
సాక్షి, అమరావతి: చెదురుమదురు ఘటనలు మినహా రెండో విడత ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలోనే జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు దాదాపు సగం పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయినట్టు తెలిపారు.
సాధారణ ఎన్నికల స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట గట్టి నిఘా ఉంటుందని తెలిపారు. మూడో విడతలోనూ అవాంతరాల్లేకుండా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ సూచించారు.