Conspiracy To Erase Name Of Dr Prabhakar Reddy In Chitrapuri Colony - Sakshi
Sakshi News home page

చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేరు చెరిపేసే కుట్ర

Published Mon, Aug 22 2022 2:38 PM | Last Updated on Mon, Aug 22 2022 3:40 PM

Conspiracy to Erase Name of Dr Prabhakar Reddy in Chitrapuri Colony - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి కుమార్తె విశాలాక్షి

సాక్షి, హైదరాబాద్‌: చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది చాలా బాధాకరమని డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాస్‌ నుంచి చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేసమయంలో చిత్రపరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం ఎంతో శ్రమించి అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే చిత్రపరిశ్రమలోని పెద్దలు ఎప్పుడు ప్రభాకర్‌ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పరని కేవలం చిత్రపురి కాలనీ అనే సంబోధించడం బాధాకరమన్నారు. 

చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఆసుపత్రి నెలకొల్పుతామని చిత్రపురి కమిటీకి 2 సంవత్సరాల క్రితం తాము నివేదిక పంపి, తాము ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఇప్పుడు చిత్రపరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం బాధాకరమని, డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే అనుకోవచ్చునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డిలు మాట్లాడుతూ... పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని తాము వ్యతిరేకిండంలేదని, కాని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు సంవత్సరాల క్రితమే తాము ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చిత్రపురి కమిటీకి నివేదిక ఇచ్చామని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం, కమిటీ తమకు ఎంత స్థలం కేటాయించాలి అనే విషయం చర్చించడం, తాము అనుమతులు ఇతరత్రా పనుల్లో ఉండగానే తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి నిర్మిస్తాను అని ఓ సినీ ప్రముఖుడు ప్రకటించుకోవడం సరికాదన్నారు. 

తమకు అవకాశం ఇచ్చి స్థలం కేటాయిస్తే సంవత్సరంలోపు ఆసుపత్రి నిర్మించి పేద కళాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చిత్రపురి కాలనీలో ఉన్న పాఠశాలను ప్రైవేట్‌కు అప్పగించారని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మించి దాన్ని కూడా ప్రైవేట్‌కు అప్పగించరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. (క్లిక్‌: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement