మణిపూర్‌ చివరి దశలో 76% ఓటింగ్‌  | Manipur Assembly Election 2022 Second Phase Live Updates In Telugu | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ చివరి దశలో 76% ఓటింగ్‌ 

Published Sat, Mar 5 2022 7:39 AM | Last Updated on Sun, Mar 6 2022 7:49 AM

Manipur Assembly Election 2022 Second Phase Live Updates In Telugu - Sakshi

Live Updates:
మణిపూర్‌ చివరి దశలో 76% ఓటింగ్‌ 
ఇంఫాల్‌: మణిపూర్‌ శాసనసభ చివరి దశ ఎన్నికలు శనివారం జరిగాయి. 6 జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,247 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సేనాపతి జిల్లాలోని కారోంగ్‌ అసెంబ్లీ స్థానం పరిధిలోని నగాంజ్మూ పోలింగ్‌స్టేషన్‌ వద్ద ఇద్దరిపై కాల్పులు జరిగినట్లు పోలీసులు చెప్పారు. దీంతో ఇక్కడ కొద్దిసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. చివరి దశలో 76.04% ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా సేనాపతి జిల్లాలో 82.02% శాతం, థౌబాల్‌ జిల్లాలో 78% ఓటింగ్‌ రికార్డయినట్లు వెల్లడించింది. మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత ఓ,.ఇబోబి సింగ్‌ థౌబాల్‌ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► మణిపూర్‌లో రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 47.16 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. 

మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. తౌబాల్ జిల్లాలోని పోలింగ్ కేంద్రం ఓట్లు వేయడానికి ప్రజలు క్యూకట్టారు.


‘నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని, తాము ఉద్యోగ అవకాశాల కోసం ఓటు వేస్తున్నాము’ అని ఓటు వేసిన యువతీయువకులు మీడియాతో పేర్కొన్నారు.

మణిపూర్ రెండో విడత పోలింగ్‌: ఉదయం 11 గంటల వరకు 28.19% ఓటింగ్ నమోదు
   మణిపూర్ రెండో విడత పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు 28.19 శాతం ఓటింగ్ నమోదైంది.

జిల్లాల వారీగా ఓటింగ్‌ శాతం:
1 తౌబల్ 29.55%
2 చందేల్ 28.24%
3 ఉఖ్రుల్ 30.66%
4 సేనాపతి 27.86%
5 తమెంగ్లాంగ్ 20.41%
6 జిరిబామ్ 32.68%

►మణిపూర్‌లో పోలింగ్ సంబంధిత హింసలో ఇద్దరు మృతి
మణిపూర్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా వేర్వేరుగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. స్థానిక మీడియా ప్రకారం.. మొదటి సంఘటన తౌబాల్ జిల్లాలో జరగగా, రెండవది సేనాపతి జిల్లాలో జరిగినట్లు సమాచారం.

►మణిపూర్‌లోని బీజేపీ నేత నివాసం వెలుపల పేలుడు
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో బీజేపీ బహిష్కరణకు గురైన ఛ బిజోయ్ నివాసం వద్ద గుర్తుతెలియని కొందరు దుండగులు బాంబును పేల్చినట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

రెండో విడత ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.40% ఓటింగ్ నమోదైంది

హీరోక్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాధేశ్యామ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయన మాట్లాడుతూ.. కనీసం 5000 ఓట్ల తేడాతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

మణిపూర్‌ ఎన్నికలు..ప్రధాని ట్వీట్:
నేడు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల ప్రజలందరూ అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. 


మణిపూర్ మాజీ సిఎం & కాంగ్రెస్ నాయకుడు ఓక్రమ్ ఇబోబి సింగ్ సాంకేతిక లోపం కారణంగా పోలింగ్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఆలస్యంగా ఓటు వేశారు.

మొదటి విడతలో ఫిబ్రవరి 28న పోలింగ్ జరిగిన 5 నియోజకవర్గాల్లోని 12 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఎలాంటి విరామం లేకుండా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లు‍ సమాచారం.

ప్రారంభమైన మణిపూర్ రెండో విడత ఎన్నికలు.. శనివారం 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇంఫాల్‌: మణిపూర్‌ అసెంబ్లీ చివరి, రెండో విడత పోలింగ్‌ శనివారం జరగనుంది. ఈ దశలో ఆరు జిల్లాలకు చెందిన 22 నియోజకవర్గాల్లోని 8.38 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 1,247 పోలింగ్‌ స్టేషన్లలో ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎలక్టోరల్‌ అధికారి రాజేష్‌ అగర్వాల్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement