జడ్చర్ల నియోజకవర్గం
మంత్రి పదవిలో ఉంటూ టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్.పి డాక్టర్ మల్లు రవిపై 45082 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లక్ష్మారెడ్డి ఇంతకుముందు రెండుసార్లు ఇక్కడ నుంచే గెలుపొందారు. లక్ష్మారెడ్డికి 94598 ఓట్లు రాగా, మల్లు రవికి 49516 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన మదుసూదన్ యాదవ్‌కు 3600 ఓట్లు మాత్రమే వచ్చాయి.
సి.లక్ష్మారెడ్డి రెండువేల నాలుగులో టిఆర్‌ఎస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. రెండువేల పద్నాలుగులో లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మల్లు రవిపై 14734 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. టిడిపి-బిజెపి కూటమి పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎమ్.చంద్రశేఖర్‌కు 11465 ఓట్లు మాత్రమే వచ్చి ఓటమి పాలయ్యారు. మల్లు రవి 2008లో జరిగిన ఉపఎన్నికలో గెలిచి కొంతకాలం విప్ పదవిని నిర్వహించారు. అంతకు ముందు ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ అదికార ప్రతినిధిగా కూడా ఉన్నారు.
నాగర్ కర్నూల్ ఎమ్.పిగా కూడా రెండుసార్లు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సోదరుడు మల్లు అనంతరాములు కూడా నాగర్‌కర్నూల్ నుంచి ఎమ్.పిగా గెలుపొందారు. అనంత రాములు పీసీసీ అధ్యకక్షుడిగా కూడా పనిచేశారు. మల్లురవి మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి 2009, 2014, 2018లలో గెలుపొందారు. ఛీఫ్ విప్, ఉప సభాపతి పదవులను నిర్వహించారు. రవికి మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత నేత కోనేరు రంగారావు మామ అవుతారు. జడ్చర్లలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి నాలుగుసార్లు, తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు, టిఆర్‌ఎస్ మూడుసార్లు గెలిచాయి.
ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. 1994లో ఇక్కడ గెలిచిన ఎమ్. సత్యనారాయణ హత్యకు గురి అయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికలోను, 1999లోను, తిరిగి 2009లోను సత్యనారాయణ సోదరుడు ఎమ్. చంద్రశేఖర్ గెలుపొందారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నేత ఎన్.నరసప్ప, టిడిపి నేత కృష్ణారెడ్డి రెండేసి సార్లు గెలిచారు. జడ్చర్లలో ఏడుసార్లు రెడ్డి నేతలు, ఏడుసార్లు బిసి నేతలు (ప్రధానంగా ముదిరాజ్ వర్గం) గెలుపొందారు. ఇది జనరల్ సీటు అయినా ఉప ఎన్నికలో ఎస్.సి.నేత అయిన మల్లురవి పోటీచేసి గెలిచారు.మూడుసార్లు ఇతరులు గెలిచారు.
జడ్చర్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment