మిర్యాలగూడ మండలంలో నామినేషన్ వేస్తున్న మహిళా అభ్యర్థి
మిర్యాలగూడ : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు నిర్వహించే మిర్యాలగూడ డివిజన్‌లో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం మంచి రోజు కావడం వల్ల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీగా నామినేషన్లు వచ్చాయి. రెండో విడతలో మొత్తం పది మండలాల్లో 276 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు, 2376 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిం చనున్నారు. అందుకు పది మండలాల్లో 83 క్లస్టర్ పంచాయతీలలో నామినేషన్ల ప్రక్రియ చేపట్టారు.
మిర్యాలగూడ, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజ కవర్గాల పరిధిలో ఉన్న పది మండలాలో తొలిరో జు భారీగా నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థా నాలకు 437 మంది నామినేషన్లు, వార్డు సభ్యుల కు 576 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆరీ ్డఓ జగన్నాథరావు పలు క్లస్టర్ పంచాయతీలను ప ర్యటించి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment