Ex IPS officer
-
బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్
కొచ్చి: కేరళ తొలి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి ఆర్ శ్రీలేఖ జేపీలో చేరారు. ధవారం తిరువనంతపురంలోని ఆమె నివాసంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారికంగా బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. శ్రీలేఖ.. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. రాష్ట్ర కేడర్‌లో మొదటి మహిళా ఐపీఎస్. ఇక.. 2020లో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు. తన నివాసంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ నుండి అధికారికంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన తర్వాత ఆమె అన్నారు.బీజేపీలో చేరిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘ 33 ఏళ్లు పార్టీలకతీతంగా ఐపీఎస్ అధికారిగా పనిచేశా. కానీ నా పదవీ విరమణ తర్వాత చాలా సమస్యలను దూరం నుంచి చూడటం ప్రారంభించా. ప్రజాసేవ చేయడానికి ఇదే అత్యుత్తమ మార్గమని నాకు అర్థమైంది. బీజేపీ పార్టీ ఆదర్శాలపై నాకు నమ్మకం ఉంది’ అని అన్నారామె. -
ఏపీ మాజీ ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
ఒక్క ఉద్యోగీ బాబుకు ఓటెయ్యడు..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఉద్యోగీ, అధికారీ చంద్రబాబుకు ఓటేసే ప్రసక్తే లేదని, బాబుకు దక్కేదల్లా అశోక్ బాబు ఓటు మాత్రమేనని మాజీ ఐపీఎస్ అధికారి, వైఎస్సార్సీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ తేల్చి చెప్పారు. టెలి కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, సీఎం మీటింగులు, మంత్రుల మీటింగులతో ఉద్యోగుల శక్తి పూర్తిగా డస్సిపోతోందని, బాబు వ్యవహారంతో ఏపీ ఉద్యోగులు విసిగిపోయారని పేర్కొన్నారు. ఊహాలోకాల్లో విహరించే నేత సీనియర్ అయినా, అనుభవం ఉన్నా ఇక మనకు వద్దని ఆంధ్ర ప్రజానీకం తేల్చేసుకున్నారని, విద్య, ఆరోగ్యం అందరికీ అందిస్తానంటున్న జననేత జగన్‌కు ఈ దఫా ఎన్నికల్లో తిరుగులేకుండా పట్టం కట్టనున్నారంటున్న మహమ్మద్ ఇక్బాల్ అభిప్రాయం ఆయన మాటల్లోనే... వైఎస్సార్సీపీలో చేరాలని మీరెందుకు భావించారు? ఇప్పుడు సింగపూర్లు, ఊహాలోకాలు కాదు మనకు కావలసింది. వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి వెళుతున్నారు. చదువు, ఆరోగ్యం, రైతుల, గ్రామాల భవితమీద ఈ నాయకుడు దృష్టి పెడుతున్నాడు. దీనికి భిన్నంగా బాబు ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు. ఆయన కాళ్లు భూమ్మీద లేవు. 2022, 2030, 2050 ఇలా సంఖ్యల వల్లింపును జనం నమ్ముతారని నేననుకోవడం లేదు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే నాయకుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. వైఎస్సార్, బాబు పాలనలో తేడా ఏమిటి? వైఎస్సార్ ఎప్పుడు, ఏది మాట్లాడినా 25 నిమిషాలకు మించి మాట్లాడేవారు కాదు. బాబు మాత్రం ఎప్పుడు మాట్లాడినా రిపోర్టర్లు సైతం స్విచాఫ్ చేసుకుని కూర్చుంటారు. ఎక్కడ మాట్లాడినా, ఏది మాట్లాడినా సేమ్ స్పీచ్. అదే ప్రసంగం. వైఎస్సార్ మాట్లాడేది తక్కువ, పనిచేసేది ఎక్కువ. పైగా ఆయన ఉద్యోగులకు, అధికార్లకు స్వేచ్ఛ ఇచ్చేవారు. అదే బాబు ప్రభుత్వంలో మంత్రులకు కూడా ఫ్రీడమ్ లేదు. ఈరోజు మంత్రులు చేసే పనేమిటంటే, బాబు చెప్పినప్పుడల్లా ప్రతిపక్షనాయకుడినీ, ఇతర పార్టీలను తిట్టడం మాత్రమే. వైఎస్సార్ హయాంలో ఫలానా అధికారి, ఉద్యోగి టీడీపీ మద్దతుదారు. అన్నా కాస్త చూడండి అని ఎవరైనా పార్టీ మనుషులు రిపోర్ట్ చేస్తే వైఎస్ వెంటనే నో అనేవారు. అధికార్లు ఏ ప్రభుత్వం ఉంటే దానివద్ద పనిచేయాల్సిన వాళ్లు. వాళ్ల వద్ద మనం పనిచేయించుకోవాలి అనేవారు. అంత స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే అధికారులందరూ వైఎస్ హయాంలో తమ హృదయంతో పనిచేశారు. జన నాయకుడిగా జగన్‌పై మీ అభిప్రాయం? ఆయన ప్రజల ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టిన మనిషి. పేదరికాన్ని ఎలా తొలగించాలి? సంక్షేమ పథకాలను అందరికీ ఎలా అందించాలి? అట్టడుగున ఉన్నవారిని ఏవిధంగా పైకి తీసుకురావాలి? వీటిపైనే జగన్ దృష్టి పెడుతున్నారు. అంతేతప్ప హేతుబద్ధత, నైతికత ఏమాత్రం లేని వాగ్దానాలు చేయడం లేదు. సింగపూర్‌ని నిర్మిస్తాను. ప్రపంచ పటంలో న్యూయార్క్‌ని తలదన్నే సుందర నగరం నిర్మిస్తా అని అనటం లేదు. ఇంత తక్కువ కాలంలో మరో ఢిల్లీని ఏపీలో ఎలా నిర్మిస్తారు? నాలుగేళ్లలో రెండు బిల్డింగులు కూడా సరిగా కట్టలేకపోయారు. ఇంకో నాలుగేళ్లలో మరో రెండు బిల్డింగులు కట్టగలరు తప్ప.. దేశంలోనే తలదన్నే నగరాన్ని ఎలా కడతారు? వచ్చే ఎన్నికల్లో పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారు. 2014లో బాబుకు అనుభవం ఉంది జగన్‌కు ఆ అనుభవం లేదుకదా.. కాబట్టి ఈసారికి బాబుకే ఓటేద్దాం అని జనం భావించారు. కానీ ఆ అనుభవం ఏమిటో జనాలకు బాగానే తెలిసి వచ్చింది. మైత్రీబంధం ఉన్న కేంద్రం వద్ద నుంచే నిధులు తేలేకపోయారు. ప్యాకేజీ ముద్దు అని మొదలు పెట్టి ఇప్పుడు హోదాకు మారి యూటర్న్ తీసుకోవడం చూశారు. నాలుగేళ్లుగా భవంతుల నిర్మాణంపైనే దృష్టి పెట్టారు తప్ప పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలు గురించి ఆలోచించిన పాపాన పోకపోవడం కూడా జనం చూశారు. అందుకే వచ్చే ఎన్నికల పట్ల జనం చాలా స్పష్టంగానే ఉన్నారు. సందేహమే లేదు. బాబు పాలనపై అధికారులు ఏమనుకుంటున్నారు? ఒక్క అధికారి కూడా బాబు ప్రభుత్వ పనివిధానం పట్ల సంతృప్తితో లేరు. ఎందుకంటే వాళ్లు తాము చేసే పనిని ఆస్వాదించడం లేదు. రాబోయే రోజుల్లో మీరు చూడబోతారు. ఒక్క ఉద్యోగి కూడా టీడీపీ ప్రభుత్వానికి ఓటేయరు. ఈ విషయాన్ని నేను తేల్చి చెబుతున్నాను. అశోక్‌బాబు రాజకీయాల్లోకి వస్తే ఆయన ఒక్కరే టీడీపీకి ఓటేయవచ్చు. ఆయన తప్ప ఏ ఉద్యోగీ బాబుకు ఓటేయరు. ఎందుకంటే ఉద్యోగులు పని చేయాలనుకుంటున్నా ఈ ప్రభుత్వంలో పనిచేయలేక పోతున్నారు. సేవ చేయాలన్నా సేవ చేయించుకునే వాతావరణం లేక వాళ్లకు ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. ఉద్యోగులు, అధికారులు మొత్తంగా ఇలాగే ఫీలవుతున్నారు. వాళ్లు పనిచేసే వాతావరణమే లేదు. ఒకరు ఆఫీసర్ టెలీకాన్ఫరెన్స్ అంటారు. ఇక సీఎం దగ్గరనుంచి టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, మీటింగులు, తర్వాత పబ్లిక్ మీటింగులు, సీఎం మీటింగులు.. ఇవన్నీ అయిపోతే మంత్రుల మీటింగులు. ఈ స్థితిలో ప్రభుత్వ సేవకులుగా తాము ఎప్పుడు ఫలితాలు ఇవ్వగలుగుతాము అనే తీవ్ర ఒత్తిడిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. 2019లో ఏపీలో వచ్చేది ఏ ప్రభుత్వం? ఏ నాయకుడు మన సమస్యలు తీర్చగలరో వారిదే ప్రభుత్వం. మీ సింగపూర్లు, మీ రియల్ ఎస్టేట్లు, మీ దళారీ పనులు, మీ జన్మభూమి వ్యవస్థలు, ఈ దోపిడీలు వద్దు అని జనం విసిగిపోయి ఉన్నారు. పాలక పార్టీ నాయకులకు మేలు చేసే నీరు–మట్టి తరహా పథకాలు మాకొద్దు. మాకు కావలసింది విద్య, ఆరోగ్యం. వాటిని కల్పిస్తానని చెబుతున్న నాయకుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మాండంగా పట్టం కట్టబోతున్నారని నా అభిప్రాయం. ఆంధ్రప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఇప్పుడు మనకు కావలసింది సీనియారిటీ, అనుభ వం కాదు. ఇప్పుడు మనకు కావలసింది ప్రజల మౌలిక అవసరాలు తీర్చి, ప్రజల సంక్షేమాన్ని కోరే నాయకుడు కావాలి. ప్రజావసరాలను తీర్చడం అనే అంశంపైనే వైఎస్ జగన్ పాదయాత్ర మొత్తంలో ఆలోచిస్తున్నారు. ప్రజల ప్రాథమిక, మౌలిక అవసరాలను తీర్చే నాయకుడినే మనం ఎన్నుకుందాం. ఎక్కడో ఊహాలోకాల్లో విహరించే నాయకుడు సీని యరైనా, అనుభవం ఉన్నవాడైనా మనకు వద్దు. (ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2y1bVrA https://bit.ly/2JCdJsA -
మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌తో మనసులో మాట
-
వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు
-
వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన రంగనాథరాజు, ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేతను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలకు అధికార పార్టీ నేతలను, ప్రజలను ఆకర్శిస్తున్నాయి. రంగనాథరాజుతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం జక్కారంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్మీరెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ లక్ష్మీరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగిగా జీవితం గడుపుతున్న తనకు జననేత పాదయాత్ర స్ఫూర్తి కలిగించిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -
బీజేపీలో బేడీ సునామీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బీజేపీలో చేరడం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీయేనని, ఆమె నేతృత్వంలోనే స్థానిక నాయకత్వం పోటీ చేస్తుందనే భావం అంతటా బలపడిపోయింది. నిన్నామొన్నటిదాకా నరేంద్ర మోదీ మాత్రమే కనిపించిన బీజేపీ హోర్డింగులలో శుక్రవారం మార్పు కనిపించింది. మోదీతోపాటు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, కిరణ్ బేడీ చిత్రాలతో కొత్త హోర్డింగులు వెలిశాయి. బేడీకి అత్యధిక ప్రాధ్యాన్యమివ్వడమే కాకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రకటించడం బీజేపీకి చెందిన పలువురికి మింగుడు పడడం లేదు. అయితే ఈ విషయాన్ని బయటకు వెల్లడించడానికి వారు వెనకాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు అమిత్ షాలంటే ఉన్న భయభక్తులే ఇందుకు కారణం. బేడీ చే రిక వల్ల స్థానికంగా పార్టీ బలపడుతుందని ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు తమ అయిష్టతను పెదవి విరుపులతో ప్రకటిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా కలలు కన్న రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్ ట్వీట్‌తోపాటు వ్యాఖ్యలు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. బేడీ ప్రేరణాపూరిత నేతృత్వాన్ని తాను అంగీకరిస్తున్నానని,ఆమె నేతృత్వంలో విజయం లభిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిని చేసినా అభ్యంతరం లేదని అంటూనే ఆమె ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే విషయాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. కిరణ్ బేడీ చేరిక పార్టీలో కొందరికి ఇష్టం లేకపోయినా దానివల్ల పెద్ద ప్రభావం ఉండదని, పార్టీ అధిష్టానం ఇప్పటికే కిరణ్ బేడీకి పెద్ద పీట వేశారని గోయల్ అభిప్రాయపడ్డారు. కాగా బేడీకి అధిష్టానం ప్రాధాన్యమిస్తోందనే విషయం.... విలేకరుల సమావేశానికి ఆమె అమిత్‌షాతో కలసి ఆయన కారులోనే రావడంతోపాటు హర్షవర్ధన్, ప్రభాత్ ఝా తదితర ప్రముఖ నేతలందరూ హాజరుకావడంతో తేటతెల్లమైంది. కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ అనధికారికంగా ప్రకటించినట్లేనని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. మరోవపు తనకు పనిచేయడం, పనిచేయించడం కూడా వచ్చని ప్రకటించి, 40 సంవత్సరాల పాలన అనునుభవాన్ని ఉటంకించి కిరణ్ బేడీ ముఖ్యమంత్రి పీఠంపై తనకున్న ఆకాంక్షను చెప్పకనే చెప్పారు. ఆప్‌కు షాక్ కిరణ్ బేడీ... తమ పార్టీలో చేర్చుకోవడంద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది. స్థానికంగా బలమైన నేతలు లేనందువల్ల బీజేపీని మట్టికరిపించవచ్చనుకుంటున్న ఆప్ నేతలు తాజా పరిణామంతో ఉలిక్కిపడ్డారు. సతీష్ ఉపాధ్యాయపై చేసినంత సులువుగా కిరణ్ బేడీపై ఆరోపణలు గుప్పించలేమని ఆప్ నేతలు అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు తమతో కలిసి పనిచేసిన కిరణ్ బేడీపై అంతసులువుగా ఆరోపణలు చేయలేమని వారంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ పాపులారిటీ గ్రాఫ్ ఇటీవల వేగంగా పెరగడం గమనించిన బీజేపీ...ఆయనను దెబ్బతీయాలంటే బలమైన నేత అవసరమన్న విషయాన్ని గుర్తించిందని, అందులో భాగంగానే కిరణ్ బేడీని పార్టీలోకి చేర్చుకుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీ రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీ విజయవంతం కావడంతో విధానసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదిపిందని వారు అంటున్నారు.