సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 338వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం లక్కవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసపురం, జింకిభద్ర క్రాస్, సోంపేట, ఇసకపాలెం క్రాస్, మండపల్లి క్రాస్ మీదుగా తలతాంపారి వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు.
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని అవిష్కరించిన వైఎస్ జగన్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల అవినీతిపై ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవిష్కరించారు. ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికిక వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, పపాలకొండ ఎమ్మెల్యే కళావతి, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం నియోజకవర్గం సమన్వయకర్త పరియా సాయిరాజ్, పాతపట్నం నియోజకవర్గం సవన్వయకర్త రెడ్డి శాంతిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment