్‌లో సోదాలియా గ్రామంలో ఈవీఎం మొరాయించగా... పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నట్లు ఎన్నికల అధికారి గౌరంగ్ రానా తెలియజేశారు. - స్వగ్రామం విరామ్‌గామ్‌లో ఓటు వేసిన పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్. తమ వర్గందే విజయం అని మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు. - ఓటు వేసే ముందు మీడియాకు విజయ సంకేతం చూపిస్తున్న డిప్యూటీ సీఎం నితిన్ పటేల్. మెహసనాలోని కడిలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత జీవా భాయ్ పటేల్ పై నితిన్‌కు మధ్య గట్టి పోటీ నెలకొంది. - గాంధీనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీబీ స్వాయిన్. - ఆనంద్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 201 వద్ద ఓటు వేసిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ భరత్సిన్హ్ సోలంకి - మధ్యాహ్నం 12 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. - మరికాసేపట్లో సబర్మతిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పార్టీ మహిళా కార్యకర్తలు, చిన్నారులు. - కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహ్లి గాంధీనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యం. - ఓటింగ్ వేసేందుకు సబర్మతి రానిప్‌లో బూత్‌నంబర్ 115 వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ - క్యూలో నిల్చున్న ప్రధాని మోదీ - ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం - ఓటు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ - ఓటు వేసిన అనంతరం వేలి మార్క్‌ను చూపిస్తున్న దృశ్యం - ఓటు వేసిన అనంతరం బయట ప్రజలకు అభివాదం చేస్తూ... - తిరిగి బయలుదేరే ముందు ప్రజలకు, కార్యకర్తలకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సంకేతమిస్తున్న ప్రధాని మోదీ. - టీమిండియా మాజీ క్రికెటర్ నయన్ మోంగియా వడోదరాలోని అకోటాలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. - తొలి విడత పోలింగ్‌తో పోలిస్తే ఈవీఎం సమస్య కేసులు 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయని గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారి బీబీ స్వాయిన్ తెలిపారు. ఆ సమస్యను కూడా త్వరగతిన పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. - ఘట్లోడియా, మెహసనా పోలింగ్ బూత్‌ల నుంచి రెండు ఫిర్యాదులు అందాయని.. వాటిని పరిశీలించేందుకు తమ ప్రతినిధులు వెళ్లారని స్వాయిన్ వెల్లడించారు. - ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశాక రోడ్డు షో నిర్వహించటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత అశోక్ గెహ్లట్ ఆరోపించారు. ప్రధాని, ప్రధాని కార్యాలయం ఎన్నికల సంఘంపైనే ఎంత ప్రభావం చూపుతున్నారో దీనిని బట్టి అర్థమౌతోందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. - అహ్మదాబాద్, జమల్పూర్ ఖాదియా వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ. - మధ్యాహ్నం 2 గంటల వరకు 47.40 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ప్రకటించిన ఎన్నిక సంఘం. - సాయంత్రం 5 గంటలకు ముగిసిన పోలింగ్, 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదు -
బిహార్‌లో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
పాట్నా : బిహార్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రకియ గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో బిహార్‌లోని 38 జిల్లాలోని 60 బ్లాకుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 59.85 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అయితే ఇంతవరకు ఎక్కడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదన్నారు. కాగా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా... పలువురు తీవ్రంగా గాయపడ్డిన సంగతి తెలిసిందే.