అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.
బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. కాగా, 18న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ లో 2 కోట్ల 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్‌సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ మేవానీ (వడగావ్), సురేశ్ పటేల్ (మణినగర్) వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ (గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున), డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ వంటి ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, భారీ ఓటింగ్‌లో పాల్గొనాలంటూ ప్రజలకు పిలుపునిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Today is Phase 2 of the Gujarat elections. I request all those voting today to vote in record numbers and enrich this festival of democracy.
— Narendra Modi (@narendramodi) December 14, 2017
- హర్దిక్ పటేల్ స్వగ్రామం విరామ్‌గామ్‌లో ఓటింగ్‌లో పాల్గొంటున్న ప్రజలు
- ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్
- ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్
- ఓటింగ్‌లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్న హర్దిక్ పటేల్ తల్లి ఉషా పటేల్. ఓటు వేసినట్లు ఇంకు మార్క్ చూపిస్తున్న హర్దిక్ తండ్రి భరత్.
- ఓటింగ్ అనంతరం మీడియా ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా
- ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం శంకర్ సిన్హ్ వాఘేలా
- అహ్మదాబాద్ వెజల్‌పూర్ లోని పోలింగ్ బూత్ నంబర్ 961 వద్ద ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఆర్థికశాఖా మంత్రి అరుణ్ జైట్లీ
- ఛోటా ఉదయ్‌పూర్‌లో సోదాలియా గ్రామంలో ఈవీఎం మొరాయించగా... పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నట్లు ఎన్నికల అధికారి గౌరంగ్ రానా తెలియజేశారు.
- స్వగ్రామం విరామ్‌గామ్‌లో ఓటు వేసిన పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్. తమ వర్గందే విజయం అని మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు.
- ఓటు వేసే ముందు మీడియాకు విజయ సంకేతం చూపిస్తున్న డిప్యూటీ సీఎం నితిన్ పటేల్. మెహసనాలోని కడిలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత జీవా భాయ్ పటేల్ పై నితిన్‌కు మధ్య గట్టి పోటీ నెలకొంది.
- గాంధీనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీబీ స్వాయిన్.
- ఆనంద్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 201 వద్ద ఓటు వేసిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ భరత్‌సిన్హ్ సోలంకి
- మధ్యాహ్నం 12 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
- మరికాసేపట్లో సబర్మతిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పార్టీ మహిళా కార్యకర్తలు, చిన్నారులు.
- కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహ్లి గాంధీనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యం.
- ఓటింగ్ వేసేందుకు సబర్మతి రానిప్‌లో బూత్‌నంబర్ 115 వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
- క్యూలో నిల్చున్న ప్రధాని మోదీ
- ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం
- ఓటు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
- ఓటు వేసిన అనంతరం వేలి మార్క్‌ను చూపిస్తున్న దృశ్యం
- ఓటు వేసిన అనంతరం బయట ప్రజలకు అభివాదం చేస్తూ...
- తిరిగి బయలుదేరే ముందు ప్రజలకు, కార్యకర్తలకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సంకేతమిస్తున్న ప్రధాని మోదీ.
- టీమిండియా మాజీ క్రికెటర్ నయన్ మోంగియా వడోదరాలోని అకోటాలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- తొలి విడత పోలింగ్‌తో పోలిస్తే ఈవీఎం సమస్య కేసులు 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయని గుజరాత్ ఎన్నికల ప్రధానాధికారి బీబీ స్వాయిన్ తెలిపారు. ఆ సమస్యను కూడా త్వరగతిన పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
- ఘట్లోడియా, మెహసనా పోలింగ్ బూత్‌ల నుంచి రెండు ఫిర్యాదులు అందాయని.. వాటిని పరిశీలించేందుకు తమ ప్రతినిధులు వెళ్లారని స్వాయిన్ వెల్లడించారు.
- ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశాక రోడ్డు షో నిర్వహించటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత అశోక్ గెహ్లట్ ఆరోపించారు. ప్రధాని, ప్రధాని కార్యాలయం ఎన్నికల సంఘంపైనే ఎంత ప్రభావం చూపుతున్నారో దీనిని బట్టి అర్థమౌతోందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
- అహ్మదాబాద్, జమల్‌పూర్ ఖాదియా వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ.
- మధ్యాహ్నం 2 గంటల వరకు 47.40 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ప్రకటించిన ఎన్నిక సంఘం.
- సాయంత్రం 5 గంటలకు ముగిసిన పోలింగ్, 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదు
Comments
Please login to add a commentAdd a comment