వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రంగనాథ రాజు
సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పార్టీలో చేరారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన రంగనాథరాజు, ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేతను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర, ఆయన ప్రకటించిన నవరత్నాలకు అధికార పార్టీ నేతలను, ప్రజలను ఆకర్శిస్తున్నాయి.
రంగనాథరాజుతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం జక్కారంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని లక్ష్మీరెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ లక్ష్మీరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగిగా జీవితం గడుపుతున్న తనకు జననేత పాదయాత్ర స్ఫూర్తి కలిగించిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని అన్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment