
కొచ్చి: కేరళ తొలి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి ఆర్ శ్రీలేఖ జేపీలో చేరారు. ధవారం తిరువనంతపురంలోని ఆమె నివాసంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారికంగా బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.
శ్రీలేఖ.. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. రాష్ట్ర కేడర్‌లో మొదటి మహిళా ఐపీఎస్. ఇక.. 2020లో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. తన నివాసంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ నుండి అధికారికంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన తర్వాత ఆమె అన్నారు.
బీజేపీలో చేరిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘ 33 ఏళ్లు పార్టీలకతీతంగా ఐపీఎస్ అధికారిగా పనిచేశా. కానీ నా పదవీ విరమణ తర్వాత చాలా సమస్యలను దూరం నుంచి చూడటం ప్రారంభించా. ప్రజాసేవ చేయడానికి ఇదే అత్యుత్తమ మార్గమని నాకు అర్థమైంది. బీజేపీ పార్టీ ఆదర్శాలపై నాకు నమ్మకం ఉంది’ అని అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment