ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన రంగనాథరాజు, ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేతను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలకు అధికార పార్టీ నేతలను, ప్రజలను ఆకర్శిస్తున్నాయి.