Lakshmi Reddy
-
వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచేది ఎవరు..?
జడ్చర్ల నియోజకవర్గం మంత్రి పదవిలో ఉంటూ టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి డాక్టర్ మల్లు రవిపై 45082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడ నుంచే గెలుపొందారు. లక్ష్మారెడ్డికి 94598 ఓట్లు రాగా, మల్లు రవికి 49516 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మదుసూదన్ యాదవ్‌కు 3600 ఓట్లు మాత్రమే వచ్చాయి. సి.లక్ష్మారెడ్డి రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండువేల పద్నాలుగులో లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎమ్.చంద్రశేఖర్‌కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి పాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి కొంతకాలం విప్ పదవిని నిర్వహించారు. అంతకు ముందు ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ అదికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్.పిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్.పిగా గెలుపొందారు. అనంత రాములు పీసీసీ అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు. మల్లురవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014, 2018లలో గెలుపొందారు. ఛీఫ్ విప్, ఉప సభాపతి పదవులను నిర్వహించారు. రవికి మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. జడ్చర్లలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, టిఆర్ఎస్ మూడుసార్లు గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 1994లో ఇక్కడ గెలిచిన ఎమ్. సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎమ్. చంద్రశేఖర్ గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత ఎన్.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు. జడ్చర్లలో ఏడుసార్లు రెడ్డి నేతలు, ఏడుసార్లు బిసి నేతలు (ప్రధానంగా ముదిరాజ్ వర్గం) గెలుపొందారు. ఇది జనరల్ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్.సి.నేత అయిన మల్లురవి పోటీచేసి గెలిచారు.మూడుసార్లు ఇతరులు గెలిచారు. జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరు చెరిపేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది చాలా బాధాకరమని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేసమయంలో చిత్రపరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం ఎంతో శ్రమించి అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే చిత్రపరిశ్రమలోని పెద్దలు ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పరని కేవలం చిత్రపురి కాలనీ అనే సంబోధించడం బాధాకరమన్నారు. చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి నెలకొల్పుతామని చిత్రపురి కమిటీకి 2 సంవత్సరాల క్రితం తాము నివేదిక పంపి, తాము ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఇప్పుడు చిత్రపరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం బాధాకరమని, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే అనుకోవచ్చునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డిలు మాట్లాడుతూ... పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని తాము వ్యతిరేకిండంలేదని, కాని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు సంవత్సరాల క్రితమే తాము ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చిత్రపురి కమిటీకి నివేదిక ఇచ్చామని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం, కమిటీ తమకు ఎంత స్థలం కేటాయించాలి అనే విషయం చర్చించడం, తాము అనుమతులు ఇతరత్రా పనుల్లో ఉండగానే తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి నిర్మిస్తాను అని ఓ సినీ ప్రముఖుడు ప్రకటించుకోవడం సరికాదన్నారు. తమకు అవకాశం ఇచ్చి స్థలం కేటాయిస్తే సంవత్సరంలోపు ఆసుపత్రి నిర్మించి పేద కళాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చిత్రపురి కాలనీలో ఉన్న పాఠశాలను ప్రైవేట్‌కు అప్పగించారని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మించి దాన్ని కూడా ప్రైవేట్‌కు అప్పగించరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. (క్లిక్: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి) -
నాదంటే.. నాదే: కడప టీడీపీలో రగులుతున్న చిచ్చు
సాక్షి, కడప: కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో టికెట్ చిచ్చు రగులుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ కడప టీడీపీ టికెట్ ముస్లింలకేనని ఓ వర్గం వాదిస్తుండగా.. వరుసగా ఓడిపోతున్న వారికి టికెట్ ఇచ్చేది లేదని, ఈసారి నాన్ మైనార్టీ వర్గానికే అని మరోవర్గం వాదిస్తోంది. పార్టీ అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో కడప టీడీపీ మైనారీ్ట, నాన్ మైనార్టీ వర్గాలుగా విడిపోయి రోడ్డుకెక్కింది. గత ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగాపోటీ చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అమీర్‌బాబు వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లోనూ తనకే టీడీపీ టికెట్ వస్తుందని, అధిష్టానం మద్దతు తనకేనని, కచ్చితంగా పోటీలో ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన వర్గీయులకు ఇదే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కడప సీటును మైనారీ్టల నుంచి తప్పించాలని టీడీపీలోని నాన్ మైనార్టీ వర్గం వేగంగా పావులు కదుపుతోంది. మైనార్టీలు అధికంగా ఉండే కడప నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఉంది. ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారీ్టతో వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రధానంగా ముస్లింలు వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో కడప అసెంబ్లీ టీడీపీ టికెట్ ముస్లింలకు కేటాయించినా మైనార్టీలు టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికే పరిస్థితి లేదని టీడీపీలోని నాన్ మైనార్టీ వర్గం చంద్రబాబు, లోకేష్‌లకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మైనార్టీలకు టికెట్ ఇచ్చినా ఓడిపోవడం మినహా గత్యంతరం లేదని, ఈసారి ఎన్నికల్లో నాన్ మైనార్టీ వర్గానికి టికెట్ ఇస్తే మిగిలిన వర్గాలను దగ్గర చేసుకోవచ్చని కడప అసెంబ్లీ పరిధిలోని కొందరు టీడీపీ నేతలు, జిల్లా స్థాయి టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు చెబుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: (శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్) ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి (వాసు), టీడీపీ సీనియర్ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి పోటీ పడుతున్నారు. శ్రీనివాసులురెడ్డి కడప పార్లమెంట్ అభ్యరి్థగా పోటీ చేయిస్తున్నట్లు ఇటీవల అన్నమయ్య జిల్లా పర్యటనలో చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఇదే జరిగితే శ్రీనివాసులురెడ్డి కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కడప బరిలో ప్రధాన పోటీ దారుగా ఉన్నారు. లక్ష్మిరెడ్డి లేదా ఆయన కోడలు, కడప నగరం 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి పోటీలో నిలిచే అవకాశం ఉంది. కడప నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీలోని ఓ వర్గం లక్ష్మిరెడ్డికే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీలో ఆది నుంచి పనిచేస్తున్న గోవర్దన్‌రెడ్డి, ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగి టీడీపీలో చేరిన హరిప్రసాద్‌లు సైతం కడప నుంచి పోటీకి సిద్ధమంటూ ప్రచారం చేస్తున్నారు. అమీతుమీకి సిద్ధమవుతున్న అమీర్‌బాబు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అమీర్‌బాబు రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన అమీర్‌బాబు ఆర్థికంగా భారీగా నష్టపోయినట్లు పార్టీలోని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. కడప నియోజకవర్గంలో ముస్లిం మైనారీ్టలు కీలక ఓటర్లుగా ఉన్నారు. అమీర్‌బాబు పోటీలో ఉంటే అంతో ఇంతో ముస్లిం వర్గం సైతం మద్దతు పలికే అవకాశం ఉందని, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే పారీ్టకి ముస్లిం మైనార్టీలు పూర్తిగా దూరమవుతారని ఆయన వర్గం వాదిస్తోంది. ఇదే జరిగితే టీడీపీ నుంచి నాన్ మైనార్టీ అభ్యర్థి పోటీ చేసినా డిపాజిట్ దక్కదని ఆ వర్గం తేల్చి చెబుతోంది. రోడ్డున పడిన వర్గ విబేధాలు అమీర్‌బాబుకు టిక్కెట్‌రాకుండా సొంత పార్టీలోని మరోవర్గం అడుగడుగునా అడ్డుకుంటోంది. అమీర్‌బాబు ఇప్పటివరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఇటీవల ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అమీర్‌బాబు హాజరు కాకముందే ఆయన వ్యతిరేకవర్గం కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించింది. అక్కడికి చేరుకున్న అమీర్‌బాబు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తాను రాకుండానే కార్యక్రమం ఎలా చేస్తారంటూ ప్రశ్నించే ప్రయత్నం చేయగా, వైరివర్గం ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు ఆలస్యంగా వస్తే మేము చూస్తుండాలా...అంటూ ఏకంగా ఘర్షణకు దిగింది. దీంతో ఇరు వర్గాలు రోడ్డుపైనే కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో కడప టీడీపీ వర్గాలుగా విడిపోయి రోడ్డున పడింది. -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు
-
వైఎస్సార్సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన రంగనాథరాజు, ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేతను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలకు అధికార పార్టీ నేతలను, ప్రజలను ఆకర్శిస్తున్నాయి. రంగనాథరాజుతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం జక్కారంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్మీరెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ లక్ష్మీరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగిగా జీవితం గడుపుతున్న తనకు జననేత పాదయాత్ర స్ఫూర్తి కలిగించిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి -
చెట్టుకూ విశ్రాంతి అవసరమే!
కడప అగ్రికల్చర్: మామిడి కాయల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలా మంది రైతులు కోతల తర్వాత తోటల్ని పట్టించుకోరు. దీనివల్ల చీడపీడల దాడి పెరిగి తదుపరి పంటపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాయల దిగుబడి, నాణ్యత దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో కాయల కోత అనంతరం మామిడి రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ (రిటైర్డ్) వేంపల్లె లక్ష్మీరెడ్డి అందిస్తున్న సూచనలు... కత్తిరింపులు ఎందుకు చేయాలి? మామిడి ఆకులు సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. దీనివల్ల చెట్టుకు కావాల్సిన ఆహార పదార్థాలు సమృద్ధిగా సమకూరుతాయి. అయితే ఓ అధ్యయనం ప్రకారం... చెట్టు గుబురుగా ఉండడం వల్ల సుమారు 85% ఆకులకు తగినంత సూర్యరశ్మి తగలడం లేదు. అవి దాదాపుగా నీడలోనే ఉంటున్నాయి. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతోంది.పైగా ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమంటే జామ, సీతాఫలం వంటి చెట్ల ఆకులతో పోలిస్తే మామిడి ఆకులకు సూర్యరశ్మిని గ్రహించే శక్తి కాస్త తక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెట్టుకు ఆహార పదార్థాలు (పిండి పదార్థాలు) పూర్తి స్థాయిలో లభించాలంటే అన్ని ఆకుల పైన సూర్యరశ్మి పడాలి. ఇందుకోసం కొమ్మల కత్తిరింపు తప్పనిసరి. దీనివల్ల చెట్లకు చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. ఎలా చేయాలి? కాయలు కోసిన తర్వాత 15-20 రోజుల పాటు చెట్లకు విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే అప్పటి వరకు చెట్లు కాయల వృద్ధికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తాయి. కోత తర్వాత అవి నీరసిస్తాయి. కాబట్టి చెట్లకు తగినంత విశ్రాంతి ఇచ్చిన తర్వాతే కొమ్మల కత్తిరింపు జరపాలి. ఆగస్ట్ మొదటి పక్షం లోగా కత్తిరింపులు పూర్తి చేయాలి. ఇందుకోసం అడ్డదిడ్డంగా పెరిగిన, తెగులు సోకి ఎండిపోయిన కొమ్మల్ని పూర్తిగా తొలగించాలి. అలాగే నేలను తాకుతూ వ్యవసాయ పనులకు అడ్డుగా ఉన్న కొమ్మల్ని కత్తిరించాలి. ఎండిన పూత కాడల (కొరడాలు) కారణంగా ఎండు తెగులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు పడకముందే వాటిని కూడా తీసేయాలి. సూర్యరశ్మి, గాలి బాగా ప్రసరించేందుకు వీలుగా గుబురుగా పెరిగిన చెట్ల తల పైన 3-4 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని తీసేయాలి. దీనివల్ల మధ్యాహ్నపు ఎండ చెట్టు మొదలుపై పడుతుంది. అవసరమైతే తూర్పు-పడమర దిశలో కూడా 2-3 అంగుళాల మందం ఉన్న కొమ్మల్ని దిశకు ఒకటి చొప్పున తొలగించాలి. ఈ విధంగా కత్తిరింపులు చేస్తే ఆకులకు సూర్యరశ్మి బాగా తగులుతుంది. ఆల్ఫోన్సో (కాధర్), బంగినపల్లి (బేనిషాన్) రకాల చెట్లు ప్రతి సంవత్సరం కాపుకు వచ్చి, మంచి దిగుబడులు అందించాలంటే జూలైలో అన్ని చిరుకొమ్మల్ని 10 సెంటీమీటర్ల వెనక్కి (ఆకులు గుంపుగా ఉన్న చోటుకు అంగు ళం పైకి) కత్తిరించాలి. దీనివల్ల ప్రతి కొమ్మ పైన 3-4 చిగురు కొమ్మలు పుడతాయి. వాటిలో ఆ రోగ్యంగా, దృఢంగా ఉన్న కొమ్మలు డిసెంబర్ నాటికి ముదిరి, జనవరిలో పూతకు వస్తాయి. తల మార్పిడి చేయాలంటే... నాటు రకం చెట్లు, తక్కువ దిగుబడిని అందించే చెట్లు, మార్కెట్లో మంచి ధర పలకని రకాలకు చెందిన చెట్లు... ఇలాంటి చెట్ల వల్ల రైతుకు ఆదాయం సరిగా రాదు. వీటి నుంచి కూడా నాణ్యమైన, అధిక దిగుబడులు పొందాలంటే తల మార్పిడి (టాప్ వర్కింగ్) చేయాలి. కాయల కోత తర్వాత జూలైలో కొమ్మలన్నింటినీ 4-5 అడుగుల పొడవు ఉంచి, రంపంతో కోసేయాలి. వాటిపై పుట్టుకొచ్చే లేత కొమ్మలకు సెప్టెంబర్‌లో మంచి రకాల కొమ్మలతో అంట్లు కట్టాలి. కత్తిరింపుల తర్వాత... కత్తిరింపులు చేసిన వెంటనే కోసిన భాగంపై మందు ద్రావణాన్ని పూయాలి. లీటరు నీటికి 10 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+6 గ్రాముల కార్బరిల్ చొప్పున కలిపి మందు ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. అలాగే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+10 గ్రాముల యూరియా చొప్పున కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. అంతర సేద్యం చేయాలి కాయల కోత తర్వాత తోటల్లో పడిన టెంకలు, ఎండు పుల్లల్ని ఏరి కాల్చేయాలి. జూలైలో వర్షాలు పడగానే భూమిని 2-3 సార్లు దున్నాలి. చెట్ల కింద దున్నడం కుదరకపోతే పారతో మట్టిని కలపాలి. సెప్టెంబర్ తర్వాత భూమిని దున్నకపోవడమే మంచిది. ఎరువులు ఇలా... రాలిపడిన ఎండుటాకుల్ని చెట్ల పాదుల్లో వేసి, మట్టితో కప్పేస్తే ఆ తర్వాత అవి కుళ్లి సేంద్రియ పదార్థంగా మారతాయి. చెట్లకు బలాన్నిస్తాయి. జూలై-ఆగస్ట్ నెలల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు చల్లి పూత దశలో మొక్కల్ని భూమిలో కలియదున్నాలి. జూలై-ఆగస్ట్‌లో ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు వేయాలి. నీటి వసతి ఉంటే... చెట్టుకు కిలో యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసి తడి ఇవ్వాలి. వర్షాధారపు తోటల్లో ఒక్కో చెట్టుకు 2 కిలోల యూరియా, 5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. చెట్టు మొదలుకు 4-5 అడుగుల దూరంలో గాడి తీసి, అందులో ఎరువులు వేసి మట్టితో కప్పేయాలి.