కొండమల్లేపల్లి : మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. జిల్లాలో 52 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, 518 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాల్లోని మొత్తం 304 గ్రామ పంచాయతీలు, 2,572 వార్డులకు ఎన్నికలు నిర్వహించేదుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అందుకు ఈనెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. ఉపసంహరణ గడువు ఆదివారం సాయంత్రంతో ముగియడంతో 52 గ్రామ పంచాయతీ సర్పం చ్‌లు ఏకగ్రీవమైట్లు అధికారులు ప్రకటించారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్‌లో నేటినుంచి ప్రచారం హోరెత్తనుంది.
ఇక ప్రచారమే..
ఈనెల 21న దేవరకొండ డివిజన్‌లో జరగనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో బరిలో ఉండే సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే అధికారులు సర్పంచ్, వార్డు స్థానాలకు సంబంధించి గుర్తులను కేటాయించడంతో బరిలో ఉండే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment