సాక్షి, శ్రీకాకుళం : జనం కోసం శ్రమిస్తున్న నాయకుడిని ఊళ్లన్నీ కలిసి ఊరేగిస్తున్నాయి. ప్రజాసంక్షేమం కోసం అడుగులు వేస్తున్న శ్రామికుడికి పల్లెలు పట్టం కడుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఊరూరా తిరుగుతున్న రాజన్న బిడ్డ... పేదవాడి గుండె గూటికి చేరవుతున్నారు.ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ సాగుతున్న ప్రజాసంకల్పయాత్ర... రాజకీయంగా చరిత్రను సృష్టించడేమ కాదు... సాయం కోరిన వారికి న్యాయం చూస్తూ సాగుతోంది. వైఎస్ జగన్‌పైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నామంటూ... జనం ఆయన తోడై నడుస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రను దిగ్విజయం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వైఎస్ జగన్ పాదయాత్ర పూర్తికానున్న తరుణంలో... ఒక్కో అడుగు ఒక్కో జ్ఞాపకం కావాలని ప్రజలు తాపత్రయపడుతున్నారు. మొత్తంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ పాదయాత్ర ఒక పండుగలా సాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ను దళిత మహాసేన కలిసింది. దళితులకు అండగా ఉండాలని దళిత మహాసేన నాయకులు జననేతను కోరారు. చంద్రబాబు హయాంలో దళితులపై టీడీపీ నేతల దాడులు పెరిగిపోయాయని ప్రతిపక్షనేతకు వివరించారు.
ఇచ్ఛాపురంలో భారీ పైలాన్
జననేత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాదయాత్ర దిగ్విజయంగా ముగింపు దశకు చేరుకుంది. ప్రజాసంకల్పయాత్ర విజయానికి గుర్తుగా ...ఆ మహాఘట్టాన్ని ఆవిష్కరించేలా విజయస్థూపం ఏర్పాటు చేయనున్నారు. పాదయాత్ర ముగింపు రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం శివార్లలో ఏర్పాటు చేసిన పైలాన్ చిరస్మరణీయంగా నిలిచిపోనుందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. లక్షలాది మంది అభిమానులు, ప్రజల మధ్య జననేత ఈ పైలాన్‌ను ఆవిష్కరించ నున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా..యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్న ఈ పైలాన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Published Sun, Jan 6 2019 8:02 PM | Last Updated on Sun, Jan 6 2019 9:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment