prabhakar reddy
-
57 ఎకరాలు.. రూ.22.80 కోట్లు
జోగిపేట(అందోల్): ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 57 ఎకరాల వ్యవసాయ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు రియల్టర్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ అనిల్‌కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అందోలు శివారులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన అంజమ్మ, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డిలకు 57 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నారాయణఖేడ్ పరిధిలోని ర్యాకల్ గ్రామానికి చెందిన సంజీవరెడ్డి, దెగుల్వాడీ గ్రామానికి చెందిన సుధాకర్, ముకుందానాయక్ తండాకు చెందిన రవీందర్‌లు రియల్టర్లు. వీరు ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు చెందిన వ్యవసాయభూమిని ఎకరాకు రూ.39 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్టు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇదే భూమిని హైదరాబాద్‌కు చెందిన యాదగిరిరెడ్డికి ఎకరాకు రూ.40 లక్షలు చొప్పున రూ.22.80 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ కింద మే 3వ తేదీన యాదగిరిరెడ్డి తన స్నేహితుడు వాసుదేవరెడ్డి ఖాతా ద్వారా రూ.11లక్షలు సంజీవరెడ్డికి చెల్లించారు. నెలరోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంజీవరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో యాదగిరిరెడ్డికి అనుమానం వచి్చంది. దీంతో అందోలు గ్రామంలోని ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆరా తీయగా.. తాము ఈ భూమిని ఎవరికి విక్రయించలేదని చెప్పడంతో యాదగిరిరెడ్డి కంగుతిన్నాడు.తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ కాపీలను చూపించగా, అవి నకిలీవని తేలాయి. దీంతో సంగారెడ్డి ఎస్పీ రూపే‹Ùకు ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు జోగిపేట సీఐ నేతృత్వంలోని పోలీసుల బృందం విచారణ చేపట్టింది. నిందితులు సంజీవరెడ్డి, సుధాకర్, రవీందర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శివ, హోంగార్డు సురేశ్‌లను సీఐ అభినందించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు. -
ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతుండడంతో ఓటమి భయం పట్టుకున్న ఆ పార్టీ అభ్యర్థులు చివరికి అడ్డదారులు ఎంచుకున్నారు. ఆయారాం, గయారాంలను గుర్తించి ప్యాకేజీ ఆఫర్లతో వారిని కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి ఆ పార్టీ ఓడిపోయాక అధికారం కోసం వైఎస్సార్సీపీ చెంత చేరిన నేతలే ఇప్పుడు టీడీపీ నేతల ప్యాకేజీలకు కక్కుర్తిపడుతున్నారు. నిఖార్సైన వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వారిచ్చే ప్యాకేజీలకు లొంగకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక టీడీపీ నేతల బరితెగింపును చూస్తున్న ఓటర్లు మాత్రం వారిని ఛీదరించుకుంటున్నారు. తాజాగా.. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రరెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రూ.3 కోట్లు ఆఫర్ ఇవ్వడం బట్టబయలు కావడంతో టీడీపీ అభ్యర్థుల బాగోతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. వేమిరెడ్డి దంపతులు ఓట్ల కొనుగోలుకు నోట్ల కట్టలను విచ్చలవిడిగా విసురుతున్నారు. గంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు భారీ మొత్తంలో ఎరవేస్తున్నారు. ఇటీవల కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో మత్స్యకార గ్రామాల్లో దురాయి ఆచారాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ల కొనేందుకు రూ.80 లక్షలకు బేరం పెట్టిన విషయం బయటకు పొక్కింది. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో వీరు తాజాగా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించారు. ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలు.. ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఆఫర్ చేస్తునారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలతోపాటు స్థానిక లీడర్లకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున రేటు ఫిక్స్ చేశారు. వీరి పరిధిలో ఓట్లు వేయించే బాధ్యత మీదే అంటూ టార్గెట్లు పెడుతున్నారు. అలాగే, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కందుకూరు నియోజకవర్గాలతో పాటు తన సతీమణి పోటీచేస్తున్న కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు రేట్లు ఫిక్స్చేసి ప్రలోభాలకు గురిచేయడం వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కోవూరు నియోజకవర్గంలో ఆయారాం, గయారాంలను ఒకొక్కరిని రహస్యంగా తమ శిబిరాలకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. బుచి్చరెడ్డిపాళెం మండలంలోని వవ్వేరు బ్యాంకు చైర్మన్లుగా పనిచేసిన ఇద్దరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఒకరు గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేసిన నేత కావడం గమనార్హం. ఎన్నికల వేళ ప్యాకేజీ ఆఫర్ పెంచుకుని తిరిగి సొంత పార్టీలోకి మారారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. అలాగే, జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ కూడా ఇదే తరహా ప్యాకేజీలతో పార్టీ ఫిరాయించారని చెబుతున్నారు. నేతలకు ప్యాకేజీలతో పాటు ఓటర్లకు సైతం భారీగానే డబ్బులిస్తామని, ఆ డబ్బుల పంపిణీ బాధ్యత కూడా మీదే అని ఆశపెట్టి మరీ పార్టీ కండువా కప్పుతున్నారు. ఇలా ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఏర్పాటుచేసుకున్న టీమ్‌తో వ్యవహారాలు నడిపిస్తున్నారు. రివర్స్ అవుతున్న ఓటర్లు.. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతులు మండల స్థాయి నేతలకు రూ.కోట్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ప్యాకేజీలు ఇస్తున్నారు. ప్యాకేజీలు తీసుకున్న వారు ఈ దఫా ఎన్నికల్లో ప్రశాంతిరెడ్డికి ఓట్లు వేద్దామని స్థానికులకు చెబుతుండడంతో ‘ఎంత డబ్బులు తీసుకున్నారు వాళ్ల దగ్గర’.. అంటూ భగ్గుమంటున్నారు. తమకు సీఎం జగన్ రూ.లక్షల్లో సాయం అందించారని, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్లకు ఓటేసి ఆయనకు ద్రోహం చేయలేమని ఓటర్లు తెగేసి చెబుతున్నారు. -
కర్నూలు పెద్దాస్పత్రిలో అరుదైన ఆపరేషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగంలో మూడు రోజుల్లో ముగ్గురికి మూడు క్లిష్టమైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను కార్డియోథొరాసిక్ హెచ్‌వోడీ డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి ఆదివారం వివరించారు. ♦ ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మ (64)కు గుండెలో మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి. వయసు, గుండె పరిస్థితి రీత్యా ఆపరేషన్ చేయడం చాలా కష్టం. కానీ ఆమెకు అధునాతన బీటింగ్ హార్ట్ సర్జరీ విధానంలో విజయవంతంగా ఆపరేషన్ చేయడం వల్ల కోలుకుంది. ఆమెకు కాలిలో నరాలు కూడా సరిగా లేకపోవడంతో ఛాతిలో నుంచే నరాలు తీసి వేశాం. ♦ వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన పెద్దిరాజు(47) హార్ట్ ఫెయిల్యూర్‌తో ఆసుపత్రికి వచ్చాడు. అతనికి మైట్రల్ కవాటం చెడిపోయింది. యాంజియోగ్రామ్ చేయగా గుండె రక్తనాళాల్లో రెండు బ్లాక్‌లు గుర్తించాం. ఇప్పుడు అతనికి మైట్రల్ కవాటాన్ని మార్చడంతో పాటు బైపాస్ ఆపరేషన్ చేయాలి. మైట్రల్ కవాటాన్ని ప్లాస్టిక్ కవాటంగా మార్చడమే గాక, కాలి నుంచి సిరలను తీసి రక్తనాళాలకు బైపాస్ చేయడం వంటి ప్రక్రియను ఒకేసారి చేశాం. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో అతను కోలుకున్నాడు. పల్మనరి హైపర్ టెన్షన్ అనే సమస్య ఉండటంతో రికవరీ కొంచెం కష్టమైంది. ♦ఎమ్మిగనూరుకు చెందిన సరోజ(30)కు టీబీ. ఊపిరితిత్తుల్లో ఫంగల్ బాల్ చేరి, దగ్గితే రక్తం పడుతుండేది. ఇది ఒక్కోసారి ఎక్కువగా పడితే ప్రాణాపాయం ఏర్పడుతుంది. దీనిని ఆపడం చాలా కష్టం. ఆపరేషన్ చేసి ఆ ఊపిరితిత్తిని తొలగించడమే మార్గం. దీన్ని సైతం విజయవంతంగా నిర్వహించాం. ఇంత పెద్ద ఖరీదైన ఆపరేషన్లు అన్నీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా నిర్వహించాం’ అని డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌ను బద్నాం చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను బద్నాం చేసేందుకు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై జరిగే దాడులతో కాంగ్రెస్‌కు సంబంధం లేకపోయినా తమకు అంటగట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటనలో కాంగ్రెస్ ప్రమేయం ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసిందని, కానీ ఆ దాడిలో కుట్ర కోణం లేదని, సంచలనం కోసమే నిందితుడు దాడి చేశాడని పోలీసులు చెప్పారన్నారు. ఈ కేసులో ఇంతవరకు రిమాండ్ రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి ఘటనను కూడా రాజకీయం చేస్తున్నారని, పరామర్శ పేరుతో మంత్రి కేటీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని వ్యాఖ్యానించారు. మరో 15 రోజుల్లో ఇలాంటి దాడులు ఇంకా జరుగుతాయని కేటీఆర్ చెప్పడాన్ని, తమ ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం తగదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ (ఈసీ) సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, కొండ్రు పుష్పలీల తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక నుంచి కూలీలను తెచ్చి కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేయాలని చూస్తే ప్రజలు తిప్పికొట్టారని, దీంతో అక్కడ బీజేపీకి మద్దతిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను తెలంగాణలోనూ ప్రసారం చేయాలని హరీశ్‌రావు మీడియాకు ఫోన్లు ఎందుకు చేశారని నిలదీశారు. బీజేపీతో పొత్తులో ఉన్న కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్ సమన్వయం చేయడం దేనికి సంకేతమన్నారు. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం,జేడీఎస్ పార్టీల దుష్టచతుష్టయం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బిల్లు పెడితే మేం మద్దతిస్తాం తాము మైనార్టీలకు మేలు చేస్తామని డిక్లరేషన్ ప్రకటిస్తే మైనార్టీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రయత్నం చేస్తున్నారని, మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి అపోహలు సృష్టిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఎస్సీల వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన కమిటీలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయని, డిసెంబర్ 4 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పారు. అలా కాకుండా మాదిగలను మరోసారి మోసం చేసేందుకు బీజేపీ, మోదీ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒవైసీవి అబద్ధాలు మోదీ, కేసీఆర్ లాంటి దొంగలను కాపాడేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అబద్ధాలు ఆడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ‘ఆయనకు షేర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా. కానీ ఖాకీ నిక్కర్ ఉంది. ముస్లింల హక్కుల కోసం పోరాడాలని అసదుద్దీన్‌ను ఆయన తండ్రి బారిష్టర్ చదివించారు. కానీ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసద్ మద్దతిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. రాజాసింగ్‌పై గోషామహల్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్‌షాలకు సన్నిహితుడైన ఒక వ్యక్తికి అసదుద్దీన్ ఒవైసీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని ఆరోపించారు. అలా ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఒవైసీ సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మి ఆలయానికైనా, దర్గాకైనా వస్తానని, లేదా మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి రమ్మన్నా వస్తానని చెప్పారు. దీనికి అసదుద్దీన్ వస్తారా అని సవాల్ విసిరారు. -
సంచలనం కోసమే ఎంపీపై హత్యాయత్నం
సిద్దిపేటకమాన్: సంచలనం సృష్టించడం కోసమే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు తమ ప్రాథమిక విచారణలో అంగీకరించాడని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత బుధవారం తెలిపారు. ఎంపీపై దాడి ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. నిందితుడు వివిధ ఆన్లైన్ చానళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసిందని, విలేకరిని అని చెప్పుకుంటూ బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే వాడన్నారు. ఎంపీపై దాడి చేయాలనే ఉద్దేశంతో వారం రోజుల క్రితం దుబ్బాక మార్కెట్ లో నిందితుడు కత్తిని కొనుగోలు చేశాడన్నారు. ఎంపీ ఏయే గ్రామా ల్లో ప్రచారం చేస్తున్నారనే విషయమై సోషల్ మీడియా ద్వారా సోమవారం సూరంపల్లి గ్రామానికి వస్తున్న ట్లు తెలుసుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలో దాడికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు దాడి చేయడానికి ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?.. అనే కోణాల్లో విచార ణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నా రు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి కావడంతో నిందితుడిని అదుపులోకి తీసు కున్నామని, బుధవారం అరెస్ట్ చేసి గజ్వేల్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
హింసను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలోకి వెళ్లా రని, అందుకే హింసను ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగెస్ర్ నేతలు ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హిత వు చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత గత 10 ఏళ్లలో ఎక్కడా హింసకు తావివ్వలేదని.. అవహేళనలు, అవమా నాలు, కవ్వింపులు జరిగినా సంయమనం పాటించినట్లు చెప్పారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్నం హేయమైన, అనాగరిక చర్య అని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలోని 14 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగం, రావుల, పి.చంద్ర శేఖర్, ఎర్ర శేఖర్ల రాకతో జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందని అన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలలోనే నేతలకు న్యాయం జరుగుతుందని తెలుసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని, పారాచూట్ నేతలకు టికెట్లిచ్చారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో సర్వే చేస్తున్న సునీల్ కనుగోలు ‘కొనుగోలు’గా మారారని ఎద్దేవా చేశారు. -
ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితేంటి: భట్టి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో ఎంపీలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యుడికే సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంటే అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా అనే అనుమానం కలుగుతోందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని, అదే సమయంలో అధికార పార్టీ దుబ్బాక బంద్‌కు పిలుపునివ్వడాన్ని కూడా తాము ఖండిస్తున్నామని తెలిపారు. ‘దర్యాప్తు సంస్థలను, పోలీసులను మీ దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్ చేస్తున్నట్టు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. బంద్ దేని కోసం.. ఎవరిపై బంద్ చేస్తున్నారు? మీ పాలనపై మీరే బంద్ చేసుకుంటున్నారా.. బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారా’అని ప్రశ్నించారు. నిందితుడిని పట్టుకున్న తర్వాత ఇందుకు సంబంధించిన నిజానిజాలను విచారించి ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం, ఆ బాధ్యతను విస్మరించి ప్రతిపక్షాలపై దు్రష్పచారం చేయ డం తగదని ఆ ప్రకటనలో భట్టి హితవు పలికారు. దాడి ఘటనపై విచారణ జరిపి నిజానిజా లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలో మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్‌రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హెడ్ డాక్టర్ విజయ్‌కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు. -
ఎంపీపై దాడి అప్రజాస్వామికం! : ఎమ్మెల్యే మాణిక్‌రావు
సాక్షి, మెదక్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. జహీరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాతీర్పును ఎదుర్కొనలేకనే భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం దారుణమన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన చైర్మన్ నరోత్తం, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ఖండించాలి! ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పన్నారు. హింస రాజకీయాలను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. ఎంపీపై దాడి అమానుషం.. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడం అమానుషమని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌చైర్మన్ మఠం భిక్షపతి ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న ఆయనపై కత్తితో దాడి చేయడం దర్మార్గమన్నారు. ప్రభాకర్‌రెడ్డి త్వరగా కొలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ముమ్మాటికీ ప్రతిపక్షాల దాడే.. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్రనేనని సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. అధికారం కోసం ప్రతిపక్షాలు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు రెచ్చగొట్టే ప్రసంగాలతో హింస రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
దాడికి కారణమేంటి?
మిరుదొడ్డి (దుబ్బాక)/ సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడికి కారణాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మిరుదొడ్డి మండలం చెప్యాల కు చెందిన నిందితుడు గటాని రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు యూట్యూబ్ చానళ్ల లో పనిచేసిన రాజు వైఖరి తొలి నుంచీ వివాదాస్పదమని.. విలేకరి ముసుగులో దందాలకు పాల్పడేవాడని స్థానికులు చెప్తున్నారు. కలప రవాణా వాహనాలను ఆపి వసూళ్లకు పాల్పడటం, కల్లు డిపో, దుకాణాల యజమానుల నుంచి చందాలు వసూలు చేయడం వంటివి చేసేవాడని.. ఈ ఆగడాలతో సహనం నశించిన వ్యాపారులు గతంలో రాజుపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజు.. జిల్లా ముఖ్య నాయకులతో తిరిగేవాడని చెప్తున్నారు. అయితే ఎంపీపై దాడి చేసేంత పగ ఏమిటన్నది అంతుపట్టడం లేదని అంటున్నారు. అయితే.. దళితబంధు రాకపోవడం, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీపై కక్షగట్టి దాడి చేసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అధికారులు ఇటీవల మిరుదొడ్డి మండల విలేకరులకు ఇక్కడి చెప్యాల క్రాస్‌రోడ్డులో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అందులో తనకూ స్థలం కేటాయించాలని రాజు కోరగా.. ఎంపీతో చెప్పించాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రాజు పలుమార్లు ఈ విషయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాదని చెప్పినట్టు సమాచారం. దీనికితోడు దళితబంధుకు ఎంపికైనవారి జాబితాలో తన పేరు లేకపోవడంతోనూ రాజు ఆగ్రహించాడని, ఇవన్నీ మనసులో పెట్టుకుని, దాడి చేసి ఉంటాడని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. -
ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో నాకు సంబంధం లేదు
పాలమూరు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో తనపై బురదజల్లడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ వారైనా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనతో రఘునందన్‌రావుకు సంబంధం ఉందని ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో హింసకు ఎప్పుడూ పాల్పడలేదని, అలాంటి ఘటనలు ప్రోత్సహించే వ్యక్తిని తాను కాదన్నారు. దాడి చేసిన గటాని రాజు అనే వ్యక్తికి దళితబంధు రాలేదని ఉద్దేశంతోనే దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయని రఘునందన్‌రావు చెప్పారు. రాజు ఫేస్బుక్ ఖాతాను పరిశీలిస్తే అతను కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫొటోలు, ఇతర వివరాలు లభ్యమవుతాయని, అతని దగ్గర ఓ చానల్ ఐడీ కార్డు కూడా దొరికిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఎవరెంత బురద చల్లినా దుబ్బాకలో తన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. సిద్దిపేట సీపీ కేసు పరిశీలించి, అతని ఇతర అకౌంట్లు పరిశీలించి మాట్లాడాలి కానీ, మీరే బీజేపీ సానుభూతిపరుడని అని చెప్పడం సరికాదన్నారు. సీపీ మాట్లాడిన మాటలతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్‌రావు ఆందోళన చెందారు. పాలమూరు నుంచి నేరుగా ఆస్పత్రి దగ్గరకు వెళ్లి చికిత్స పొందుతున్న ప్రభాకర్‌రెడ్డిని పరామర్శిస్తానని చెప్పారు. -
ఓటమి భయంతోనే బద్నాం చేస్తున్నారు
అంబర్‌పేట (హైదరాబాద్): పొడిచిన వ్యక్తి బీజేపీ.. కత్తిపోటుకు గురైన వ్యక్తి బీఆర్ఎస్ నేత అయితే సీఎం కేసీఆర్ మాత్రం కాంగ్రెస్‌ను బద్నాం చేయడం ఆయన ఓటమి భయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం అంబర్‌పేట పార్టీ అభ్యర్థి రోహిన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన వి.హనుమంతరావుతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలతో కుట్ర చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరిన వ్యక్తి.. బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేస్తే ఇది కాంగ్రెస్ పని అని సీఎం కేసీఆర్ దివాలాకోరు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో పని చేస్తుందని, శాంతియుత వాతావరణంలో తాము ఎన్నికల్లో కొట్లాడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంబర్‌పేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీఇచ్చారు. వీహెచ్ మాట్లాడుతూ తన హయాంలోనే అంబర్‌పేట చెప్పుకోదగ్గ అభివృద్ధి చెందిందని తెలిపారు. టికెట్ల విషయంలో పార్టీ నేతలకు జరిగిన అన్యాయాన్ని అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని వీహెచ్ రేవంత్‌రెడ్డిని కోరారు. కాంగ్రెస్ ఇచి్చన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి అంబర్‌పేటలో విజయం సాధిస్తామని రోహిన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
త్వరలో రూ. లక్షకుపైగా ఉన్న రుణాలు మాఫీ
మెదక్: త్వరలో రూ.లక్షకుపైగా ఉన్న రైతు రుణాలను సైతం మాఫీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడు తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు రూ.99,999వరకు రుణాలన్నీ మాఫీ అయ్యాయని అన్నారు. బ్యాంకు అకౌంట్లు వినియోగంలో లేకపోవడంతో కొంతమందికి ఇబ్బంది అవుతున్నట్లు తెలిసిందన్నారు. ఆర్థిక, వ్యవసాయ శాఖల కార్యదర్శులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని, ఆ రెండు పార్టీలకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పు డు అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముతోందని, ఆ పార్టీ అధికా రంలోకి వస్తే రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 35 –40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటపడుతోందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గతంలోకంటే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఇంటి ముందు అభివృది్థ.. కంటి ముందు అభ్యర్థి నినాదంతో ముందుకు పోతామని ఆయన తెలిపారు. హరీశ్ వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/దిల్సుఖ్నగర్/ముషీరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో బుధవారం మొదలైన ఐటీ సోదాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 36లో ఉన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటితోపాటు కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఉన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. తనిఖీల్లో వారి కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బ్యాలెన్స్ షీట్లను అధికారులు సేకరించారు. ఒక్కో కంపెనీకి చెందిన ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి... పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి కలసి చేసిన రియల్ ఎస్టేట్, మైనింగ్ సహా ఇతర వ్యాపారాలపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో హిల్‌ల్యాండ్, మైన్స్‌ల్యాండ్, తీర్థ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, శ్రీలార్వెన్ సిండికేట్ సంస్థల్లో ఈ ముగ్గురికీ చెందిన కుటుంబ సభ్యులే భాగస్వాములుగా ఉండటంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు రూపంలో జరిగిన లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను గుర్తించి తెరవగా కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలు బయటపడ్డట్లు తెలిసింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బ్యాంకు లాకర్స్‌ను సైతం అధికారులు తెరిపించారు. పన్నుల ఎగవేతపై ఆరా తీశారు. సోదాలయ్యాక వారి సంగతి చూస్తా: ఎమ్మెల్యే మర్రి ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేయగా తన ఇంటి నుంచి బయటకు వచ్ఛి న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఐటీ అధికారులు వారి పని చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోవైపు తమ సిబ్బందిని ఐటీ అధికారులు బెదిరించారని... కొందరిపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అధికారులకు చేయి చేసుకొనే హక్కు లేదని... అలా జరిగితే తాము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. సోదాలు ముగిశాక వారి సంగతి చూస్తామన్నారు. కాగా, ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కొండపల్లి మాధవ్ నివాసంపై బుధవారం ఉదయం 5 గంటలకు మొదలైన ఐటీ దాడులు రాత్రి 12 గంటలకు ముగిశాయి. తన ఇంటిపై ఐటీ దాడులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని మాధవ్ ఆరోపించారు. -
దుండిగల్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి హఠాన్మరణం
హైదరాబాద్: దుండిగల్ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి (36) గుండెపోటుతో మృతి చెందారు. 2016 బ్యాచ్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి నెల రోజుల క్రితం నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వాహనాన్ని ఆపే క్రమంలో కింద పడ్డాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. పూర్తిగా కోలుకున్న అతను మరో రెండ్రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు తన సహోద్యోగులకు సమాచారం అందించాడు. గురువారం రాత్రి అతను గుండె నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి
కర్నూలు(హాస్పిటల్): కత్తిపోట్లకు గురై వీపున కత్తితో వచ్చిన ఓ వ్యక్తికి కర్నూలు వైద్యులు సకాలంలో స్పందించి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డికి ఆస్తి వివాదాలు ఉండటంతో కొంత కాలంగా అనంతపురం పట్టణంలోని మారుతినగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. శనివారం రాత్రి భోజనం ముగించుకుని బయట వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కత్తి శ్రీనివాసరెడ్డి వీపున అలాగే దిగబడిపోయింది. వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కర్నూలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెంటనే కార్డియోథొరాసిక్ హెచ్‌వోడి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేశారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితి గురించి అక్కడి వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. వెంటనే కర్నూలుకు తీసుకురండి ఆపరేషన్ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. తెల్లవారుజాము నుంచే ఎక్స్‌రే, సీటీస్కాన్ తీసి కత్తి ఎంత వరకు వెళ్లిందో పరిశీలించారు. ఆదివారం ఉదయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రలతోపాటు అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ కొండారెడ్డితో కలిసి శ్రీనివాసరెడ్డికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి కోలుకుంటున్నారని వివరించారు. -
దుబ్బాకలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో శుక్రవారం మంత్రుల పర్యటన సందర్భంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారం రోజులుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి అనుచరగణంతో నియోజకవర్గానికి రావడం, బీజేపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని పోటాపోటీ నినాదాలు, తోపులాటతో పరిస్థితి వేడెక్కింది. దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హబ్సీపూర్‌లో గోదాముల ప్రారంభోత్సవం సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కా సేపు తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు ఇబ్బందికి గురయ్యారు. దీంతో మంత్రి హరీశ్‌రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి మంత్రుల బృందం దుబ్బాక బస్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లింది. అప్పటికే అక్కడ మోహరించిన బీజేపీ నాయకులు మరో సారి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయి తే అధికారిక కార్యక్రమంలో ఎవరూ నినాదాలు చేయొద్దని ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ కార్యకర్తలకు నచ్చజేప్పే ప్రయ త్నం చేసినా వారు వినలేదు. బారికేడ్లను పక్కకు నెట్టేసి కార్యక్రమ ప్రాంగణంలోకి చొచ్చు కొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఉద్రిక్తతల మధ్య మంత్రులు దుబ్బాకలో కొత్తగా నిర్మించిన బస్టాండ్, కొత్త బస్సులను ప్రారంభించారు. ఆపై మంత్రులు అక్కడి నుంచి వెళ్లడంతో బీజేపీ శ్రేణులు సైతం వెళ్లిపోయాయి. -
కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు మధ్య సవాళ్ల పర్వం
-
చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరు చెరిపేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇది చాలా బాధాకరమని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమ నగరానికి వచ్చేసమయంలో చిత్రపరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం ఎంతో శ్రమించి అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే చిత్రపరిశ్రమలోని పెద్దలు ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పరని కేవలం చిత్రపురి కాలనీ అనే సంబోధించడం బాధాకరమన్నారు. చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి నెలకొల్పుతామని చిత్రపురి కమిటీకి 2 సంవత్సరాల క్రితం తాము నివేదిక పంపి, తాము ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఇప్పుడు చిత్రపరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం బాధాకరమని, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే అనుకోవచ్చునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డిలు మాట్లాడుతూ... పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని తాము వ్యతిరేకిండంలేదని, కాని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు సంవత్సరాల క్రితమే తాము ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చిత్రపురి కమిటీకి నివేదిక ఇచ్చామని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం, కమిటీ తమకు ఎంత స్థలం కేటాయించాలి అనే విషయం చర్చించడం, తాము అనుమతులు ఇతరత్రా పనుల్లో ఉండగానే తాను తన తండ్రి పేరుతో ఆసుపత్రి నిర్మిస్తాను అని ఓ సినీ ప్రముఖుడు ప్రకటించుకోవడం సరికాదన్నారు. తమకు అవకాశం ఇచ్చి స్థలం కేటాయిస్తే సంవత్సరంలోపు ఆసుపత్రి నిర్మించి పేద కళాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చిత్రపురి కాలనీలో ఉన్న పాఠశాలను ప్రైవేట్‌కు అప్పగించారని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మించి దాన్ని కూడా ప్రైవేట్‌కు అప్పగించరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. (క్లిక్: సినీ కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తా: చిరంజీవి) -
తట్టులాగే.. మంకీపాక్స్ కూడా
కర్నూలు (హాస్పిటల్): ‘ఇంట్లో ఎవ్వరికైనా ఒంటిపై పొక్కులు వస్తే పెద్దవారు తట్టు పోసిందనో, ఆటలమ్మ వచ్చిందనో చెప్పి వెంటనే ఓ గదిలో ఉంచుతారు. తేలికపాటి ఆహారం ఇస్తూనే తెల్లటి వస్త్రంపై పడుకోబెట్టి చుట్టూ వేపాకు మండలు పెడతారు. వేపాకు నూరి శరీరమంతా పూసి స్నానం చేయిస్తారు. ఇప్పుడు మంకీపాక్స్‌లో కూడా ఇదే జరుగుతుంది. దీనికి భయపడాల్సిన పనిలేదు. ఆటలమ్మ, తట్టు మాదిరిగానే ఇది కూడా ప్రాణాంతకం కాదు. కోవిడ్‌లా వేగంగా వ్యాప్తి చెందదు’ అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిప్యూటీ సూపరింటెండెంట్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని బుధవారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అరికట్టడం కష్టం కాదు ఈ వైరస్ ఏమీ చేయదు. దీనిని అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మాస్క్, ఐసోలేషన్ ముఖ్యం. పారాసిటమాల్, సిట్రిజన్, ఆంపిక్లాక్స్ 500 ఎంజీ మాత్రలు రోజుకు రెండు చొప్పున పది రోజులు వేసుకోవాలి. మ్యూపరసిస్ లేదా బిటాడిన్ ఆయింట్మెంట్, కొబ్బరి నీళ్లు, తేలికపాటి ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే చాలు. బయట తిరగకూడదు. ఇంట్లో వారికీ దూరంగా ఉండాలి. ఒంటిపై పొక్కుల్లో నీరు చేరితే కొంచెం నొప్పి ఉంటుంది. త్వరగానే తగ్గిపోతుంది. మరీ పెద్దగా నొప్పైతే నీడిల్‌తో గుచ్చి బాక్ట్రోబాన్ ఆయింట్మెంట్ రాయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇలా ఓ పది రోజులుంటే అంతా సర్దుకుంటుంది. జాగ్రత్తగా ఉండాలి మంకీపాక్స్ వైరస్ ఎవరిలో ఉందో తెలుసుకోవడం కష్టం. జలుబు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది తుమ్ముల తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువసేపు కాంటాక్టులో ఉన్నా వస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు పొక్కులు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే ఐసోలేషన్‌లో ఉంచి మందులు ఇస్తారు. ప్రజలు సైతం ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఆరోగ్య కార్యకర్తలకు, వాలంటీర్లకు తెలపాలి. ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే వ్యాప్తి ఆగిపోతుంది. ఇవీ లక్షణాలు ‘మంకీ పాక్స్’కు, మన దేశంలో అంతరించిన స్మాల్‌పాక్స్(తట్టు)కు, అడపాదడపా కనిపించే ఆటలమ్మ, చికెన్‌పాక్స్‌కు దగ్గర సంబంధం ఉంది. వారియోలా, వారిసెల్లా అనే వైరస్ల వల్ల వచ్చిన జబ్బులివి. ఇవంత ప్రాణాంతకం కావు. మంకీపాక్స్ సోకితే 5 నుంచి 21 రోజుల్లో శరీరంపై పొక్కులు వస్తాయి. జ్వరం, జలుబు, కండరాల నొప్పులు, నీరసం వస్తుంది. లింఫు గ్రంధుల వాపుంటుంది. గజ్జలు, చంకలో, మెడలో గడ్డలు వస్తాయి. పొక్కుల్లో కొన్నిసార్లు ద్రవం చేరి లావుగా మారి పగిలిపోతాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సమస్యలు వస్తాయి. ఆయాసం, దగ్గు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేరాలి. -
అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్ ప్రభాకర్
జీవితంలో నేను ఏది చేసినా తల్లిదండ్రుల తర్వాత వైఎస్సార్ స్ఫూర్తితోనే అని ఎన్ఆర్ఐ ప్రభాకర్‌రెడ్డి (పంచ్ ప్రభాకర్) అన్నారు. యూఎస్ఏలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 'ప్రేమకు మూడు అక్షరాలు ఉన్నాయనుకుంటే అది వైఎస్సారే. ఆయన ప్రతి అడుగులో మానవత్వం, దాతృత్వం, సమానత్వం కనిపిస్తాయి. వైఎస్సార్ ఒక గొప్ప మానవతావాది. శత్రువును కూడా అక్కున చేర్చుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెడితే.. సీఎం జగన్ వాటిని కొనసాగిస్తూ, నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపు రేఖలను మారుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తి, బెండపూడి పాఠశాల ఉపాధ్యాయుడు చేసే కార్యక్రమాలు, పడుతున్న కష్టం చూసి ఆ స్కూల్‌ను దత్తత తీసుకోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి నాతో పాటు, ఇక్కడి అనేక మంది మిత్రులు ముందుకొచ్చారు. ఇప్పటిదాకా పేద విద్యార్థులకు, రైతులకు నా వంతు మేర సహాయపడుతూ వచ్చాను. వాటన్నింటికి మహానేత వైఎస్సారే నాకు స్ఫూర్తి. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ప్రతిభ ఉండి.. పేదరికంతో ముందుకెళ్ల లేని స్థితిలో ఉంటారో వారిని ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాం. అందుకోసం మేడపాటి వెంకట్‌తో కలిసి కార్యాచరణను కూడా రూపొందిస్తాం. గ్రామీణ ప్రాంత యువతకు రూరల్ ఎంప్లాయ్మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసి వారి భవిష్యత్‌కు తోడ్పాటునందిస్తామని' పంచ్ ప్రభాకర్ తెలిపారు. చదవండి: (CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్) -
ఏపీ: ప్రభుత్వ పాఠశాలలో ఐఏఎస్ అధికారి పిల్లలు
సాక్షి, విజయవాడ: ఐఏఎస్ అధికారి, ప్రస్తుత శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశామని ప్రభాకర్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్కూల్లో వసతులు, క్లాస్‌రూమ్‌లు, ప్లే గ్రౌండ్ అన్నీ చాలా బాగున్నాయన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కూడా వాళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. కాగా వేసవి సేలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు మంగళవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. విజయవాడలో పడమట పాఠశాలలో గతేడాది నాలుగు వందల మందికి పైగా కొత్తగా విద్యార్థులు చేరగా.. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్తగా చేరనున్నట్లు అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. -
నినాదాలు కాదు.. పరిష్కారాలు కావాలి
పటాన్చెరు: ‘మేకిన్ ఇండియా వంటి నినాదాలు కాదు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమస్యలకు పరిష్కారం చూపాలి. కొత్త పరిశ్రమల స్థాపనలో ఉన్న అవరోధాలను తొలగించాలి’అని కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పేరు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పాలసీ వైఫల్యాలను ప్రస్తావించారు. హైదరాబాద్ శివారులోని అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో గుండె కవాటాల్లో అమర్చే స్టెంట్ల తయారీ పరిశ్రమ సహజానంద మెడికల్ టెక్నాలజీ (ఎస్ఎంటీ)ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ డివైజెస్ ఉత్పాదనకు దేశంలో ప్రోత్సాహం కరువైందన్నారు. వైద్య, ఆరోగ్య ఉపకరణాల తయారీలో మనం వెనుకబడ్డామని చెప్పారు. ‘చైనాతో పోల్చితే ఉత్పాదన రేటు ఇక్కడ ఎక్కువగా ఉందని పారిశ్రామికవేత్తలు ఓ సదస్సులో అన్నారు. ఇక్కడ పరిశ్రమ పెట్టి తయారు చేసే కంటే చైనా నుంచి తెప్పించి ఆ పరికరాలను అమ్మితే ఎక్కువ లాభాలు ఉన్నాయని చెప్పారు’అని గుర్తు చేశారు. ‘నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ– 2022’ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరంగా ఉండాలని కోరారు. పెట్టుబడికి 50 కంపెనీలు ముందుకు గుండె కవాటాల్లో అమర్చే స్టెంట్లను తయారు చేసే ఎస్ఎంటీ.. కోవిడ్ ప్రతికూల పరిస్థితిని తట్టుకొని తమ పరిశ్రమను మూడేళ్లలో ఉత్పాదక స్థాయికి తెచ్చిందని కేటీఆర్ చెప్పారు. 20 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేశారని, 200 మంది శాస్త్రవేత్తల సహకారంతో స్టెంట్లను ఉత్పతి చేయనున్నారని తెలిపారు. ఎస్ఎంటీ తయారు చేసే స్టెంట్లను 70 దేశాలకు సరఫరా చేస్తారన్నారు. సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు 50 కంపెనీలు ముందుకు వచ్చాయని, తాజాగా కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని తెలిపారు. ఫార్మా, వ్యాక్సిన్ల తయారీకి కేంద్రంగా ఉన్న తెలంగాణ ఇక మెడ్ టెక్కు కేంద్రంగా మారనుందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
Cardiac Arrest: ఇలా చేస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు..
సాక్షి, అమరావతి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్ట్) వంటి సమస్యలకు గురై మరణించటం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ.. పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్నెస్తో ఉండేవారు సైతం గుండె సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి.. సీపీఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏఈడీ అందుబాటులో ఉంచుకోవాలి విదేశాల్లో జిమ్‌లు, పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉంటాయి. వీటిద్వారా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడీ ద్వారా షాక్ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు నుంచి కోలుకునే అవకాశం 60 నుంచి 65 శాతం ఉంటుంది. మన దగ్గర కూడా ఈ పరికరాలను అందుబాటులో ఉంచితే చాలామందిని రక్షించడానికి వీలవుతుంది. కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం. సీపీఆర్ ఇలా.. గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60 నుంచి 70% అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే 108కుఫోన్చేసి అంబులెన్స్‌ను రప్పించి ప్రాథమికచికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి. వైద్య పరీక్షలు చేయించుకోవాలి.. 40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు కొలెస్ట్రాల్, గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో పూర్వీకులు ఎక్కువగా గుండెపోటుతో మరణించిన దాఖలాలు ఉంటే అలాంటి వారు జాగ్రత్త పడాలి. రెండేళ్లకు ఒకసారి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ లేదా స్ట్రెస్ టెస్ట్‌లు చేయిచుకోవాలి. కఠిన వ్యాయామాలు చేసే వారికి గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు లాంటి ప్రమాదానికి దారితీయవచ్చు. దీన్నే డిఫెక్షన్ అంటారు. కొవ్వు కణాలతో ఏర్పడిన ‘ప్లాక్’పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. ప్రొటీన్–సి, ప్రొటీన్–ఎస్, యాంటీ థ్రాంబిన్–3 తగ్గటం వంటి లోపాలున్న వారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్న వారిలోనూ క్లాట్ ఏర్పడే గుణం ఎక్కువ. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, కర్నూలు జీజీహెచ్ కఠిన వ్యాయామాలు వద్దు.. కొన్ని సందర్భాల్లో గుండె లయ తప్పడం వల్ల జఠరిక రక్త ప్రరసరణ క్రమం తప్పుతుంది. ఒక్కోసారి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఆకస్మిక గుండె మరణానికి దారితీస్తుంది. సాధారణంగా వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ కారణంగానే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ఎగువ గదుల్లో (కర్ణిక)ని అరిథ్మియా వల్ల కూడా గుండె కొట్టుకోవడం ఒక్కోసారి ఆగిపోతుంది. సినోట్రియల్ నోడ్ సరైన విద్యుత్ ప్రేరణలను పంపనప్పుడు కర్ణికల్లో దడ ప్రారంభమవుతుంది. ఫలితంగా జఠరికలు శరీరానికి సమర్థవంతంగా రక్తాన్ని పంపవు. 40 సంవత్సరాలు పైబడిన వారెవరైనా సరే కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ఈ వయసులో ఉన్న వారు జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు మొదలు పెట్టే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కఠిన వ్యాయామాలు చేసినప్పుడు అప్పటికే లోపల ఉన్న సమస్యలు జఠిలమై కార్డియాక్ అరెస్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ చైతన్య, గుండె వైద్య నిపుణులు విజయవాడ -
‘నాన్న మూడుసార్లు ‘మా’ అధ్యక్షుడిగా చేశాడు, వాళ్లకి పెన్షన్ ఇచ్చేవారు’
విలక్షణ గాత్రం.. విలక్షణ నటన.. విలక్షణ కథలు.. విలక్షణ పాత్రలు.. పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, చారిత్రకాలు.. కౌబాయ్, జేమ్స్‌బాండ్, అభ్యుదయాలు, విప్లవాలు... అన్ని పాత్రలు మెప్పించారు.. నలుగురు ఆడపిల్లల తండ్రి.. భార్యతో కథా చర్చలు, పిల్లలతో ప్రివ్యూలు.. ఇవన్నీ కలిపితే డా. ఎం. ప్రభాకర్ రెడ్డి.. తండ్రి గురించి రెండో కుమార్తె శైలజారెడ్డి పంచుకున్న ఆత్మీయ అనుబంధాల అనుభూతులు.. మా తాతగారు మందాడి లక్ష్మారెడ్డి, నాయనమ్మ కౌసల్యాదేవి దంపతులకు నాన్న రెండో సంతానం. తాతగారు సూర్యాపేట దగ్గర తుంగతుర్తి చుట్టుపక్కల 40 గ్రామాలకు దొర. తాతగారికి ఐదుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. నాన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేశారు. నాన్నకు మేం నలుగురు ఆడపిల్లలం. గంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి. మా గ్రామ దేవత గంగమ్మ పేరు పెద్దక్కయ్యకు పెట్టారు. అమ్మవారి మీద భక్తితో మాకు అమ్మవారి పేర్లు పెట్టారు. మేం నలుగురం మద్రాస్ హోలీ ఏంజెల్స్ స్కూల్లో చదువుకున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్స్‌కి వచ్చేవారు. మా చెల్లి విశాలాక్షి నాన్నలాగే మెడిసిన్ చదివింది. స్కూల్ తరఫున మేం విహార యాత్రలకు వెళ్తుంటే, మాతో పాటు మా స్నేహితులకు కూడా వీఐపీ అకామడేషన్ ఏర్పాటు చేసేవారు. జమ్ముకాశ్మీర్ గుల్మార్గ్ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎప్పటికప్పుడు మా గురించి మాకు ఇబ్బంది కలుగకుండా సమాచారం తెలుసుకునేవారు. మేమందరం ఆయన కళ్ల ముందే ఉండాలనే ఉద్దేశంతో మా అందరికీ హైదరాబాద్ సంబంధాలే చేశారు. నాకు చిన్నప్పటి నుంచి చెప్పులంటే ఇష్టం. నాన్న బొంబాయి నుంచి వస్తూ, రెండు సూట్‌కేసులు తీసి నాకు ఇచ్చారు. అందులో 23 జతల షూస్. బంగారం, వెండి చెప్పులు కూడా ఉన్నాయి.. ‘నీ వివాహం నీకు ప్రత్యేకంగా మిగిలిపోవాలి’ అన్నారు. నా పెళ్లయ్యాక ఎప్పుడైనా నేను వంట చేసి క్యారేజీ పంపిస్తే, ‘శైలు వంట చేసి పంపించిందంటే నమ్మలేకపోతున్నాను’ అనేవారు. మంచి మాటలు చెప్పేవారు.. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచమనేవారు. ఎవరితోనైనా ఆలోచించి మాట్లాడాలి, నోరు జారిన తరవాత బాధపడినా ప్రయోజనం ఉండదనేవారు. డబ్బు అందరికీ పనికి వస్తేనే దానికి విలువ అనేవారు. అనుకున్నది సాధించాలనే పట్టుదలే ఆయనను ఎదిగేలా చేసింది. అహంకారం లేకుండా దేనినైనా సాధించగలమని నిరూపించారు నాన్న. అమ్మతో సినిమా కథలు, సీన్స్ చర్చించేవారు. అమ్మ బెంగాలీ కథలు చదివి, సినిమాలు చూసి, అందులో క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో నాన్నకు వివరించేది. వారి సంభాషణల నుంచి కొత్త కథలు వచ్చేవి. నాన్న తనకు కావలసిన విధంగా పాటలు, సంగీతం దగ్గరుండి చేయించుకునేవారు. కార్తీకదీపం సినిమాలో కొన్ని సీన్స్ మాకు నచ్చలేదని చెబితే, ఆ సీన్ సినిమాకి అవసరం అని వివరించారు. నాన్న సినిమాలకు అమ్మ కాస్ట్యూమ్స్ చేసేది. పండంటి కాపురంలో జమున, కార్తీకదీపంలో శ్రీదేవి... ఇలా ప్రతి సినిమాకీ హీరోయిన్ల దుస్తులు అమ్మ డిజైన్ చేసేది. నాన్న తీసిన ‘గాంధీపుట్టిన దేశం’ లో స్త్రీ విద్య, ‘గృహప్రవేశం’లో తన చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండటం కోసం ఒక ఇంటి కోడలు పడే కష్టాలు వివరించారు. ‘పండంటి కాపురం’ తన వ్యక్తిగత జీవితం నుంచి వచ్చిందన్నారు. తన జీవితంలో ఎదురుపడిన వారిని పాత్రలుగా మలచుకునేవారు. ఔట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ప్రతిరోజూ ఫోన్ చేసేవారు. రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతానికి షూటింగ్‌కి వెళ్లినప్పుడు, 50 కి.మీ. ప్రయాణించి సిటీకి వచ్చి, ఫోన్ చేసి, మేం ఎలా ఉన్నామో తెలుసుకున్నారు. ఒకసారి షూటింగ్లో హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు చెస్ట్‌కి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేరటం వల్ల రెండు రోజులు ఫోన్ చేయలేకపోయినందుకు చాలా బాధ పడ్డారు. మోహన్ బాబు నా ట్యూషన్ మాస్టర్ చుట్టూ ఉన్నవారికి సహాయపడాలనే తత్త్వం నాన్నది. రైటర్, యాక్టర్స్‌కి అవకాశం ఇచ్చారు. డా. మోహన్‌బాబుని నాకు ట్యూషన్ మాస్టర్‌గా పెట్టారు. ఆయన కొంతకాలం నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. జయసుధ, జయప్రద వంటి ఎంతోమంది నటులను వెండితెరకు పరిచయం చేశారు. టెక్నీషియన్స్‌కి ఉచితంగా ఆహారం అందించేవారు. పాత నటులకి నెలకు ఇంత అని పెన్షన్ ఇచ్చేవారు. చిత్రపురి కాలనీ కట్టించి, చాలా మందికి ఇళ్లు అందేలా చూశారు. మూడుసార్లు ‘మా’ అధ్యక్షులుగా... నాన్న మెడిసిన్ చదువుతున్నరోజుల్లో అక్క పుట్టింది. ఆ తరవాత మద్రాసు వచ్చారు. ‘చివరకు మిగిలేది’ చిత్రంతో సినీ రంగంలో తొలి అడుగు వేశారు. 1965లో పచ్చని సంసారం సినిమాతో కథా రచయితగా అడుగు ముందుకు వేశారు. ఆ తరవాత సూపర్‌స్టార్ కృష్ణ గారితో కలిసి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ప్రారంభించి, మూడుసార్లు అధ్యక్షుడిగా చేశారు. ఉదయాన్నే ఇంటి దగ్గరే మేకప్ వేసుకుంటూనే బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి, సెట్స్‌కి వెళ్లేవారు. అమ్మ లంచ్ పంపేది. పోషకాహారం ఇష్టపడేవారు. నెయ్యి, జున్ను బాగా ఇష్టం. వేసవి కాలంలో బ్రేక్‌ఫాస్ట్‌లో మామిడిపళ్లు తప్పనిసరిగా ఉండాలి. ఉదయం 9.30కి ఎవరు వచ్చినా వాళ్లకి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టించేవారు. అకస్మాత్తుగా మాయమైపోయారు.. ప్రతి కార్తీక పౌర్ణమికి ఉదయం సత్యనారాయణ వ్రతం, సాయంత్రం శివుడి పూజ చేసేవారు. పూజలు, మంచి రోజులు, ముహూర్తాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయ్యప్ప మాల వేసుకుని, కఠిన నియమాలు పాటించేవారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నారు. మా అందరితో హాయిగా మాట్లాడారు. తెల్లవారేసరికి హార్ట్ అటాక్. అకస్మాత్తుగా తన అరవయ్యో ఏట కన్నుమూశారు. - వైజయంతి పురాణపండ -
పేదల పాలిట పెన్నిధి సీఎం జగన్
గుంటూరు (ఎడ్యుకేషన్): అభివృద్ధికి దూరమైన అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం, ఆర్థిక వనరులను సమకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పాలిట పెన్నిధిగా నిలిచారని విశ్రాంత ఐఏఎస్ అధికారి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఎ.ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని అమరావతి రోడ్డులో గల అవర్ స్టేట్ అవర్ లీడర్, వైఎస్సార్ ఇంటెలెక్చ్యువల్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ‘సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం’ వేదికపై ‘సుపరిపాలన ప్రస్థానంలో రెండేళ్లు–అభివృద్ధి–శాంతి భద్రతలు’ అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాలనా ఫలితాలను రుచి చూపించి, సంక్షేమ రాజ్య స్థాపనకు డాక్టర్ వైఎస్సార్ పునాదులు వేయగా.. ఆయన తనయుడు రెండు అడుగులు ముందుకు వేసి సుపరిపాలన దిశగా రెండేళ్ల ప్రస్థానంలో అభివృద్ధికి ఆకృతి ఇవ్వడం అద్భుతమన్నారు. సంఘ విద్రోహుల పాలిట సింహస్వప్నంగా దిశ చట్టంతో రాష్ట్రంలో శాంతిభద్రతల దశ మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కిందని అన్నారు. అభివృద్ధికి దూరంగా మగ్గుతున్న వర్గాలకు అత్యంత ఆవశ్యకమైన ఆదాయ, ఆరోగ్య, ఆవాసాలను అతి తక్కువ కాలంలోనే అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. ఎల్లో మీడియా పిచ్చిపోకడలపై న్యాయ పోరాటం చేయాలి పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పనికీ అడ్డుపడుతున్న ఎల్లో మీడియా పిచ్చి పోకడలపై డాక్టర్ కారుమంచి రవి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పత్రికలు, మాధ్యమాలు పాత్రికేయ ధర్మానికి తిలోదకాలిచ్చి ఫ్యాక్చువల్ ఎర్రర్స్ (వాస్తవ విరుద్ధాల)ను ప్రచురించి ప్రజా ప్రయోజనాలను, ప్రభుత్వ విధానాలను పక్కదోవ పట్టిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాటు ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. విష ప్రచారం చేస్తున్న పత్రికల విశ్వసనీయతను అవకాశమున్న ప్రతి వేదిక ద్వారా దెబ్బతీయాలని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యుడు వైఎస్ థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలకు నిర్ణీత కాల వ్యవధి, ప్రభుత్వమే లబ్ధిదారులతో నేరుగా సంప్రదించడం, కాల్ సెంటర్ సేవలను విస్తృతపర్చడం ద్వారా అవినీతి నిరోధానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలవరం నిర్మాణంపై వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. -
హాస్య నటులలో నాన్న హైహై నాయకా
రమణారెడ్డి లేకుండా నాటి సినిమాను ఊహించడమా? మంచిగానో చెడ్డగానో ఆయన ఉండాల్సిందే. మిస్సమను, గుండమ్మ కథను, మాయాబజార్‌ను ఆయన పాత్రలు ఎంత మెరిపించాయి. నెల్లూరు యాసకు సినిమాలో యాక్సెప్టెన్స్ తెచ్చిన నటుడు. ఎవరైనా సన్నగా ఉంటే రమణారెడ్డిలా ఉంటాడు... అనే పోలిక ఇప్పటికీ సాగుతూనే ఉంటుంది. సన్నగా ఉన్నా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్ రెడ్డి తండ్రి గురించి చెప్పిన విశేషాలు ఇవి. నాన్నగారికి మేం ఐదుగురు పిల్లలం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. నేను ఇంటికి పెద్ద. నా తరవాత చెల్లాయి వసుమతి, స్వర్ణలత, పద్మావతి, తమ్ముడు శ్రీనివాసరెడ్డి. అల్లుళ్లు ముగ్గురూ డాక్టర్లు. ఇద్దరు మెడికల్ డాక్టర్లు, ఒకరు డాక్టరేట్. నేను, తమ్ముడు ఇద్దరం చెన్నైలోనే ఇంజినీరింగ్ చదివాం. నేను బిటెక్ తరవాత ఎంబిఏ పూర్తి చేశాను. ఎల్ అండ్ టి లో పని చేశాను. అందరం చక్కగా సెటిల్ అయ్యాం. నాన్నగారు 1974లో అల్సర్‌తో బాధపడుతూ కన్ను మూశారు. అదే సంవత్సరం నాన్నగారితోపాటు ఘంటసాల, ఎస్విఆర్ కూడా తుదిశ్వాస విడిచారు. ఆ మరుసటి సంవత్సరం రేలంగి గారు. మా తల్లిగారు సుదర్శనమ్మ 93 ఏళ్లపాటు జీవించి ఇటీవలే అంటే 2018 అక్టోబరులో నాన్నగారిని చేరుకున్నారు. నాకు ఒకర్తే అమ్మాయి. హైదరాబాద్ ఏఎండిలో పనిచేస్తోంది. అల్లుడు కూడా అదే కంపెనీలో పని చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం.. నెల్లూరు దగ్గర జగదేవిపేట నాన్నగారి జన్మస్థలం. మాది వ్యవసాయ కుటుంబం. తాతగారు నాన్నగారి చిన్నప్పుడే పోవడంతో నాన్న ఇంటర్ తో చదువు ఆపేశారు. చెన్నై వచ్చాక, సోషల్ లైఫ్ బాగా పెరగటంతో మంచి ఇంగ్లీషు నేర్చుకోగలిగారు. నాన్నగారిది మేనరికం. అమ్మగారిది కోవూరు. నాన్నగారికి ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికితే మమ్మల్నందరినీ ఎక్కడికైనా తీసుకువెళ్లేవారు. రిజర్వ్డ్.. స్నేహితులతో బాగా మాట్లాడేవారు. ఇంట్లో మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉండేవారు. అప్పుడప్పుడు ప్రివ్యూలకు వెళ్లేవాళ్లం. నాన్నగారు విడిగా, మేమందరం విడిగా వెళ్లేవాళ్లం. అంత రిజర్వ్డ్గా ఉనా, పిల్లలు అడిగినదేదీ కాదనేవారు కాదు. బాగా బిజీగా ఉన్న రోజుల్లో రోజుకి రెండు మూడు షిఫ్టులు పనిచేయటం వల్ల నాన్నగారు ఇంట్లో చాలా తక్కువసేపు ఉండేవారు. అందుకే మాతో ఎక్కువసేపు గడపటానికి అవకాశం ఉండేది కాదు. ఒకసారి నాన్నని చూడటానికి ఎస్.వి. రంగారావు గారు మా ఇంటికి వచ్చారు. నేను ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చాను. ఆయన నా చేతిలో కాఫీ అందుకుంటూ, ‘అబ్బాయి ఏం చేస్తున్నాడు?’ అని నాన్నను అడిగారు. ఆయన వెంటనే చెప్పలేక నా వైపు చూశారు. మా చదువు గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేవారు. చిన్న వయసు – పెద్ద పాత్రలు చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాలు వేయటం సరదా. చదువుకునే రోజుల నుంచే నాటకాలు వేయటం ప్రారంభించారు. ఆ తరవాత సినిమాలలోకి ప్రవేశించారు. నాన్నగారు నటించిన మొదటి సినిమా ‘మానవతి’. శంకర్రెడ్డిగారు నాన్నగారికి మొదటి అవకాశం ఇచ్చారు. ‘చరణదాసి’ లో సూర్యకాంతం గారికి కొడుకు వేషం వేశారు. రేలంగి గారి కంటె నాన్నగారు వయసులో కొద్దిగా చిన్నవారే. కాని ఇంచుమించు అన్ని సినిమాలలోను ఆయనకు తండ్రి, మామగారు పాత్రలే పోషించారు నాన్నగారు. నాన్న సినిమాలు.. సాధారణంగా అందరూ విజయవంతమైన సినిమాలలోని పాత్రలనే గుర్తుపెట్టుకుంటారు. ఫెయిల్ అయినవాటిని మర్చిపోతుంటారు. ‘గంగ గౌరి సంవాదం’ సినిమాలో నాన్నగారు భగ్న ప్రేమికుడు. కృష్ణకుమారి హీరోయిన్. నాన్నగారు చాలా డిఫరెంట్‌గా నటించిన సినిమా అది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. అది గుర్తుపెట్టుకోలేకపోయారు. ‘గుండమ్మ కథ’ సినిమాలో నాన్నగారు, రామారావు గారు, సూర్యకాంతం గారు... ఈ ముగ్గురి గురించే మాట్లాడుకునేవారు. అప్పట్లో ఒక సినిమా శతదినోత్సవం జరుపుకుంటే ఘనంగా ఉండేది. జగపతి వారి మొదటి సినిమా ‘అన్నపూర్ణ’ వేడుకలు విజయ గార్డెన్స్‌లో చేశారు. దానికి నాన్నగారు కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. అందరూ ఎదురు వచ్చి తప్పట్లు కొడుతూ వేదిక మీదకు ఘనంగా, సంతోషంగా తీసుకెళ్లారు. పొరపాటు జరిగింది.. నాన్నగారి దగ్గర రాధాకృష్ణమూర్తి అనే ఆయన మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయన చాలా నమ్మకస్థుడు. అనుకోకుండా ఒకసారి చిన్న పొరపాటు జరిగింది. ఒకేరోజు మూడు ప్రొడక్షన్స్‌కి కాల్షీట్లు ఇచ్చేశారు. మూడు సినిమాల లోనూ పెద్ద నటులతో కలిసి నటించాలి. దాంతో నాన్న ఇరుకున పడ్డారట. అయినప్పటికీ ఆయనను ఏమీ అనలేదట. నాన్నగారు పోయిన రెండో రోజున ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పారు. ఆయనకు నాన్నగారంటే విపరీతమైన అభిమానం. అల్లు రామలింగయ్య.. ఇంజినీరింగ్ ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా చదువుకోవటం వల్ల అందరికీ నేను గుర్తుండిపోయాను. నాన్నగారు పోయిన రెండు సంవత్సరాల తరవాత ఆఫీస్ పని మీద హైదరాబాద్ సరోవర్ హోటల్‌కిlవచ్చాను. అక్కడ అల్లు రామలింగయ్య గారు నన్ను చూసి పలకరించి, నాన్నగారితో ఉన్న అనుబంధం గురించి చాలా సేపు ముచ్చటించారు. చెన్నైలో ఉన్న రోజుల్లో నేను ఆయనను చాలాసార్లు చూశాను. కాని ఎన్నడూ ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. ఆయన నన్ను గుర్తు పెట్టుకుని, పలకరించార ంటే నేను రమణారెడ్డిగారి అబ్బాయిని కాబట్టే కదా! మెజీషియన్... పాత ‘అక్కచెల్లెళ్లు’ సినిమాలో నాన్నగారిది మెజీషియన్ పాత్ర. దానికోసం నాన్నగారు మ్యాజిక్ నేర్చుకున్నారు. ఆయనకు మ్యాజిక్ అంటే సరదా ఉండటం వల్ల, ఆ తరవాత చాలా ప్రదర్శనలిచ్చారు. అందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. సినిమాల వల్ల డబ్బులు సంపాదిస్తే, మ్యాజిక్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు. 1957 లో నెల్లూరు టౌన్హాల్లో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. ఆ రోజున ఘంటసాల గారి కచేరీ కూడా ఉంది. ‘ఘంటసాల మ్యూజిక్, రమణారెడ్డి మ్యాజిక్’ అని పబ్లిసిటీ ఇచ్చారు. నాన్నగారు చివరి ప్రదర్శన ఢిల్లీలో జరిగింది. మంచి స్నేహం.. నాన్నను అందరూ ‘రమణయ్యా’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆ రోజుల్లో స్నేహాలు బావుండేవి. నాన్నగారి స్నేహితులు ఒకాయన ఒక చిత్రంలో నాన్న నటించిన పాత్రకు వచ్చిన పారితోషికం తీసుకుని, ‘దీని గురించి నువ్వు నన్ను అడగకు’ అన్నారు. ఆ డబ్బులతో హైదరాబాద్‌లో ఒక స్థలం కొని, ఆ కాగితాలను, మిగిలిన డబ్బును మా చెల్లాయి పెళ్లి సమయంలో అందచేశారు. ఆ రోజు నాన్న కళ్లలో కనిపించిన ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేను. అంత మంచి స్నేహాలుండేవి. అదే నంబరు నేటికీ... 1963 దాకా మా ఇంట్లో ఫోన్ లేదు. మా మొట్టమొదటి ఫోన్ నెంబరు 42537 ఇప్పటికీ అదే నెంబరులోని ఆఖరి మూడు డిజిట్లు కంటిన్యూ అవుతున్నాయి. నాన్నగారిది చాలా సింపుల్ లైఫ్. ఇంట్లో తీరికగా ఉన్నప్పుడు ఆంధ్ర క్లబ్‌కి కాని, టి. నగర్ క్లబ్‌కి కాని వెళ్లేవారు. ఆ సమయంలో డ్రైవర్ రాకపోతే నా సైకిల్ మీద వెళ్లిపోయేవారు. అజాత శత్రువు.. 1964 టైమ్‌లో మా పెద్ద నాన్నగారి అబ్బాయి టి. సుబ్బిరామిరెడ్డి (మా నాన్నగారు, వాళ్ల నాన్నగారు అన్నదమ్ములు) కాంట్రాక్ట్‌లు చేస్తున్నారు. నాన్నగారు హైదరాబాద్ వచ్చారని తెలిస్తే, షూటింగ్ చూడటానికి వచ్చేవారు. ఒకసారి నాగార్జున సాగర్ నుంచి సారథి స్టూడియోకి వచ్చి, ‘మా చిన్నాయన రమణారెడ్డిని చూడటానికి వచ్చాను’ అని చెప్పారు. నాన్నగారు ఆయనను అందరికీ పరిచయం చేశారు. సుబ్బిరామిరెడ్డిగారికి సినిమాల పరిచయం అప్పుడే కలిగింది. అలా ఆయనకు సినిమాల మీద మోజు బయలుదేరింది. సినిమాలలో ఎన్నో నెగిటివ్ పాత్రలుæవేసినా, నాన్నని అందరూ గౌరవించేవారు. ప్రేమించేవారు. నాన్నగారికి అజాతశత్రువు అని పేరు. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: సురేశ్ కుమార్ ఎ. అకాల భోజనంతో... చిన్నప్పటి నుంచి నాయనకు అల్సర్లు ఉండేవి. ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అది అప్పుడప్పుడు బాధిస్తుండేది. అప్పట్లో సరైన వైద్యం కూడా లేదు. మూడు షిఫ్టులు పని చేస్తూండటం వల్ల అకాల భోజనంతో, తరచు ఆరోగ్యం దెబ్బ తినేది. 1968లో ఆపరేషన్ చేయించుకున్నారు. నెలరోజులపాటు కాల్షీట్లు తీసుకోలేకపోవటంతో, అవకాశా లు తగ్గిపోయాయి. ఆ తరవాత సినిమాలలో అతిథి పాత్రలలో మాత్రమే నటించారు. అంతకంటె చేయలేకపోయారు. ఆ సమయంలోనే ‘మనసు – మాంగల్యం’, ‘శ్రీమంతుడు’ చిత్రాలలో పూర్తి స్థాయి పాత్ర చేశారు. 1974లో అల్సర్ తిరగబెట్టింది. ఆపరేషన్ చేసిన నాలుగు నెలలకు ఆయన కన్నుమూశారు. నాన్నగారు పోయేనాటికి నా వయసు 28 సంవత్సరాలు. కుటుంబ బాధ్యత నాదే. అప్పటికి ఒక చెల్లాయికి మాత్రమే వివాహమైంది. -
నారాయణా.. అంతా మీ ఇష్టమేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు కనీస విలువ లేదా.. ఎవరి మనోభావాలతో మీకు పనిలేదా.. మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇద్దరి మాట మినహా మిగిలిన వారిని కనీసం పట్టించుకోరా’ అంటూ రూరల్ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం నగరంలోని కిలారి తిరుపతినాయుడు కల్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, రూరల్ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామి నాయుడు సమావేశం నిర్వహించారు. సమావేశానికి 130 మంది వరకు సీనియర్ టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలకు సంబంధం లేకుండా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అనుచరులకే అన్ని పనులు, పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు మొదలుకొని అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ వరకు ఆదాల అనుచరుడు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పార్టీ వ్యక్తులకు కాకుండా ఇతర రాజకీయ పార్టీలకు చెందినవారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అలాగే మంత్రి నారాయణకు నియోజకవర్గంలో పట్టుమని 10 మందితో పరిచయాలు ఉండవు. అయితే ఆయన నెల్లూరు రూరల్ అభ్యర్థిని నిర్ణయిస్తారు. పనిచేసుకోమని చెబుతారు. ఇలా అయితే పాత వారందరూ పార్టీని వీడిపోవటం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లో పాతవారికి చోటు దక్కలేదని, నీరు–చెట్టు పనులు కూడా పాతవర్గంలో ఒక్కరికీ ఇవ్వలేదని, మంత్రి నారాయణ అన్నీ అతనికి కావల్సిన వారికి, మాజీ మంత్రి ఆదాల తనకు కావల్సిన వారికే ఇస్తుంటే కార్యకర్తలు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటారని ప్రశ్నించారు. మా పరిస్థితేంటి? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ను మంత్రి నారాయణ ప్రకటించడానికి అంతా సిద్ధం చేస్తుంటే మాలాంటి వారి పరిస్థితి ఏంటని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు మండిపడ్డారు. 135 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. వారిలో ఒక్కరైనా టీడీపీ కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. పింఛన్లు మొదలుకొని రేషన్ డిపోల వరకు ఒక్కదానిలో కూడా మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల తీరుపై మొదట తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేస్తామని, అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. అలాగే సభ ముగింపు సమయంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసురెడ్డి హాజయ్యారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు పాముల రమణయ్య, కార్పొరేటర్ మన్నెం పెంచలయ్య, నేతలు రామమూర్తి, బద్దేపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, ఉరందుల సురేంద్రబాబు, జానా గిరిబాబు, ఎస్కే ఆసీఫ్, రాఘవప్పనాయుడు, సుబ్బరాజు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ఎయిర్ అంబులెన్స్’ సేవలు షురూ
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ‘ఎయిర్ అంబులెన్స్’సేవలు నగరంలో ప్రారంభమయ్యాయి. ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (హెచ్‌ఈఎంఎస్)ను శనివారం వింగ్స్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వై.ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం, ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు తీవ్ర గాయాలైన వారికి సత్వరమే వైద్య సేవలందిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ఇలాంటి వారి కోసమే ఎయిర్ ఎయిడ్ పేరిట సేవలను ప్రారంభించామన్నారు. ఎయిర్ ఎయిడ్ ద్వారా సేవలందించేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ 109సీ హెలికాప్టర్‌ను తెప్పించినట్లు చెప్పారు. నలుగురు ప్రయాణించే ఈ హెలికాప్టర్లో వైద్య సేవలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. డీజీసీఏ సర్టిఫికెట్ ఉండటంతో అనుకూల ప్రాంతం ఎక్కడున్నా ల్యాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 50 మీటర్ల స్థలం ఉంటేచాలు ఈ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయొచ్చని, దీనిలో ఒకసారి ఇంధనం నింపితే 450 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు. రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లోనూ ఎయిర్ ఎయిడ్ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ సేవల కోసం 18007582080 నంబర్‌కు గాని, www. airaidcare.com వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని ప్రభాకర్‌రెడ్డి వివరించారు. -
అమ్మో! మొనగాడే!
మీకు పల్లీలంటే ఇష్టమేనా? ఊరికే ఇష్టమని తల ఊపడం కాదు... నిమిషానికి ఎన్ని పల్లీలు ఒలవగలరో చెప్పండి. పల్లీలంటే వీజీనే ఒలవడం. అదే వాల్నట్సయితే..? పల్లీలకంటే ఎక్కువరుచిగా ఉంటాయి కాబట్టి, ఇంకాసిని ఎక్కువే లాగించగలరు. ఆగండాగండి... వొలిచి పెట్టిన వాల్నట్స్ కాదు... వొలుచుకుని తినాల్సొస్తే..? ఎన్ని వలుస్తారు? ఈ వొలుపుడు సంగతిఇప్పుడెందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం... వాల్నట్స్ అంటే తెలుసు కదా... అదేనండీ, ఆక్రోటు కాయలు. వేరుసెనక్కాయల మాదిరిగా కాదు... వాటి పై పెంకు బాగా గట్టిగా ఉంటుంది.పగల గొట్టడం మామూలు విషయం కాదు. అలాంటిది ఒక్క నిమిషంలో 212 వాల్‌నట్స్‌ను పగలగొట్టి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. ప్రభాకర్ రెడ్డి అనే 35సంవత్సరాల మార్షల్ ఆర్ట్స్ మొనగాడు. ఇతను బారులుగా పోసిన వాల్‌నట్స్‌ను పటాపటా పగలగొట్టేసి అంతకుముందు పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ రషీద్ అనే వ్యక్తి సృష్టించినరికార్డును బద్దలుగొట్టాడు. అన్నట్టు మన ప్రభాకర్ రెడ్డి ఇలా వాల్‌నట్స్‌ను పగలగొట్టడం 2010 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇతను వాల్‌నట్స్‌పై వీర విహారం చేసిన వీడియోను ఇప్పటికి కొన్ని లక్షలమంది ఆసక్తిగా చూశారట. బాగుంది కదూ! -
అప్పులబాధతోనే అఘాయిత్యం!
-
అప్పులబాధతోనే అఘాయిత్యం!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ నార్సింగ్ ఠాణా పరిధిలోని కొల్లూరు సమీపంలో చోటు చేసుకున్న ‘నాలుగు హత్యలు, ఒక ఆత్మహత్య’ కేసు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమికంగా అప్పులభారం పెరగడంతోనే ప్రభాకర్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తెలకు విషం ఇవ్వడం వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. షేర్ల వ్యాపారంలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కాలంలో భారీగా నష్టపోయినట్లు తెలిసింది. దీంతో అనేకమంది నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చినట్లు సమాచారం. గడిచిన నెల రోజులుగా ప్రభాకర్‌రెడ్డి షేర్ మార్కెట్లో భారీ మొత్తం వెచ్చించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నూటికి రూ.3 నుంచి రూ.5 వడ్డీకి కొందరి నుంచి తక్కువ కాలంలోనే మీ మొత్తం రెట్టింపు చేస్తానంటూ హామీ ఇచ్చి మరికొందరి నుంచి డబ్బు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా ప్రభాకర్‌రెడ్డికి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా నార్సింగ్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఈ మొత్తం రూ.7 కోట్లుగా ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి పిన్ని లక్ష్మీ అతడికి ఎంత మొత్తం ఇచ్చారు? ఆ నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? అనే అంశాలను పరిశీలిస్తున్నామని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఈ ఉదంతం చోటు చేసుకోవడానికి అప్పు ఇవ్వడమే కారణమా? మరే ఇతర కారణం ఉందా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డితో పాటు లక్ష్మీకి చెందిన సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు ఆఖరిసారిగా ఎవరితో సంప్రదింపులు జరిపారు? ఏం మాట్లాడారు? వారితో వీరికి ఉన్న లావాదేవీలు ఏంటి? అనేవి తెలుసుకుంటున్నారు. దీనికోసం ఆయా నంబర్లకు ఫోన్లు చేస్తున్న పోలీసులు వారితో మాట్లాడుతున్నారు. మరోపక్క ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి సేకరించిన ల్యాప్‌టాప్‌లోని అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసు విషయమై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రభాకర్‌రెడ్డికి అప్పులు ఇచ్చిన, అతడి వద్ద పెట్టుబడులు పెట్టిన వారు పదుల సంఖ్యలో ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఆ నలుగురిపై అతడి వేలిముద్రలు!
-
ఆ నలుగురిపై అతడి వేలిముద్రలు!
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగు రోడ్డు సమీపంలో వెలుగుచూసిన ఐదు మృతదేహాల ఉదంతం వెనుక రెండోరోజు కూడా మిస్టరీ వీడలేదు. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మీర్జాగూడ శివారు ఇంద్రారెడ్డి కంచెలో లభ్యమైన మూడు మృతదేహాలతోపాటు కారులో లభించిన బాలుడి మృతదేహంపై ప్రభాకర్ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టు క్లూస్‌టీమ్ ధ్రువీకరించినట్టు తెలిసింది. ఘటనాస్థలిలో లభించిన వాటర్ బాటిల్స్‌తోపాటు థమ్సప్ బాటిళ్లపైనా అతడి వేలిముద్రలు ఉన్నట్టు గుర్తించారు. ‘‘వాటర్ బాటిళ్లు, థమ్సప్‌లో విషం కలపడం వల్లే అది సేవించిన ప్రభాకర్ రెడ్డి భార్య మాధవి, ఆయన పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తె సింధుజ చనిపోయారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి కారును ఆపి రోడ్డుపక్కనే ఉన్న పొదల్లో వారిని పడేశాడు. ఘటనా స్థలిలో పాదముద్రలు కూడా ఒకరికి మించి ఎక్కువ లేవు. ఆ తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్ అండర్‌పాస్ బ్రిడ్జ్ కింద కారులో చనిపోయి పడి ఉన్న వశిష్ట్ రెడ్డి మృతదేహంపై కూడా ప్రభాకర్ రెడ్డి వేలిముద్రలు ఉన్నట్టుగా తేల్చారు. కారులో లభించిన వాటర్బాటిళ్లపై కూడా అతడి వేలిముద్రలు ఉన్నాయి’’ అని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నలుగురికి విషమిచ్చి, వారు చనిపోయాక ప్రభాకర్‌రెడ్డి కూడా విషం తాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు రామచంద్రాపురం మండలం అశోక్‌నగర్‌లో ప్రభాకర్ రెడ్డి అద్దెకు ఉన్న ఇంట్లో పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. ల్యాప్‌టాప్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలు లక్ష్మి తన భర్త రవీందర్‌రెడ్డికి తెలియకుండా ఇతరుల నుంచి రూ.80 లక్షలు తీసుకొని ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలిలోని ఇండియా ఇన్ఫోలైఫ్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన స్టాక్ మార్కెట్ లావాదేవీలపైనా ఆరా తీశారు. అతడి డీమ్యాట్ ఖాతాను సీజ్ చేయాలంటూ బ్యాంక్‌కు నోటీసులు జారీచేశారు. ప్రభాకర్‌రెడ్డి బాబాయి కొండాపురం రవీందర్‌రెడ్డి నివాసానికి కూడా నార్సింగి పోలీసులు వెళ్లినట్లు తెలిసింది. కాగా, ప్రభాకర్ రెడ్డి వద్ద స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టామంటూ కొందరు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యను కలిశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానికంగా వివాదాలు లేవు.. రెండేళ్లుగా ఇంట్లో అద్దెకు ఉంటున్నా.. ప్రభాకర్‌రెడ్డి ఎన్నడూ ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల్లో ఉన్నట్లు కనిపించలేదని ఇంటి యజమాని పేర్కొన్నారు. అప్పుడప్పుడూ తల్లిదండ్రులు, ఒకరిద్దరు సమీప బంధువులు మాత్రమే వచ్చేవారని.. మిత్రులు కూడా పరిమితంగానే వచ్చేవారని వెల్లడించారు. రవీందర్‌రెడ్డి కుటుంబంతో మాత్రం ప్రభాకర్‌రెడ్డి సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. -
ఎంత ఘోరం
దీపావళి పండుగకు ముందే ఆ రెండు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. మరో కుటుంబానికి చెందిన ఇద్దరి మరణంతో తీరని విషాదం నెలకొంది. విహారయాత్రకని వెళ్లిన ఆ ఐదుగురు విగతజీవులుగా మారడం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. షేర్‌మార్కెట్ వ్యాపారం.. ఆ ఐదుగురి ప్రాణాలమీదకు తెచ్చింది. ఈ సంఘటన మంగళవారం నార్సింగి మండలం కొల్లూరు వద్ద ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగింది. చేవెళ్ల/శంకర్పల్లి: శంకర్పల్లి మండలం మీర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్ కాలనీ శివారులో మృతిచెందిన పటోళ్ల ప్రభాకర్‌రెడ్డి(31), మాధవి(27) వర్షిత్‌రెడ్డి(2.5), మృతుడి చిన్నమ్మ లక్ష్మి(42), ఆమె కూతురు సింధు(16)ల మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చనిపోయిన వారిలో ప్రభాకర్‌రెడ్డి, అతని భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌రెడ్డిలు శంకర్పల్లి మండలం కొత్తపలి గ్రామానికి చెందిన వారు. ఉద్యోగం.. వ్యాపారంలో భాగంగా చిన్నమ్మ లక్ష్మి వద్దకు వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి కుటుంబంతో పాటు చిన్నమ్మ, ఆమె కూతురు కూడా మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. కుటుంబ నేపథ్యం శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల మహిపాల్‌రెడ్డి, సువర్ణలకు ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉన్నారు. గ్రామంలో వీరికున్న 12 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ మహిపాల్‌రెడ్డి కొడుకులను చదివించాడు. వీరికి రెండు పౌల్ట్రీఫాంలు కూడా ఉన్నాయి. వీటిని మహిపాల్‌రెడ్డి, అతని చిన్న కొడుకు దయాకర్‌రెడ్డిలు చూసుకుంటున్నారు. పెద్దకొడుకు ప్రభాకర్‌రెడ్డి ఇంటర్ పూర్తయిన తర్వాత తన చిన్నమ్మ, చిన్నాన్న అయిన రవీందర్‌రెడ్డి, లక్ష్మీలు ఉండే లింగంపల్లి మండలం నల్లగండ్ల గ్రామానికి వెళ్లాడు. అక్కడే ఉంటే విద్యాభ్యాసం పూర్తిచేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2012లో మేడ్చల్ జిల్లా డి.పోచంపల్లి గ్రామానికి చెందిన మాధవితో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు (హర్షిత్) ఉన్నాడు. కుమారుడికి ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగం మధ్యలోనే వదిలేసి రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లోకి దిగాడు. పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసినట్లు బంధువులు తెలిపారు. బంధువులు, సన్నిహితుల వద్ద డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం. ఈ పెట్టుబడులు పెట్టిన డబ్బులు అప్పులుగా పెరిగిపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఒత్తిడి పెరిగి ఉంటుందని అనుమానం వ్యక్తమవుతుంది. పామెనలోనూ విషాదం ప్రభాకర్‌రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియటంతో పామెన గ్రామం కూడా షాక్‌కు గురైంది. మృతుడు ప్రభాకర్‌రెడ్డి తల్లి సువర్ణ, చిన్నమ్మ లక్ష్మిల తల్లిదండ్రులది పామెన గ్రామం కావడంతో ఇక్కడి వారితో ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి మంచి పరిచయాలున్నాయి. మంచి పేరున్న వ్యక్తి కుటుంబం మృత్యువాత పడడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో మంచిగా ఉండే వ్యక్తికి ఇలా జరిగిందంటే గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. వివరాలు సేకరించిన క్లూస్ టీం మణికొండ: ఒకేసారి ఐదుగురు మరణించడంతో సైబరాబాద్ క్లూస్ టీం ప్రతినిధులు సంఘటన స్థలాల్లో దొరికిన ఆనవాళ్లను సేకరించారు. మహిళల మృతదేహాలను ఉన్నచోట ఎలాంటి వస్తువులు లభించకపోయినా కారులో మాత్రం వారు తాగిన కూల్‌డ్రింక్, నీటి బాటిళ్లు కనిపించాయి. వాటితో పాటు కారు ముందర రోడ్డుపై ఓ కేక్ బాక్సును వారు సేకరించారు. వాటితో పాటు కారుపై ఎవరివైనా వేలిముద్రలు ఉన్నాయా అనే కోణంలోనూ ఆనవాళ్లను సేకరించారు. పోలీసు జాగిలాలను రప్పించారు. సంఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ సందీప్శాండిల్లా, మాదాపూర్ ఏసీపీ విశ్వనాథ్, ఏసీపీ రమణకుమార్, నార్సింగి సీఐ రమణగౌడ్లు సందర్శించి ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకున్నారు. వివరాల సేకరణ అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం బంధువులకు అప్పగించారు. తరలివచ్చిన జనం.. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ శివారులో ఐదు మృతదేహాలు లభించాయనే విషయం తెలుసుకొని అటు సంగారెడ్డి, ఇటు గండిపేట మండలాల ప్రజలు సంఘటనా స్థలానికి భారీగా తరలివచ్చారు. దీంతో ఔటర్ రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్డు ప్రజలతో పాటు మీడియా, పోలీసు వాహనాలతో ప్రజలతో కిక్కిరిసింది. రెండేళ్ల వర్షిత్ మృతితో తల్లడిల్లిన బంధువులు.. పటాన్చెరు : కొల్లూరు శివారులో (నార్సింగి పీఎస్ పరిధిలో) ఓఆర్ఆర్ కింద కారులో తండ్రి ప్రభాకర్‌రెడ్డి పక్కన కారులో మృతి చెందిన రెండేళ్ల వర్షిత్‌ను చూసిన ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయారు. ప్రభాకర్‌రెడ్డి బంధువులు ఆ సన్నివేశాన్ని చూసి రోదించారు. ముఖ్యంగా మహిళా కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చిన్నారిని చూస్తూ వారు పడుతున్న ఆవేదనతో అక్కడున్న వారి హృదయం ద్రవించిపోయింది. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారణం ఎవరనే ప్రశ్న మానవతావాదులందరినీ వేధించింది. ఒకవేళ తండ్రి ప్రభాకర్‌రెడ్డే తన కుమారుడికి విషం ఇచ్చి ఉంటే అంత దారుణానికి ఆయన ఎందుకు ఒడిగడతారని అక్కడున్న వారు చర్చించుకోవడం కనిపించింది. చంపడం.. తెచ్చిపడేయడం.. అమీన్పూర్ మాత్రమే కాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఏదో మూల జరిగిన హత్యలకు సంబంధించిన మృతదేహాలను పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో దుండగులు తెచ్చిపడేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓఆర్ఆర్పై ఓ మహిళ శవం కనిపించింది. అది ప్రమాదమా, హత్య చేసి ఇక్కడ పడేశారా అనేది తెలియరాలేదు. సుల్తాన్పూర్ గుట్టల్లో ఓ యువకుడిని హత్య చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉండడంతో మహానగరంలోని కొందరు తమ నేరాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రాంతంలో మృత దేహాలను తెచ్చి పడేస్తున్నారని భావిస్తున్నారు. భూమి కొనుగోలుతోనే సమస్యంతా... మణికొండ: ఐదుగురు మృతుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఓ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీనికోసం కోటిరూపాయలకు పైగా అప్పులు తెచ్చినట్లు సమాచారం. అయితే ఆ భూమి ప్రభుత్వ భూమిగా తేలటంతో తీవ్ర ఇబ్బందులకు గురయినట్లు అతడి మిత్రులు తెలిపారు. షేర్మార్కెట్లో పెట్టుబడులు, ఇతర అప్పులు పెరిగిపోవడం, బాకీలు తీర్చాలని బంధువులు, స్నేహితులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు మిత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శోకసంద్రంలో పూడూరు పూడూరు(పరిగి): పూడూరు మండల కేంద్రానికి చెందిన కొండాపురం రవీందర్‌రెడ్డి, లక్ష్మి(40) దంపతులు. వీరు కొన్నేళ్ల క్రితం తమ కుమారుడు దినేష్‌రెడ్డి, కూతురు సింధూజ(16)తో కలిసి సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువు మండలం బీరంగూడకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రవీందర్‌రెడ్డి రుద్రారంలోని ఐటీడబ్ల్యూ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తూ స్థానికంగా ఇళ్లు నిర్మిస్తూ విక్రయిస్తూ బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు సింధూజ ఇంటర్ చదువుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డి(32) లక్ష్మికి స్వయాన అక్కకొడుకు. ఇతను తన భార్య మాధవి(28), కుమారుడు వశిష్ట్‌రెడ్డి(రెండున్నరేళ్లు)తో కలిసి దంపతులు బీరంగూడ సమీపంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. వీరి కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్తుంటారు. ప్రభాకర్‌రెడ్డి షేర్ మార్కెట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి కుటుంబం లక్ష్మి ఇంటికి వచ్చింది. సెలవు కావడంతో డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నట్లు చెప్పిన ప్రభాకర్‌రెడ్డి తన పిన్ని లక్ష్మి, సోదరి సింధూజను తీసుకెళ్లి బాబాయి రవీందర్‌రెడ్డి కారులో వెళ్లాడు. సాయంత్రం రవీందర్‌రెడ్డి తన భార్యకు ఫోన్ చేయగా డిండి ప్రాజెక్టు నుంచి బయలుదేరినట్లు చెప్పింది. అనంతరం రాత్రి 8గంటలకు ఆయన మరోసారి ఫోన్‌చేయగా నాట్‌రీచబుల్ వచ్చింది. ఆందోళనకు గురైన రవీందర్‌రెడ్డి కారులో వెళ్లిన మిగతా వారికి ఫోన్ చేయగా స్విఛాఫ్ సమాధానం వచ్చింది. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. ఆయన అనుమానం వచ్చి వెంటనే 100కు కాల్ చేసి విషయం చెప్పాడు. మంగళవారం ఉదయం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిండి ప్రాజెక్టుకు వెళ్తున్నామని కుటుంబీకులకు చెప్పడంతో మొదట రవీందర్‌రెడ్డి ఆ ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి గాలించసాగాడు. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలోని కొల్లూరు శివారులో గుర్తు తెలియని ఐదుగురి మృతదేహాలు పడి ఉండడంతో పోలీసులు రవీందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన వారిని గుర్తించి బోరుమన్నారు. -
అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ఐదు మృతదేహాల ఉదంతం ఆద్యంతం మిస్టరీగా మారింది. ఈ వ్యవహారంలో అసలేం జరిగిందన్న అంశంపై నార్సింగి పోలీసులు దృష్టిసారించారు. ప్రభాకర్‌రెడ్డి తన భార్య మాధవి, కుమారుడు, పిన్ని, ఆమె కూతురుతో కలసి అసలు డిండి వరకు వెళ్లారా లేదా అన్నది తెలియడం లేదు. మధ్యాహ్నం సిగ్నోడ్ కాలనీ నుంచి బయల్దేరి డిండి వెళ్లి రావడానికి కనీసం ఎనిమిది గంటల సమయం పడుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సాయత్రం 6 గంటల సమయంలో మరో గంటలో ఇంట్లో ఉంటామని రవీందర్‌రెడ్డికి లక్ష్మి ఫోన్లో చెప్పింది. ఈ సమయంలో దాదాపు 150 కి.మీ. దూరంలో ఉన్న డిండి వరకు వెళ్లి రావడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి సెల్ లొకేషన్స్‌తో పాటు వివిధ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. లొకేషన్స్ ప్రకారం వీరి కారు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం దాటి వెళ్లినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మి వద్ద మాత్రమే సెల్ఫోన్లు ఉన్నాయి. అవి కూడా రాత్రి 9 గంటలకు స్విచ్చాప్ అయిపోయాయి. ఆ తర్వాత ఫోన్లు ఏమయ్యాయయన్నది తెలియట్లేదు. వాటికోసం పోలీసులు వెతుకుతున్నారు. వాటి లొకేషన్స్ ప్రకారం స్విచ్చాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు వారు ముత్తంగిలో ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో వాహనంలో అక్కడ వరకు వెళ్లి వెనక్కు వచ్చినట్లు భావిస్తున్నారు. మృతదేహాల స్థితిని బట్టి తెల్లవారుజాము సమయంలో విషం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ సమయం వరకు ఓఆర్ఆర్, ఆ సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ పురుగుమందుతో పాటు కూల్‌డ్రింక్స్ తదితరాలు కొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి తన సెల్ నుంచి సోమవారం సాయంత్రం సమీప బంధువు విష్ణువర్ధన్‌కు చివరి ఎస్సెమ్మెస్ ఇచ్చినట్లు వెల్లడైంది. అందులో ఏముందన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. -
ఐదుగురి మృతి కేసులో పలు అనుమానాలు?
సాక్షి, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బయటపడ్డ ఐదు మృతదేహాల సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో రెండు మృతదేహాలు, మరో ముగ్గురి మృతదేహాలు రోడ్డు పక్కన లభించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడ్డారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాగా మృతుల్లో రెండు కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. అమీన్‌పూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి, కూతురు సింధూజతోపాటు.... లక్ష్మీ సోదరి కుమారుడు ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య మాధవి, కుమారుడు వర్షిత్‌గా గుర్తించారు. (కారులో ఉన్న మృతదేహాలు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు వర్షిత్) కాగా రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి స్టాక్ మార్కెట్ బిజినెస్ చేసేవారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని రవీందర్ రెడ్డి చెబుతున్నారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎవరిపైనా అనుమానాలు లేవన్నారు. వీరంతా రెండు రోజుల క్రితం ప్రాజెక్ట్ చూసి వస్తామని వెళ్లారని, కాగా మొన్న సాయంత్రం తిరిగి వస్తున్నామని తెలిపారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో ... ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో రెండ్రోజుల క్రితమే వారు మిస్సైనట్లు ఇంటి యాజమాని రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంటలో ఇంటికి వస్తామన్నారు... గంట లోపు ఇంటికి వస్తున్నామని చెప్పి... తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ మృతుడు ప్రభాకర్‌రెడ్డి సోదరుడు దినేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు. బయటకు వెళుతున్నామని.. ఇంటి తాళాలు అక్కడే ఉన్నాయని చెప్పారన్నారు. సాయంత్రానికి ఫోన్లన్నీ స్వీచ్ ఆఫ్ వచ్చాయని ఏం జరిగిందో అంతుచిక్కడం లేదని దినేశ్‌రెడ్డి బోరున విలపిస్తున్నాడు కారులో పాయిజన్ వాసన ... మరోవైపు సీపీ సందీప్ శాండిల్య... సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, ఆత్మహత్యా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. కారులో పాయిజన్ వాసన వస్తోందని, పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని సీపీ పేర్కొన్నారు. అలాగే కారులో పురుగుల మందు ఉన్న రెండు బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
మా బడి మాగ్గావాలె..!
పెద్దపల్లి కలెక్టర్‌ను అడ్డుకున్న విద్యార్థులు పెద్దపల్లి అర్బన్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. పెద్దపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పుస్తకాలతో పాటు నిరసన చేపట్టారు. కలెక్టర్ గది ముందు కూర్చుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాఠాలు చదువుతూ తమ నిరసన గళాన్ని వినిపించారు. ‘మా బడి మాగ్గావాలె.. వేరే బడికి వెళ్లేది లేదం’టూ ఇన్చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కారుకు అడ్డంగా కూర్చున్నారు. అధికారులు ఎంతగా బతిమిలాడినా విద్యార్థులు పట్టు వీడలేదు. తమ పిల్లలకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. వీరి ఆందోళనకు బీజేపీ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో ఇన్చార్జి కలెక్టర్ తల్లిదండ్రులు, నేతలతో మాట్లాడారు. తన చేతిలో ఏమిలేదని, బడిలో విద్యార్థుల సంఖ్య పెరిగితే తప్పా.. చేసేదేమీ లేదన్నారు. విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని చెప్పటంతో ఆందోళన విరమించారు. -
శిరీషది ఆత్మహత్యే
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ - రాజీవ్ విషయంగా తేజస్విని–శిరీష మధ్య వివాదం - దాన్ని పరిష్కరించాలంటూ కుకునూర్‌పల్లికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్, శిరీష.. మద్యం మత్తులో ఆమెపై ఎస్సై ప్రభాకర్ అత్యాచారయత్నం - గొడవ చేసిన శిరీష.. ఆమెపై చేయి చేసుకున్న రాజీవ్ - స్టూడియోకు చేరుకున్నాక ఉరివేసుకున్న శిరీష - ఈ విషయం బయటపడుతుందని ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యగా తేలిందని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. తేజస్వినికి సంబంధించిన వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు రాజీవ్, శ్రవణ్‌లతో కలసి ఆమె కుకునూర్‌పల్లి వెళ్లారని.. అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సహా నలుగురూ మద్యం తాగారని చెప్పారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం మత్తులో శిరీషపై అత్యాచారయత్నం చేసినట్లు తేలిందని.. వారు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఎ.వెంకటేశ్వరరావు, బి.లింబారెడ్డిలతో కలసి ఆయన ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తేజస్వినిపై ఎలాంటి కేసూ ఉండదని, శ్రవణ్ కుట్రతో వ్యవహరించినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్‌కు నష్టాలు రావడంతో.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఎ.విజయలక్ష్మి అలియాస్ శిరీష వృత్తిరీత్యా బ్యుటీషియన్. 13 ఏళ్ల క్రితం ఎ.సతీష్‌చంద్రతో ఆమెకు వివాహం జరిగింది. వారికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలం బ్యూటీపార్లర్ నిర్వహించిన శిరీష.. నష్టాలు రావడంతో నాలుగేళ్ల కింద ఫిల్మ్‌నగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో మేనేజర్ కమ్ మేకప్ ఆర్టిస్ట్‌గా చేరింది. విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌కుమార్ ఈ స్టుడియోకు యజమాని. రాజీవ్‌కు, శిరీషకు అంతకుముందే ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే స్టుడియోలో ఉద్యోగమిచ్చాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు రాజీవ్‌కు దాదాపు ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారానే బెంగళూరుకు చెందిన తేజస్విని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె తరచూ హైదరాబాద్‌కు వచ్చి రాజీవ్‌ను కలిసేది. ఇది ప్రేమగా మారి శారీరకంగానూ ఒక్కటయ్యారు. వివాహం చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తేజస్విని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆఫీస్ బాయ్ ద్వారా విషయం బయటపడి.. తేజస్వినికి తొలుత శిరీష–రాజీవ్‌ల మధ్య సంబంధం తెలియదు. అయితే కొద్దిరోజుల కింద ఆమె స్టూడియోకు వచ్చి రాజీవ్ గురించి అడగగా.. ఆయన తన భార్యతో కలసి బయటికి వెళ్లారని ఆఫీస్ బాయ్‌లు చెప్పారు. అదేమిటని ఆరా తీయడంతో శిరీష–రాజీవ్ మధ్య సంబంధం తెలిసింది. అప్పటి నుంచి ఈ విషయంపై వివాదం మొదలైంది. గత నెల 30న స్టూడియోకు వచ్చిన తేజస్విని.. రాజీవ్‌తో ఉన్న సంబంధంపై శిరీషతో వాగ్వాదానికి దిగింది. గొడవ ముదిరి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో రాజీవ్ ‘100’ద్వారా పోలీసులకు సమాచారమిచ్చాడు. స్టూడియోకు వచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆ ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై శ్రీనివాస్‌కు తేజస్విని, శిరీష ఒకరిపై ఒకరు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఎస్సై వారికి కౌన్సెలింగ్ చేసి పంపేశారు. తేజస్విని బెదిరింపులతో.. గొడవ ఘటన తర్వాత నుంచి పోలీసు కేసు పెడతానంటూ తేజస్విని పలుమార్లు రాజీవ్, శిరీషలను బెదిరించింది. వాట్సాప్ ద్వారా శిరీషకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలుపెట్టింది. దీనితో విసిగిపోయిన శిరీష ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ.. తన స్నేహితుడైన బోదాసు శ్రవణ్‌కుమార్‌ను కోరింది. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన రియల్టర్ శ్రవణ్‌కుమార్.. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉండి ఎస్సై పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ఓ బొటిక్కు వస్తున్న నేపథ్యంలో శిరీషతో పరిచయమై, స్నేహంగా మారింది. శిరీష విజ్ఞప్తి మేరకు తేజస్విని వివాదం పరిష్కరించడానికి శ్రవణ్ సిద్ధమయ్యాడు. ఇందుకోసం తన స్నేహితుడైన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని సహాయం కోరాడు. ప్రభాకర్‌రెడ్డి దేవరకొండలో ప్రొబేషనరీ ఎస్సైగా పనిచేసినప్పుడు శ్రవణ్‌తో పరిచయమైంది. అయితే ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్సైగా పనిచేసే తన స్నేహితుడు హరీందర్ వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో రాజీవ్, శ్రవణ్ ఎస్సై హరీందర్‌ను కలిశారు. అదే పోలీస్‌స్టేషన్‌లోని మరో ఎస్సై శ్రీనివాస్ వద్దకు అంతకుముందే ఈ వివాదం వచ్చిందని తెలియడం, పనిఒత్తిడిలో ఉండటంతో హరీందర్ వారిని కొద్దిరోజుల తర్వాత రమ్మని సూచించారు. అప్పటికప్పుడు కుకునూర్‌పల్లికి.. బంజారాహిల్స్ ఎస్సైని కలసి వచ్చిన తర్వాత రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గరూ బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లారు. అక్కడ కూర్చున్న సమయంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కుకునూర్‌పల్లికి రావాలని సూచించడంతో రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురూ రాజీవ్‌కు చెందిన ఎండీవర్ కారులో బయలుదేరారు. మధ్యలో బంజారాహిల్స్‌లో మద్యం, రాయదుర్గం రోడ్లో తినుబండారాలు కొనుక్కుని వెళ్లారు. రాత్రి 11.30 గంటల సమయంలో నేరుగా కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ పక్కన ఉన్న ఎస్సై క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నలుగురూ అర్ధరాత్రి 2 గంటల వరకు క్వార్టర్స్‌లోనే మద్యం తాగారు. ఈ సమయంలోనే తేజస్విని వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను శిరీష, రాజీవ్‌లు ప్రభాకర్‌రెడ్డికి వివరించగా.. తాను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే మధ్యలో శిరీష మినహా మిగతా ముగ్గురూ సిగరెట్ తాగడానికి క్వార్టర్స్ నుంచి బయట ఆవరణలోకి వచ్చారు. శిరీష కూడా వస్తుండగా.. సెంట్రీ చూస్తే ఇబ్బందంటూ లోపలే ఉండాలని సూచించారు. వ్యభిచారుల వద్దకు వెళ్లాలంటూ.. క్వార్టర్స్ ఆవరణలో ఉన్న సమయంలో ప్రభాకర్‌రెడ్డి వ్యభిచారిణుల ప్రస్తావన తెచ్చాడు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో అందమైన వ్యభిచారిణులు ఉంటారని, వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని సూచించాడు. ఈ సమయంలో వారి మాటలు విన్న శిరీష కీడు శంకించింది. రాజీవ్, శ్రవణ్‌లు అలా వెళితే తాను ఒంటరిగా మిగిలిపోతాననే భయంతో ‘రాజీవ్ ప్లీజ్ డోంట్ లీవ్.. బీ విత్ మీ’అంటూ రాజీవ్‌కు వాట్సాప్ సందేశాలు పంపింది. అనంతరం ముగ్గురూ క్వార్టర్స్‌లోకి వెళ్లారు. తిరిగి అందరూ కలసి మరికొంత మద్యం తాగారు. కొద్దిసేపటికి రాజీవ్, శ్రవణ్ మళ్లీ సిగరెట్ తాగివస్తామంటూ క్వార్టర్స్ బయట ఆవరణలోకి వెళ్లారు. ఈ సమయంలో ఒంటరిగా మిగిలిన శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడు. దానిని ప్రతిఘటించిన శిరీష.. రోదిస్తూ కేకలు వేసింది. దీంతో లోపలికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్‌లు ఆమెకు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా ఆమె గొడవ చేయడంతో ప్రభాకర్‌రెడ్డిని బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ప్రభాకర్‌రెడ్డి మరోసారి రాజీవ్, శ్రవణ్‌లను వ్యభిచారిణుల వద్దకు వెళ్లాలని సూచించాడు. శిరీషపై చేయి చేసుకున్న రాజీవ్ అయితే శిరీష గొడవచేయడం ఆపకపోవడంతో రాజీవ్ దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ గొడవతో పోలీస్ క్వార్టర్స్‌లోని ఇతరులు మేల్కొంటారనే ఉద్దేశంతో.. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ప్రభాకర్‌రెడ్డి సూచించాడు. దీంతో ఆమెను రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను కారులో ఎక్కించుకుని.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆమె గొడవ చేయడం ఆపలేదు. తనను వ్యభిచారిగా చూస్తున్నారంటూ.. కారు దిగి పారిపోయే ప్రయత్నం చేసింది. శ్రవణ్ కారు దిగి వెళ్లి ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కారు ఎక్కించాడు. ఈ సమయంలో రాజీవ్ మరోసారి ఆమెపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె తల, ముఖం, పెదవులు, కడుపు భాగంలో గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ వచ్చేసరికి ప్రభాకర్‌రెడ్డి రెండుసార్లు శ్రవణ్‌కు ఫోన్ చేశాడు. తమ ప్రాంతం దాటారా.. లేదా? ఆమె గొడవ చేయడం ఆపిందా? అంటూ ఆరా తీశాడు. తిరిగి రాగానే ఆత్మహత్య రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గురూ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియో వద్దకు చేరుకున్నారు. వెంటనే లోపలికి వెళ్లిన శిరీష.. తన స్కార్ఫ్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇది చూసిన రాజీవ్.. అప్పటికే క్యాబ్‌లో వెళ్లిపోతున్న శ్రవణ్‌కు ఫోన్ చేసి వెనక్కి పిలిచాడు. శిరీషను కిందికి దింపి మంచంపై పడుకోబెట్టాడు. శ్రవణ్ కూడా వచ్చి అంబులెన్స్, పారామెడికల్ స్టాఫ్‌ను పిలిపించగా.. అప్పటికే శిరీష మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో రాజీవ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రభాకర్‌రెడ్డి విషయం బయటకు వెల్లడించవద్దని రాజీవ్, శ్రవణ్‌లు నిర్ణయించుకున్నారు. బంజారాహిల్స్ ఎస్సై నుంచి ప్రభాకర్‌రెడ్డికి వివరాలు శిరీష భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు మంగళవారం రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏం జరుగుతోందనే ఆందోళనతో ప్రభాకర్‌రెడ్డి తన స్నేహితుడైన ఎస్సై హరీందర్‌కు పలుమార్లు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం 10.05 గంటలకు ఫోన్ చేసినప్పుడు ‘ముగ్గురూ (రాజీవ్, శ్రవణ్, శిరీష) నీ దగ్గరకు వచ్చారట కదా! నలుగురూ కలిసి మద్యం తాగారట కదా..’అని హరీందర్ పేర్కొన్నారు. దీంతో తాను, శ్రవణ్ మాత్రమే మద్యం తాగామంటూ ప్రభాకర్‌రెడ్డి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత కొంత సేపటికే ప్రభాకర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో శేష ప్రశ్నలెన్నో..! బ్యూటీషియన్ శిరీషది కచ్చితంగా హత్యేనని.. ఈ వ్యవహారంలో ఎన్నో సందేహాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డిమాండ్ చేస్తున్నా రు. వారు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి .. 1. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదు? అసలు ఫాల్స్ సీలింగ్ ఉన్న గదిలో మంచంపై నిల్చుని ఫ్యాన్‌కు ఉరేసుకోవడం సాధ్యమేనా? 2. కుకునూర్‌పల్లిలో శిరీష, రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కలసి మద్యం తాగారని... మిగతా ఇద్దరు సిగరెట్ కాల్చ డానికి బయటకు వచ్చిన సమయంలో శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడన్న వాదనను పోలీసులు ఎలా నమ్మారు? సిగరెట్ కాల్చి వచ్చే వ్యవధి లోనే అలా చేయడం సాధ్యమా? 3. ఏడాది కింద పరిచయమైన తేజస్వినికి రాజీవ్ సన్నిహితమయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని.. శిరీషను వదిలించుకోవాలని భావించాడు. అలాంటి వ్యక్తి చెప్పిన కథనం ఎంత వరకు నమ్మశక్యం? 4. కుకునూర్‌పల్లిలో శిరీషపైనే అత్యాచారయ త్నం జరిగింది. బాధితురాలి పైనే రాజీవ్ ఎందుకు చేయిచేసుకోవాల్సివచ్చింది? 5. ఆమె మరణించిన తర్వాత నిందితులు ఆమెకు సంబంధించి చెప్పిన వివరాలను పోలీసులు ఎలా నమ్మారు? వారి మాటలు నమ్మి శిరీష, తేజస్వినిల వ్యక్తిగత జీవితా లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా? -
‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’
నల్లగొండ: తమ చెల్లి శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి భార్గవి అన్నారు. శిరీషది ముమ్మాటికి హత్యే అని ఆమె చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించాలని అస్సలు వదిలిపెట్టొద్దని అన్నారు. హత్య వెనుక రాజీవ్, శ్రవణ్, తేజస్వీ ప్రమేయం ఉందని అన్నారు. కావాలనే హత్యను ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరి చాలా ధైర్యంగల యువతి అని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఈ కేసులో తనకు పలు అనుమానాలున్నాయని, ఇప్పటి వరకు పోలీసులు తేజస్వీని ఎందుకు చూపిండం లేదని ప్రశ్నించారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతి కేసును ఛేదించినట్లుగా పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. తొలుత ఆత్మహత్యగా.. అనంతరం అనుమానాస్పద మృతిగా మారిన ఈ కేసుపై వివరాలను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వెల్లడిస్తారని ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో శిరీష సోదరి భార్గవి స్పందించారు. -
శిరీషను హత్య చేసింది ఎవరు?
హైదరాబాద్: గత మూడు రోజుల ఉత్కంఠ ముగిసింది. బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్య కాదు హత్యే అనే పోలీసులు నిర్ధారించారు. అయితే, ఆమెను ఎవరు హత్య చేశారు? హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి? ఒకరు చేశారా? లేక ఇద్దరు కలిసి చేశారా? మరో వ్యక్తి ప్రోద్భలం ఇందులో ఉందా? అనే కోణంలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు జరగబోయే మీడియా సమావేశంలో ఈ వివరాలన్నింటిని కూడా సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించనున్నారు. విషయం బయటకొచ్చేందుకు కొద్ది గంటలే ఉన్నప్పటికీ ఎవరు ఈ హత్య చేసి ఉంటారనే విషయంపై మాత్రం జోరుగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ముందునుంచే బ్యూటిషియన్ శిరీష మృతి కేసు అడుగడుగునా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. సోమవారం ఉదయమే శిరీష స్టూడియోకు రాగా శ్రవణ్, రాజీవ్‌లు మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. వారంతా కలసి రాత్రి 9.30 గంటల సమయంలో రాజీవ్‌కు చెందిన ఎండీవర్ కారులో కుకునూర్‌పల్లికి వెళ్లారు. నేరుగా ప్రభాకర్‌రెడ్డి పోలీస్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వెళ్లేముందు రాత్రి 8.40 గంటల సమయంలో తన భర్తకు ఫోన్ చేసిన శిరీష.. ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. అర్ధరాత్రి వరకు ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పంచాయితీ జరిగాక.. సుమారు ఒంటిగంట సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 1.40 గంటలకు శిరీష తాను శామీర్‌పేట ప్రాంతంలో ఉన్నట్లుగా తన భర్త సతీశ్‌చంద్రకు వాట్సాప్ ద్వారా లోకేషన్ పంపింది. ఆ వెంటనే సతీశ్ ఫోన్ చేసినా స్పందించలేదు. తెల్లవారుజామున 4.30 గంటలకు మరోసారి ఫోన్ చేసినా స్పందన రాలేదు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ముగ్గురూ స్టూడియో వద్దకు చేరుకున్నట్లు ఇప్పటి వరకు వారు చెప్పిన సమాచారం. అయితే, ఈ క్రమంలో మార్గమధ్యంలో వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి శిరీష కారు కూడా దిగి వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలోనే వారు కారులోకి బలవంతంగా ఎక్కించి ఏదో ఒకటి చేసి ఉండొచ్చని అనుమానం కలుగుతోంది. కారులో మార్గం మధ్యలోనే హత్య చేశారా? లేక స్టూడియోకు వచ్చిన తర్వాత ఆ పనిచేశారా? ఇంతకీ హత్య చేసిన వ్యక్తులు ఈ కేసులో ముందు నుంచి నిందితులుగా పేర్కొంటున్న వారేనా? లేక కొత్త వ్యక్తులు ఉన్నారా అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. -
శిరీష కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతిపై సందేహాలు పటాపంచలయ్యాయి. ఎట్టకేలకు శిరీష మృతి కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ఆత్మహత్యగా.. అనంతరం అనుమానాస్పద మృతిగా మారిన ఈ కేసుపై వివరాలు మరి కొద్ది గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2గంటలకు సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించనున్నారు. నిందితులను కూడా మీడియా ముందు ఉంచనున్నారు. గత మూడు రోజులుగా ఈ కేసు తీవ్ర ఉత్కంఠను రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతిపై కూడా హత్యనా లేక ఆత్మహత్యనా అనే కేసును విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు చేపట్టిన దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య అన్న దిశగా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించగా.. పోస్టుమార్టంలో మాత్రం ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమెది హత్య అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రాజీవ్, శ్రవణ్‌లను గురువారం రాత్రి ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారించారు. సేకరించిన ఆధారాలు, విచారణలో తేలిన అంశాలు, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ముగింపునకు వచ్చిన పోలీసులు మరికొద్ది గంటల్లో వివరాలు తెలపనున్నారు. -
అంతుచిక్కని ప్రశ్నలెన్నో!
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతిపై సందేహాలు - అది హత్యా.. ఆత్మహత్యా అనే అనుమానాలు - ఎస్సై సూసైడ్‌నోట్ రాసినట్లుగా చెబుతున్న బంధువులు - గజ్వేల్ ఏసీపీ దానిని మాయం చేశారంటూ ఆరోపణలు - కేసును పక్కదారి పట్టించేందుకే తెరపైకి శిరీష వ్యవహారం! - విచారణకు ఇద్దరు అధికారుల నియామకంతో గందరగోళం - డీఎస్పీ, అదనపు డీజీపీలలో ఎవరు విచారణాధికారి? - కేసుపై అధికారికంగా స్పష్టత ఇవ్వని పోలీస్ శాఖ - స్వగ్రామంలో ప్రభాకర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి సాక్షి, హైదరాబాద్, సిద్దిపేట రూరల్, ఆలేరు: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వ్యవహారంలో అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు అది హత్యా.. ఆత్మహత్యా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. పోలీసు క్వార్టర్లో ఎస్సై మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ముందు సూసైడ్‌నోట్ రాసి ఉంటాడని, తొలుత వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు దానిని మాయం చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే శిరీష ఘటనతో లింకుపెడుతూ లీకులు ఇచ్చారని పేర్కొంటున్నారు. మరోవైపు ఎస్సై ఆత్మహత్య ఘటనపై విచారణ అంశం తీవ్ర గందరగోళంగా మారింది. ఈ ఘటనపై విచారణాధికారిగా సంగారెడ్డి డీఎస్పీని నియమిస్తున్నట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ప్రకటించగా... అదనపు డీజీపీ గోపీకృష్ణకు విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ ప్రకటించారు. దీంతో అసలు విచారణ అధికారి ఎవరనే సందేహం తలెత్తింది. దీనిపై పోలీసు శాఖ ఇప్పటివరకూ అధికారికంగా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. సంగారెడ్డి డీఎస్పీతో విచారణా? ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనపై సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న విచారణ జరుపుతారని, పై అధికారుల వేధింపులు ఉంటే నివేదికలో స్పష్టం చేయాలని ఆదేశించామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే డీఎస్పీ తిరుపతన్న మీద నయీమ్‌తో అంటకాగారనే ఆరోపణలున్నాయి. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇటీవల డీజీపీ పత్రికా ముఖంగా తెలిపారు కూడా. అలాంటి అధికారిని ఇంత సున్నితమైన కేసులో విచారణాధికారిగా నియమించడం వెనుకున్న ఆంతర్యం ఏమిటన్నది ఉన్నతాధికారులకే తెలియాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. అదనపు డీజీపీ పని ఏమిటి? మరోవైపు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు డీజీపీ గోపీకృష్ణను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు. ఇప్పటికే తిరుపతన్నకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ప్రకటించారు. మరి ఈ ఘటనపై ఇద్దరు అధికారులు విచారణ చేయడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు చేసే విచారణ వేర్వేరుగా ఉంటుందా? బాధ్యతలు పంచుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు. డ్యామేజీని కంట్రోల్‌కే రోజంతా? వరుసగా జరుగుతున్న ఎస్సైల ఆత్మహత్యలతో పోలీసు శాఖ ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. కీలకమైన జిల్లా, పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకే అధికారులు రోజంతా వెచ్చించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఎస్సై ఆత్మహత్య చేసుకుంటే. రాత్రి వరకు దానిపై ఒక అధికారిక ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం నుంచి బయటపడానికే ఉన్నతాధికారులు ప్రాధాన్యత ఇచ్చారని... ఎస్సై ఆత్మహత్య కారణాలను విశ్లేషించడం, విచారణకు ఆదేశించడంపై దృష్టి పెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు సంగతీ అంతేనా..? దాదాపు పది నెలల కింద ఇదే పోలీసుస్టేషన్లో ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు డీఎస్పీ, సీఐలు వసూళ్ల కోసం వేధిస్తున్నారంటూ సూసైడ్‌నోట్ రాశారు. ఆ కేసు దర్యాప్తు ఏమైందో ఇప్పటికీ తేలలేదు. అదే కాదు గతంలో జరిగిన ఏడుగురు ఎస్సైల ఆత్మహత్యల ఘటనలపైనా ఇప్పటికీ విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క వ్యవహారంలోనూ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేగాకుండా విషయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలూ జరిగాయనే ఆరోపణలున్నాయి. రామకృష్ణారెడ్డి తాగుబోతు అని, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కాల్చుకుని ఉంటాడంటూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తర్వాత దుబ్బాక ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్య చేసుకున్న ఘటనలోనూ.. ఆయన కుమారుడు, కోడలు మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులోనూ బ్యూటీషియన్ శిరీష వ్యవహరాన్ని తెరపైకి తీసుకొచ్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై సూసైడ్‌నోట్.. మాయం? ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలతో కచ్చితంగా సూసైడ్‌నోట్ రాసి ఉంటారని ఆయన బంధువులు, సన్నిహితులు చెబుతున్నారు. ఎస్సై ఆత్మహత్య చేసుకున్న తర్వాత తొలుత ఏసీపీ గిరిధర్ (ఈ ఘటనలో బదిలీ అయిన అధికారి) తలుపులు పగలగొట్టి క్వార్టర్ లోపలకి వెళ్లారని... సూసైడ్‌నోట్‌లో ఉన్నతాధికారుల పేర్లు ఉండడంతో మాయం చేశారని ఆరోపిస్తున్నారు. ఎస్సై ఆత్మహత్యతో ఏ సంబంధమూ లేకుంటే గజ్వేల్ ఏసీపీ గిరిధర్‌ను ఆగమేఘాల మీద ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నారు. ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన పక్క గదిలోని టేబుల్‌పై నోట్‌బుక్, కొన్ని తెల్ల కాగితాలు, పెన్ను ఉన్నాయని.. దానిని బట్టి ఆత్మహత్యకు ముందు ప్రభాకర్‌రెడ్డి ఏదైనా లేఖ రాసి ఉంటారని స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రభాకర్‌రెడ్డి యూనిఫామ్ షర్టు కుడివైపు జేబుకు ఉన్న బటన్ (గుండీ) తీసి ఉంది. ప్రభాకర్‌రెడ్డి సూసైడ్‌నోట్‌ను ఆ జేబులో పెట్టుకోగా.. సూసైడ్‌నోట్‌ను తీసేందుకు గుండీ తీశారా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఇక ప్రభాకర్‌రెడ్డి కణతపై రివాల్వర్‌తో కాల్చుకోగా.. తల నుంచి ఇరువైపులా రక్తపుధారలు కారాయి. కానీ ఎడమవైపు రక్తం కింది వరకు కారినట్లుగా ఆనవాళ్లు ఉండగా.. కుడివైపు మాత్రం రక్తం ఆ జేబు బటన్ వరకు వచ్చి ఆగడం, తర్వాత మళ్లీ రక్తపు చారలు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 45 రోజుల్లో 20 మెమోలు! తనను ఉన్నతాధికారులు వేధిస్తున్నారని, తరచూ మెమోలు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తోటి సిబ్బందికి చెప్పుకొని బాధపడే వారని పోలీసులు చెబుతున్నారు. ఆయనకు గజ్వేల్ ఏసీపీ గిరిధర్ దాదాపు నెలా పదిహేను రోజుల వ్యవధిలో ఏకంగా 20కి పైగా మెమోలు ఇచ్చారని సిద్దిపేట పోలీసు కమిషనరేట్ వర్గాల ద్వారా తెలిసింది. స్వగ్రామంలో ప్రభాకర్‌రెడ్డి అంత్యక్రియలు కుకునూరుపల్లి ఎస్సై పిన్నింటి ప్రభాకర్‌రెడ్డి మృతదేహానికి గురువారం తెల్లవారుజామున సిద్ధిపేట జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. వీడియో చిత్రీకరణ మధ్య.. గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి డీఐజీ శివశంకర్‌రెడ్డి, సీపీ శివకుమార్‌లు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు తరలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన భార్య రచన, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది కంటతడి పెట్టారు. ప్రభాకర్‌రెడ్డి మృతదేహంపై డీసీపీ యాదగిరి, ఏసీపీ సాధుమోహన్‌రెడ్డి, యాదగిరిగుట్ట సీఐ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి బంధువులు, స్నేహితులు డీసీపీని నిలదీశారు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ప్రభాకర్‌రెడ్డి మరణిస్తే.. టీవీ చానళ్లలో తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వేధింపులతో తన భర్తను పొట్టన పెట్టుకున్నారని రచన వాపోయారు. -
హత్యా.. ఆత్మహత్యా?
బ్యూటీషియన్ శిరీష మరణంపై అనుమానాలు - ఆత్మహత్య చేసుకుందని తొలుత భావించిన పోలీసులు - పోస్టుమార్టం పరీక్షల్లో దేహంపై గాయాల గుర్తింపు - కమిలిపోయిన కుడికన్ను, పెదవులు.. తల వెనుక భాగంలో గాయాలు.. దీంతో హత్య కోణంలో పోలీసుల విచారణ - ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు సాక్షి, హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతిపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఆమెను హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు చేపట్టిన దర్యాప్తులో ఆమెది ఆత్మహత్య అన్న దిశగా పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించగా.. పోస్టుమార్టంలో మాత్రం ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆమెది హత్య అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రాజీవ్, శ్రవణ్‌లను గురువారం రాత్రి ఘటనాస్థలానికి తీసుకెళ్లి విచారించారు. కుకునూర్‌పల్లి నుంచే మొదలైన ఘర్షణ! స్టూడియో యజమాని రాజీవ్ వల్లభనేని–శిరీష మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సోమవారం రాత్రి రాజీవ్, శ్రవణ్, శిరీషలు కుకునూర్‌పల్లి వెళ్లారు. అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఆయన క్వార్టర్‌లోనే పంచాయితీ జరుగుతున్న సమయంలోనే ఘర్షణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. శిరీష–ప్రభాకర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగి తీవ్రస్థాయికి చేరుకుందని.. దాంతో వారిని వెళ్లిపోవాలంటూ ప్రభాకర్‌రెడ్డి పంపిచేశారని సమాచారం. కారులో దాడి చేసిన రాజీవ్, శ్రవణ్ ఈ ముగ్గురూ మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో కుకునూర్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ సమయంలోనే శిరీష తన భర్తకు వాట్సాప్ ద్వారా లొకేషన్‌ను షేర్ చేసింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో రాజీవ్, శిరీష మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజీవ్ శిరీషపై చేయి చేసుకున్నాడని తెలిసింది. ఓ దశలో శ్రవణ్ కూడా చేయి చేసుకున్నట్లు సమాచారం. దీంతో కారు దిగిపోవడానికి శిరీష రెండుసార్లు ప్రయత్నించగా వారు ఆపారు. కొంతసేపటికి పరిస్థితి చల్లబడింది. అనంతరం వారు నేరుగా ఆర్జే స్టూడియోకు వచ్చేశారు. వాహనం తెచ్చుకుంటానని చెప్పి.. కుకునూర్‌పల్లి వెళ్లేముందు శిరీష తన వాహనాన్ని స్టూడియో వద్దే వదిలేసింది. తిరిగొచ్చాక తన వాహనాన్ని తెచ్చుకుంటానంటూ స్టూడియోలోకి వెళ్లింది. మరోవైపు శ్రవణ్ తన స్వస్థలమైన మాల్‌కు వెళ్లాల్సి ఉండటంతో.. రాజీవ్ బస్టాండ్ వరకు క్యాబ్ బుక్ చేసిన అతడిని పంపేశాడు. అప్పటికే శిరీష స్టూడియోలోకి వెళ్లి పది నిమిషాలు కావడం, లోపల లైటు వెలుగుతుండటంతో కొద్దిసేపు బయటే ఎదురుచూశానని రాజీవ్ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. శిరీష తిరిగి రాకపోవడంతో పైకి వెళ్లిచూడగా.. అప్పటికే చున్నీతో ఉరి వేసుకుని కనిపించిందని... ఆమెను కిందకు దింపి పోలీసులకు సమాచారమిచ్చానని చెప్పినట్లు సమాచారం. శిరీష దేహంపై గాయాలు శిరీష మృతదేహానికి మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయగా.. ఫోరెన్సిక్ వైద్యులు గురువారం ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. శిరీష శరీరంపై గాయాలు ఉన్నాయని.. మెడపై ఒత్తిడి పడడంతో ఊపిరాడక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కుడి కన్ను కమిలిపోయి ఉండటంతో పాటు రెండు పెదవులపైనా గాయాలు ఉన్నాయని, తల వెనుకభాగంలోనూ గాయాలున్నాయని వెల్లడించినట్లు సమాచారం. దీంతో హత్య చేసి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజీవ్, శ్రవణ్‌లను గురువారం రాత్రి స్టూడియోకు తీసుకువెళ్లి పలు కోణాల్లో విచారించారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ పరిశీలన ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ బృందం శిరీష మృతిచెందిన స్థలాన్ని గురువారం పరిశీలించి ఆధారాలు సేకరించింది. పోలీసుల అదుపులో ఉన్న రాజీవ్, శ్రవణ్ చెప్పిన వివరాలకు ఇక్కడ సేకరించిన ఆధారాలకు ఎంతవరకు లింకు ఏర్పడుతోందన్న దిశగా పోలీసులు ఆరా తీశారు. 13వ తేదీ తెల్లవారుజామున స్టుడియోకు వచ్చిన శిరీష.. 3.45 గంటల సమయంలో గదిలోకి వెళ్లినట్టు బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించారు. పాదముద్రల ఆధారంగా ఆమె నడుచుకుంటూ వెళ్లిందని, అంటే గదిలోకి వెళ్లేముందు శిరీష ప్రాణాలతోనే ఉందని తేల్చారు. ఇక 3.55 గంటలకు రాజీవ్ బయోమెట్రిక్ ప్రెస్ చేయగా తెరుచుకోకపోవడంతో.. కిందకు వెళ్లి పది నిమిషాల తర్వాత వచ్చినట్టు భావిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు చాలా రోజులుగా పనిచేయడం లేదని వెల్లడైంది. శిరీష ఘటనతో లింకుపై దర్యాప్తు – కుకునూర్‌పల్లికి రాజీవ్, శ్రవణ్, తేజస్విని! ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాద్‌లో మేకప్ ఆర్టిస్ట్ శిరీష మృతి ఘటనకు లింకుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్సై ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచీ జరిగిన పరిణామాలపై దృష్టి కేంద్రీకరించారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శిరీష ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినిలను కుకునూర్‌పల్లి పోలీస్ క్వార్టర్స్‌కు తీసుకువచ్చి విచారించినట్లు తెలిసింది. ఎస్సై క్వార్టర్లో 12వ తేదీ రాత్రి ఏం జరిగింది, ఏం మాట్లాడారనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. -
వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఇందూరు ప్రభాకర్‌రెడ్డిని ప్రత్యర్థులు శనివారం దారుణ హత్య చేశారు. సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన ప్రభాకర్ రెడ్డి, ఆయన బావమరిదిని వెంబడించిన ప్రత్యర్థులు వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లు, కత్తులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇరువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రభాకర్‌రెడ్డి గతంలో ఎంపీపీగా పని చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఘటనాస్ధలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంజీఆర్, జయలలిత విగ్రహాల ఏర్పాటు
క్రిష్ణగిరి(సూళగిరి): తమ లీడర్‌పై నాయకులకు అమితమైన ప్రేమ ఉంటుంది. అలాంటి అభిమానం ఎంతటికైనా దారితీస్తుంది. ఆ అభిమానమే వారి విగ్రహాల ఏర్పాటుకు కారణమైంది. తమిళనాడులోని సూళగిరి యూనియన్ అన్నాడీఎంకే వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు గోవిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నాడీఎంకే నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హజరయ్యారు. -
వేంపల్లిలో ఒకే రోజు రెండు చోరీలు
వేంపల్లి (వైఎస్సార్ జిల్లా): వేంపల్లి మండల కేంద్రంలోని పుల్లయ్య తోటలో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. వేంపల్లి నారాయణ స్కూల్ లో డైరెక్టర్‌గా వున్న ప్రభాకర్ రెడ్డి పుల్లయ్య తోటలో నివాసం వున్నారు. శనివారం కడపలో ఓ శుభకార్యానికి ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు వెళ్లారు. ఆదివారం వేకువజామున దొంగలు మాటు వేసి ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను పగుల గొట్టి విలువైన నగలు, సామాగ్రిని దోచు కెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒకేరోజు చౌడేశ్వరి ఆలయంలో, ఇక్కడ రెండు చోట్లా చోరీలు జరగడంతో వేంపల్లి ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
► జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలిగేడు: భూసమస్యలతోపాటు వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మండలంలోని బుర్హాన్ మియాపేటకు చెందిన రైతులు గత రెండేళ్లుగా తమ ప ట్టా భూములను ఆన్ లైన్ లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ జేసీకి ఫిర్యాదుచేయగా గురువా రం జేసీ ఎలిగేడు తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి తనిఖీ చేశారు. రైతుల సమస్యల ను 15రోజుల్లోగా పరిష్కరించాలని వీఆర్వో తిరుపతిపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, సాదాబైనామాల సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిం చడం సరికాదన్నారు. కార్యాలయ పనితీరుపై తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలతో సుదీర్ఘంగా చర్చించారు. జేసీ వెంట తహసీల్దార్ నాగరాజమ్మ, ఆర్ఐ అమ్జద్, వీఆర్వోలు, బుర్హాన్మియాపేట రైతులు పాల్గొన్నారు. -
జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీల భేటీ
ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు వినోద్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఆయనను కలిశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఆ మూడు రాష్ర్టాల్లోని వెనకబడిన జిల్లాలకు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి హామి ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు. -
ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
చండూరు :గట్టుప్పల గ్రామాన్ని మండలంగా మొదటి ముసాయిదాలో ప్రకటించి చివరగా రద్దు చేయడం పట్ల బాధ్యత వహిస్తూ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేయాలని సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి అనంతరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలం కోసం చేస్తున్న నిరసనకు ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కై లాసం అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మొదటగా ప్రకటించి తర్వాత రద్దు చేయడంపై అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఇడెం విజయ్ కుమార్, మల్లేష్, కుండే సత్యనారాయణ, సత్తయ్య, నర్సింహ, నామని బుచ్చయ్య, బీమగోని మల్లేశం, కొంగరి కోటయ్య, క్రిష్ణ, యశ్వంత్, పరదీప్, రాజశేఖర్ ఉన్నారు. -
టవరెక్కిన యువకులు
జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదలకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక బీసీఎన్‌ఎల్ టవర్ ఎక్కి కిందకు దూకేస్తామని హెచ్చరిస్తున్నారు. టవరెక్కిన కుమార్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మోసిన్‌లను కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గుమ్మడిదల ప్రధాన రహదారిపై అఖిల పక్షనాయకులు రాస్తారోకోకు దిగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కాసేపు స్తంభించింది. -
నగరాన్ని వణికిస్తున్న డెంగీ
రెండు రోజుల్లో ముగ్గురు మృతి సాక్షి, హైదరాబాద్: డెంగీ విజృంభణతో నగరవాసికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతలమైన నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో డెంగీ వ్యాప్తి చెందుతుండటంతో హడలిపోతోంది. మంగళ, బుధవారాల్లో నగరానికి చెందిన ఇద్దరు చిన్నారులతోపాటు ఓ వ్యక్తి డెంగీతో మృత్యువాతపడటం కలవరానికి గురిచేస్తోంది. కొత్తపేట డివిజన్ న్యూనాగోలు కాలనీకి చెందిన ప్రభాకర్‌రెడ్డి కుమార్తె వైష్ణవి (8) డెంగీతో అంకూర్ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. పహడీషరీఫ్ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హదీస్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జాకీర్ హుస్సేన్(38) వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరాడు. హుస్సేన్ డెంగీతో బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతి చెందాడు. ఇక సూరారం డివిజన్ రాజీవ్ గాంధీనగర్‌కు చెందిన కిశోర్, సౌజన్య దంపతుల కుమార్తె మందిర(8)కు వారం రోజుల క్రితం జ్వరం రావడంతో షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. డెంగీ నిర్ధారణ కావడంతో మెరుగైన చికిత్స కోసం లక్డికాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. -
ఆనాడు ఏం జరిగిందంటే..
-
జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాస్
ఇందూరు : జిల్లా ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఎం.శ్రీనివాస్ రానున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గల రాష్ట్ర శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు డీడీగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి జారీ అయ్యాయి. రెండు, మూడు రోజుల్లో నూతన డీటీవోగా జిల్లాకు వచ్చి విధుల్లో చేరనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం డీడీగా పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి హైదరాబాద్‌లో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సీఏవోగా ప్రభుత్వం పదోన్నతి ఇచ్చి బదిలీ చేస్తూ మరో ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ప్రభాకర్ రెడ్డి జిల్లా ట్రెజరీ అధికారిగా వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది. 2015 డిసెంబర్ 1న ఆయన జిల్లాకు వచ్చారు. వచ్చి రాగానే ట్రెజరీ శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన, ఆరోపణలున్న ఉద్యోగుల సెక్షన్ల మార్పు, అర్హులకు పదోన్నతులు కల్పించి మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే జిల్లాలో వెలుగు చూసిన నకలీ పెన్షన్ ‘యాహ్యా’ ఉదంతంపై లోతైన విచారణ చేపట్టడంతో పాటు, మిగతా అన్ని పెన్షన్లపై విచారణ చేపట్టిన మొదటి డీడీగా నిలిచిపోయారు. -
పోలీస్‌స్టేషన్ నుంచి నిందితుడి పరారీ
పర్చూరు: పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తప్పించుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్చూరుకు చెందిన ప్రభాకరశర్మ రైతుల నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసి, రూ. 2 కోట్ల మేర బాకీ పడ్డాడు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతడిని స్టేషన్లో ఉంచారు. గురువారం వేకువజామున ప్రభాకరశర్మ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీఐజీ ప్రభాకరరావు, చిత్తూరుకు చెందిన ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు, టీటీడీ మాజీ ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డి తదితరలు కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. -
వ్యక్తి దారుణ హత్య
మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీజేపీ క్యాంప్ సమీపంలో దుండగులు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జాగిలాలలో ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. -
'వైశ్రాయ్' ఎండీ ఇంటి ముందు ధర్నా
హైదరాబాద్: బడాబాబుల నుంచి రుణాలు వసూలు చేసుకునేందుకు బ్యాంకులు నానాకష్టాలు పడుతున్నాయి. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. వైశ్రాయ్ హోటల్ ఎండీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఓరియంటల్ బ్యాంకు సిబ్బంది మంగళవారం ధర్నాకు దిగారు. రుణాలు చెల్లించాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. అప్పుగా తీసుకున్న కోట్లాది రూపాయలు తిరిగి చెల్లించకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని బ్యాంకు సిబ్బంది వాపోయారు. కాగా, తమ బ్యాంకు నుంచి రుణాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు ఇంటిముందు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరిట కావూరి రూ.160 కోట్ల రుణాలు తీసుకున్నారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. -
అందమైన ప్రేమ చిత్రం
దేశాన్ని పట్టి పీడిస్తున్న ఓ సామాజిక సమస్య కథాంశంగా రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా స్వీయదర్శకత్వంలో ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేమ్ జె. ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. దర్శక-నిర్మాత జె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ‘బాహుబలి’ చిత్రానికి రచయితగా పని చేసిన అజయ్ కథా, కథనాలు ఈ చిత్రానికి ఓ హైలైట్. ఓ వాణిజ్య చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఇందులో ఉన్నాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సహ-నిర్మాత: కొడాలి సుబ్బారావు, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్. -
చిత్రమ్ చెప్పిన ప్రేమకథ!
‘ప్రేమకథా చిత్రమ్’ తెరకెక్కించిన జె. ప్రభాకర్ రెడ్డి స్వీయదర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఇటీవల నాయకానాయికలపై విదేశాలలో పాటలను చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. జార్జియా దేశ రాజధాని టిబ్లిసి, అనామరి, స్నో, కాస్బెర్గ్ తదితర అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించాం. వచ్చే నెలలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి రచన: అజయ్, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్. -
పాలు కాదు.. యూరియా నీళ్లు
-
పాలు కాదు.. యూరియా నీళ్లు
హైదరాబాద్: ఓ పాల వ్యాపారి అందులో యూరియా రసాయనాలు కలిసి అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గాల్ పల్లిలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నాడు. పాలలో యూరియా రసాయనాలు కలిపి వాటిని చిక్కగా తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాలు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాల వ్యాపారిని తమదైన శైలిలో విచారిస్తేం పూర్తి సమాచారం బయట పడింది. తర్వాత ఆ పాల వ్యాపారితో పాటు ఈ ఘటనకు సంబంధించి అతడికి సహకరించిన గ్యాంగ్ మొత్తాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ట్రిపుల్ ఐటీలో రూ.10 కోట్లతో ఇండోర్ స్టేడియం
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ.10 కోట్లతో ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ వెల్లడించారు. 14వ తేదీనుంచి 16వ తేదీవరకు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్న టెక్ ఫెస్టివల్‌పై బుధవారం డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డిలతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు తమ సమస్యలు తీర్చమని కోరడం మంచిదే కానీ.. సమంజసం కానీ డిమాండ్లను తీర్చాలని పట్టుబట్టడం సరికాదన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం తాము అన్నివిధాలా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా వారి సమస్యలను తెలుసుకునేందుకు శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్పీ అన్బురాజన్, సీఐ మహేశ్వరరెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు ఉంటారన్నారు. నెలకొకసారి సమావేశమై ఇక్కడి సమస్యలను తమకు తెలియజేసే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో రూ. 90 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. డిజిటల్ లైబ్రరీ, ల్యాబొరేటరీలు, ఇండోర్ స్టేడియం ఇందులో ఉన్నాయన్నారు. యూనిఫాం కోసం టెండర్లు పిలిచామన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అన్ని ట్రిపుల్ ఐటీల్లో వైఫై సౌకర్యం కల్పించాలనిన సీఎం చెప్పారన్నారు. రూ.10 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, యోగా సెంటర్ ఉంటాయన్నారు. రూ. 60 లక్షలతో వాషింగ్ మిషన్‌ను కొనుగోలు చేశామన్నారు. తాగునీటి సౌకర్యం బాగుందన్నారు. అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగులకు బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. టెక్ ఫెస్టివల్‌కు మంత్రి ఘంటా రారు.. ఈనెల 14వ తేదీనుంచి 16వ తేదీవరకు ట్రిపుల్ ఐటీలో జరగనున్న టెక్ ఫెస్టివల్‌కు సాంకేతిక విద్యా శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు రావడం లేదని వైస్ చాన్సలర్ సత్యనారాయణ తెలిపారు. అనివార్య కారణాలవల్ల ఆయన పర్యటన వాయిదా పడిందన్నారు. టెక్ ఫెస్టివల్‌కు సంబంధించి వలంటీర్లతో ఆయన మాట్లాడారు. షెడ్యూల్‌ను పరిశీలించారు. అనంతరం పీ2 విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి బోధన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల గురించి ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని.. సక్రమంగా చదువుకొని భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి లెఫ్ట్ మద్దతు
సాక్షి,హైదరాబాద్ : మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయరాదని పది వామపక్షాలు నిర్ణయించాయి. ఈ స్థానం నుంచి పోటీచేస్తున్న వారిలో ఎవరికి మద్దతునివ్వాలనే విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలు జరిగేలోగా మరోసారి భేటీ అయ్యి దీనిపై నిర్ణయించే అవకాశముంది. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ పోటీచేస్తున్నందున, పార్టీ ముద్ర ఉన్న వ్యక్తికి మద్దతుపై ఈ పార్టీల్లో ఇంకా స్పష్టత రాలేదు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కౌన్సిల్‌కు పోటీచేస్తున్న ఎస్.ప్రభాకర్‌రెడ్డికి పూర్తి మద్దతును ఈ పార్టీలు ప్రకటించాయి. గురువారం నల్లగొండలో ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఈ పార్టీల ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని కార్యాలయంలో భేటీ అయిన ఈ పార్టీల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా సీపీఐ,సీపీఎంల తరఫున ఈ స్థానాలకు అభ్యర్థులను నిలపాలనే ప్రయత్నం జరిగినా.. అది ఫలవంతం కాలేదు. ఈ పార్టీలు నిలిపే అభ్యర్థులకు మిగతా పార్టీల మద్దతు లభించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని సీపీఐ,సీపీఎం విరమించుకున్నాయి. ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి అభ్యర్థిని పోటీకి నిలిపే విషయంలో వివిధ వామపక్షాలమధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. హైదరాబాద్ సీటు నుంచి సీపీఎం జనార్దనరెడ్డిని నిలిపే యత్నం చేయగా, ఒకపార్టీ ముద్ర ఉన్న వాళ్లు కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన వారినే ఉమ్మడి అభ్యర్థిగా అంగీకరిస్తామని మిగతాపక్షాలు ఒప్పుకోలేదు. దీనితో ఈ స్థానానికి పోటీచేయరాదని వామపక్షాలు నిర్ణయించాయి. అయితే అదే సమయంలో నల్లగొండ,వరంగల్,ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎస్.ప్రభాక ర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి పదివామపక్షాలు మద్దతును పలకడం కమ్యూనిస్టుపార్టీల చరిత్రలోనే తొలిసారని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తాము మద్దతు పలికిన అభ్యర్థి విజయానికి కృషిచేయాలని ఈ పార్టీల నేతలు నిర్ణయించారు. బుధవారం ఎస్వీకేలో జరిగిన భేటీలో తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ), జానకీరాం (ఆర్ఎస్పీ), ఎం.శ్రీనివాస్ (సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ), మురహరి (ఎస్‌యూసీఐ) పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడు గ్రూపులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చాలా కాలం తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో తెలుగు తమ్ముళ్లు నిమగ్నమయ్యారు. మంత్రి నారాయణ, మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముగ్గురు నేతలు తయారు చేసిన జాబితాను సోమవారం అధిష్టానానికి సమర్పించనున్నట్లు తెలిసింది. ముందుగా దేవాలయ, మార్కెట్ కమిటీలు పూర్తి చేయనున్నారు. ఆ తరువాత గ్రంధాలయ, నూడా, ఆర్టీసీ చైర్మన్ పదవుల నియమాకం చేపట్టనుండడంతో వీటి కోసం తమ్ముళ్ల మధ్య పోటీ తీవ్ర మైంది. ఒకరికి తెలియకుండా ఒకరు ముఖ్యమైన పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ‘నా వాళ్లకే ఆ పదవులు కట్టబెట్టాలి. పార్టీలో ఎటువంటి అనుభవం లేని.. పార్టీ కోసం మొదటినుంచి కష్టపడని వ్యక్తుల వర్గీయులకు ఇస్తే ఒప్పుకునేది లేదు’ అని ఇద్దరు మాజీ మంత్రులు అధిష్టానానికి తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావాహుల వివరాలు.. జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోసం ఆదాల ప్రభాకరరెడ్డి వర్గానికి చెందిన పేరిన కోటేశ్వరరెడ్డి, సోమిరెడ్డి వర్గానికి చెందిన పాముల రమణయ్యకు ఇప్పించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇంకా కోవూరు మార్కెట్ కమిటీకి పోటీ పడుతున్న గూడూరు వెంకటనాగశేఖరరెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు అర్బన్ డవలప్మెంట్ సొసైటీ (నుడా) చైర్మన్ కోసం టీడీపీ అడహక్ కమిటీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, సీనియర్ నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూరాధ పోటీ పడుతున్నారు. 33 మండలాలు మొత్తం కలిపితే సీనియర్ నాయకులు సైతం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ చైర్మన్ కోసం ఆర్టీసీ విభజన పూర్తయితే గూడూరు రఘునాథరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, అనూరాధా చైర్మన్ పదవిని అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవాలయాల పాలకమండళ్లు.. పెంచలకోన దేవస్థానం చైర్మన్ పదవి కోసం మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు గంగా ప్రసాద్ వర్గానికి చెందిన నానాజి, నారా లోకేష్‌బాబుకు సన్నిహితంగా మెలిగే వెంకటగిరి ప్రాంతంలోని బీసీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి పోటీ పడుతున్నారు.చెంగాళమ్మ ఆలయానికి వేనాటి రామచంద్రారెడ్డి ఎవరి పేరు సూచిస్తే వారికే చైర్మన్ పదవి దక్కుతుంది.జొన్నవాడ కామాక్షమ్మ ఆలయానికి పట్టాభిరామిరెడ్డి వర్గీయుడు కాటంరెడ్డి చంద్రారెడ్డి, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్గానికి చెందిన జక్కంరెడ్డి కృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. రంగనాయకుల స్వామి ఆలయానికి సోమిరెడ్డి వర్గానికి చెందిన మండవ రామయ్య, ఒట్టూరు సంపత్‌రాజు, మంత్రి నారాయణ వర్గానికి చెందిన కోట గురుబ్రహ్మ పోటీపడుతున్నారు. ఇరగాళమ్మ దేవస్థానానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి వర్గానికి చెందిన రమేష్ ఆచారి, మెట్టు సురేష్, సోమిరెడ్డి వర్గానికి చెందిన జలదంకి సుధాకర్ పోటీ పడుతున్నారు. నరసింహ కొండ ఆలయానికి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గానికి చెందిన వేమిరెడ్డి అశోక్‌రెడ్డి, వేమిరెడ్డి ఆనందరెడ్డి పోటీ పడుతున్నారు. మూలస్థానేశ్వర దేవాలయానికి ప్రస్తుత చైర్మన్ ఆంతూరి మహేశ్వరరెడ్డినే కొనసాగించాలని ఉద్దేశంలో నాయకులు ఉన్నారు. అదే విధంగా నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి ఆలయ సభ్యత్వం కోసం తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. నెల్లూరు మార్కెట్ కమిటీకి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి వర్గానికి చెందిన ముసునూరు బాపిరెడ్డి పేరుమాత్రం వినపడుతోంది నాయుడుపేట మార్కెట్ కమిటీ చెర్మైన్ పదవి కోసం విజయభాస్కరరెడ్డి మాత్రం పోటీలో ఉన్నారు. కోవూరు మార్కెట్ కమిటీకి ఎమ్మెల్య పోలంరెడ్డి అనుచరుడు ఊటుకూరు విజయబానురెడ్డి, సోమిరెడ్డి అనుచరుడు సీనియర్ నాయకుడు గూడూరు వెంకటనాగశేఖరరెడ్డి పోటీపడుతున్నారు. వెంకటగిరి మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పి.రాజేశ్వరరావు పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. కావలి మార్కెట్ కమిటీకి బీద సోదరుల బంధువు దేవరాళ్ల సుబ్రమణ్యం, కలగుంట్ల మధుబాబు, మంత్రి నారాయణ సామాజిక వర్గానికి చెందిన మల్లిశెట్టి వెంకటేశ్వర్లు పోటీ పడుతున్నారు.రాపూరు మార్కెట్ కమిటీకి సోమిరెడ్డి వర్గానికి చెందిన పాపకన్ను మధుసూదన్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఆదాల ప్రభాకర్‌రెడ్డి పొదలకూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిని నియమించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మకూరు మార్కెట్ కమిటీకి ఇందూరు వెంకటరమణారెడ్డి, చండ్ర వెంకటసుబ్బయ్యనాయుడు, రాపూరు సుందరరామిరెడ్డి, రాపూరు పెంచలరెడ్డి, నంది వివేకానందరెడ్డి పోటీ పడుతున్నారు. వీరంతా సోమిరెడ్డి, కన్నబాబు వర్గీయులు. -
రైతులను అన్నివిధాల ఆదుకుంటాం
రామాయంపేట: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం రామాయంపేట వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండో గ్రేడ్, మూడో గ్రేడ్ మక్కలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో రైతులకు కొంతమేర మేలు జరుగుతుందన్నారు. కరువు మూలంగా మొక్కజొన్న సరిగా ఎదగక పోవడంతో చాలావరకు రైతులు నష్టపోయారని, గ్రేడ్లవారీగా మక్కలను కొనుగోలు చేయడంతో వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు రైతులను మభ్యపెడుతున్నాయని, ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. అనవసర విమర్శలు చేయకుండా అభివృద్ధి విషయమై సహకరించాలన్నారు. విలేకరులకు హెల్త్‌కార్డులతోపాటు ఇళ్ల స్థలా లు మంజూరు చేస్తామన్నారు. ఈసందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య డిప్యూటీ స్పీకర్, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిని సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, నరేన్ ట్రస్ట్ అధినేత చాగన్ల నరేంద్రనాధ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, సర్పంచులు పాతూరి ప్రభావతి, తిర్మల్‌గౌడ్, పార్టీ జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, చంద్రపు కొండల్‌రెడ్డి, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
మెదక్‌లో మరోసారి టీఆర్ఎస్ ఘనవిజయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమలో ‘కొత్త గులాబీ’ పరిమళించింది. టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కట్టారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై జిల్లా ఓటర్లు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం తగ్గినా.. ప్రత్యర్థుల మీద ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఏకపక్షంగా సాగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,61,286 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ డిపాజిట్లు రావడంతో పరువు దక్కినట్టయింది. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలో 0.2 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 55 శాతం ఓట్లు రాగా, ఈసారి 55.2 శాతం ఓట్లు వచ్చాయి. పోటీలో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని 10,687 మంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. మంగళవారం మొత్తం 22 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత కనబరిచారు. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రభాకర్‌రెడ్డికి మెజార్టీ ఓట్లు లభించాయి. ఓటమిని ముందే ఊహించిన సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రానికి కూడా రాలేదు. ముగ్గురిలో ఇద్దరు కారు గుర్తుకే.. మొత్తం 10,46,114 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా ప్రతి ముగ్గురిలో ఇద్దరు కారు గుర్తుకే ఓటేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,71,810 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 2,10,524 ఓట్లు, బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డికి 1,86,343 ఓట్లు వచ్చాయి. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ కాగా, అప్పుడు కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే మెజార్టీని తిరిగి సాధించాలని టీఆర్ఎస్ పావులు కదిపింది. అయితే ఈ సారి 9.56 మేర పోలింగ్ శాతం తగ్గింది. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంతోనే పోలింగ్ శాతం తగ్గిందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. రైతు వ్యతిరేకత బలంగా ఉందని, తమకే మెజార్టీ ఓట్లు పడతాయని, టీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోతారని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. కేసీఆర్ వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అనే వాదనను తెరమీదకు చెప్పి భారీ ప్రచారం చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా మెదక్ ప్రజల తీర్పు మా పాలనకు రెఫరెండమే అని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో మెదక్ ఉప ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ప్రతిపక్షాల అంచనాలను మెదక్ జిల్లా ప్రజలు తలకిందులు చేశారు. త్రుటిలో తప్పింది... బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి ‘డిపాజిట్’ గండం నుంచి త్రుటిలో బయటపడ్డారు. అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాలంటే పోలయిన మొత్తం ఓట్లలో కనీసం 6 వంతు ఓట్లు రావాలి. ఉప ఎన్నికలో మొత్తం 10,46,114 ఓట్లు పోలయ్యాయి. ఆరో వంతు అంటే 1,74,353 ఓట్లు రావాలి. అనూహ్యంగా జగ్గారెడ్డికి 1,86,343 ఓట్లు రావటంతో డిపాజిట్ దక్కింది. జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక్కడ తనకు ఆధిక్యత వస్తుందని అంచనా వేశారు. అయితే సంగారెడ్డిలో 18,849 ఓట్లు వెనుకబడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీని సాంప్రదాయక ఓట్లు ఆదుకున్నాయి. డిపాజిట్ ఓట్ల కంటే సునీతారెడ్డికి 36,171 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సునీతారెడ్డి తన సొంత నియోజకవర్గం నర్సాపూర్ మీద ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి బాగా కలిసి వస్తుందని భావించారు. కానీ అక్కడ టీఆర్ఎస్కు 6,443 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్ఎస్కు 73,710 ఓట్లు రాగా, సునీతారెడ్డికి 67,267 ఓట్లు మాత్రమే వచ్చాయి. సత్తా చాటిన సిద్దిపేట సిద్దిపేట మునుపటి సత్తా చాటింది. కొత్త ప్రభాకర్‌రెడ్డికి తిరుగులేని ఆధిక్యతను తెచ్చిపెట్టింది. టీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు సిద్దిపేటనే టార్గెట్ చేశాయి. మరో వైపు మంత్రి హరీష్‌రావు సిద్దిపేటను పూర్తిగా తన కార్యకర్తలకు అప్పజెప్పి ఆయన సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ మీదనే దృష్టి సారించారు. అనుకున్నట్టుగానే సిద్దిపేట నియోజకవర్గంలో భారీగా పోలింగ్ తగ్గటంతో ప్రతిపక్ష నాయకులు తమ వ్యూహం ఫలించినట్టుగానే భావించారు. టీఆర్ఎస్ మెజారిటీకి గండి పడ్డట్లేనని అనుకున్నారు. కానీ ప్రజా తీర్పు వేరేలా ఉంది. ఇక్కడ మొత్తం 1,35,593 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 70 శాతం ఓట్లు అంటే 93,759 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. మూడు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో కూడా సిద్దిపేటలో టీఆర్ఎస్కు 70 శాతం ఓట్ల ఆధిక్యత రావటం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం... పోస్టల్ బ్యాలెట్లలోనూ టీఆర్ఎస్కు ఆధిక్యమే లభించింది. ఎన్నికల అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్లనే లెక్కించారు. మొత్తం 22 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా అందులో 10 టీఆర్ఎస్కు, 9 బీజేపీకి, ఒకటి కాంగ్రెస్‌కు దక్కాయి. రెండు ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. -
కాంగ్రెస్, బీజేపీలకు గట్టి ఝలక్కే ఇచ్చారు
మెదక్ : తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్లు గట్టి ఝలక్కే ఇచ్చారు. తాము ఇంకా కారు దిగి రాలేదని ఓటు ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి 2 లక్షల 10 వేల 523 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి లక్షా 86వేల 334 ఓట్లు పోలయ్యాయి. ఘోరంగా ఓటిపోయినా డిపాజిట్లు దక్కడంతో ఇద్దరు నేతలూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మెదక్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. 3 లక్షల 61 వేల 277 ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్కు మొత్తం 5లక్షల 71వేల 800 ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 లక్షల 97 వేల,029 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
మెదక్ లోక్ సభ టీఆర్ఎస్ కైవసం
మెదక్ : ఊహించినట్లే మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 3 లక్షల 61వేల 277 ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్కు మొత్తం 5 లక్షల 71వేల 800 ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ 3 లక్షల 97వేల,029 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించింది. అధికార పక్షాన్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ చేసిన ప్రయత్నాలను మెదక్ ప్రజలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్కే మళ్లీ పట్టం కట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ లోక్‌సభకు ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ రెండు పార్టీలు డిపాజిట్లు దక్కించుకోగలిగాయి. -
ఈ విజయం ఊహించినదే : ప్రభాకర్ రెడ్డి
మెదక్ : మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఊహించిందేనని ఆపార్టీ లోక్ సభ అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గినా టీఆర్ఎస్కు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. -
కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయం
టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవాజ్‌రెడ్డి మునిపల్లి: మెదక్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి సునాయసంగా గెలుస్తారని టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం నవాజ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎన్నిక ప్రశాంతంగా జరగడంతో మండలంలోని తాటిపల్లి గ్రామంలో ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవాజ్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీయే తమ లక్ష్యమన్నారు. సిద్దిపేటలో లక్ష ఓట్లకు పైగా, మిగతా నియోజకవర్గాల్లో 50 వేలకు పైగా టీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ రానున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఖరి తెలంగాణ ప్రజలకు తెలిసినందునే టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ కొల్లూరి రవి, యూవత మండల ప్రధాన కార్యదర్శి గుంతలి నర్సింలు, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చాకలి రవి, తెనుగు సంగ్రాంతో పాటు పలవురు పాల్గొన్నారు. -
మెదక్ ఎంపీ ఉప పోరు నేడే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే పోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. సిద్దిపేట, దుబ్బాక, పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కలిపి మొత్తం 1,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 15,43,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన మూడు నెలలకే వచ్చిన తొలి ఎన్నికలు. పైగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా రాజీనామా చేయగా ఏర్పడిన ఖాళీ.. కనుక అన్ని ప్రధాన పార్టీలు ఉప పోరును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి తూర్పు జగ్గారెడ్డిలు పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరో 11 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం ఏకపక్షంగా ఉంటుం దని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ మెజారిటీపైనే... ఉప పోరుపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. అయితే ఈ బెట్టింగ్ గెలుపు ఓటమిలపై కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది? రెండవ స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? మిగిలిన పార్టీలకు డిపాజిట్ వస్తుందా? రాదా? అనే దానిపైనే పందేలు కాస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మూడు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని భారీగా పందెం కాస్తున్నారు. కాగా ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే అప్పుడు 79 శాతం పోలింగ్ నమోదు కావటంతో అంత మెజార్టీ వచ్చింది. ఈ సారి 65 శాతం మించి పోలింగ్ నమోదు కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు ఉప ఎన్నిక కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించారని, భారీగా చేరికలు జరిగాయని, ప్రతి ఓటరు కూడా కారు గుర్తు వైపుకే మొగ్గు చూపే విధంగా ప్రచారం చేసి, పావులు కదిపారని, కనుక మెజార్టీ 3 లక్షలకు దాటిపోతుందని పందెం కడుతున్నారు. పందెం విలువ రూ. 1000 నుంచి లక్షల్లో కొనసాగుతోంది. -
ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతే
సంగారెడ్డి రూరల్ : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిదే విజయమని, ప్రత్యర్థుల డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. సంగారెడ్డి మండలం చిమ్నాపూర్, కంది గ్రామాలలో శుక్రవారం రాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు. ప్రజల్లో టీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం తమ ప్రభుత్వం రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల వ్యవసాయ భూమి, సామాజిక పెన్షన్ల పెంపునకు కట్టుబడి ఉందని వెల్లడించారు. సమగ్ర సర్వేకు ప్రజలకు ఇబ్బం దులు వస్తాయంటూ ప్రత్యర్థి పార్టీల నాయకుల దు ష్ర్పచారాన్ని నమ్మవద్దని కోరారు. అర్హులైన వారంద రి కీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకే సమగ్ర సర్వే నిర్వహించినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కోసం రూ. లక్ష కోట్లతో బడ్డెట్‌ను రూపొం దిస్తున్నట్లు వివరించారు. సంగారెడ్డిలో వందపడకల ఆస్పత్రిని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి ఓటేస్తే అది వృధా అవుతుందన్నారు. అనంతరం చిమ్నాపూర్‌కు చెందిన పలువురు ఆయా పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ప్రచార కార్యక్రమంలో వర్ధన్న పేట ఎమ్మెల్యే రమేష్ , సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీటీసి మనోహర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రామ్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు నరహరి రెడ్డి, నందకిషోర్, ఖాజాఖాన్, ఎంపీటీసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
జగ్గారెడ్డి, ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు దాఖలు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేయడానికి చివరి రోజైన బుధవారం ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ విప్ జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జగ్గారెడ్డి ఇదే రోజు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ మద్దతుతో బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. -
భగ్గుమన్న విభేదాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 24న జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలోనే టీడీపీలో గ్రూపు తగాదాలు బట్టబయలయ్యాయి. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మధ్య దూషణల పర్వం చోటు చేసుకుంది. ప్రభాకర చౌదరి ఏర్పాటు చేసిన సమావేశం జేసీ ప్రభాకరరెడ్డి వీరంగంతో విచ్ఛిన్నమయ్యింది. ఇప్పటికే గ్రూపులుగా విడిపోయిన టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు రాబోయే రోజుల్లో తారస్థాయికి చేరనుందనేందుకు ఈ సంఘటన సంకేతంగా నిలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ైవైఎస్సార్సీపీలో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ మాసూంబాబాలను అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వారి చేరిక కోసం మంగళవారం స్థానిక లలిత కళాపరిషత్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. రషీద్ అహ్మద్, మాసూంబాబా గత ఎన్నికల్లో జేసీ దివాకరరెడ్డిని ఓడించేందుకు చురుగ్గా పనిచేశారని, జేసీ వ్యతిరేకులను అనంతపురం ఎమ్మెల్యే పనిగట్టుకుని టీడీపీలోకి తీసుకొస్తున్నారన్న సమాచారంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మందీ మార్బలంతో అక్కడికి చేరుకున్నారు. ‘మా అన్న (జేసీ దివాకరరెడ్డి) అనంతపురం పార్లమెంటు సభ్యుడు. ఈ పార్లమెంటు పరిధిలో కొత్త వ్యక్తులను పార్టీలోకి చేర్చుకునే ముందు మాకు మాటమాత్రమైనా చెప్పాల్సిన అవసరం లేదా? అంతా నీ ఇష్టమేనా? వారిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటావో చూస్తా. అసలు వారిని పార్టీలోకి చేర్చుకునే అధికారం నీకెవరిచ్చారు?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రభాకర చౌదరిని నిలదీశారు. అదే సమయంలో పార్టీలోకి చేరడానికి వచ్చిన రషీద్ అహ్మద్, మాసూంబాబాలను బూతులు తిట్టారు. ‘ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా చేయాల్సిందల్లా చేసి ఇప్పుడు పార్టీలో చేరతారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లకపోతే మీ సంగతి చూస్తాన’ంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీంతో ఆ ఇద్దరు మైనార్టీ నాయకులు మెల్లగా జారుకున్నారు. అనంతపురం నియోజకవర్గంలో.. మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ వర్గాలపై దర్పం ప్రదర్శించే ప్రభాకర చౌదరి చివరకు మౌనంగా ఉండిపోయారు. ఈ లోపు జేసీ అనుచరులు సమావేశంలో ఉన్న కుర్చీలు విసిరేయడం.. ఫ్లెక్సీలు చించేయడం లాంటి పనులు కానిచ్చేశారు. ‘పార్లమెంటు పరిధిలో మాకు తెలియకుండా ఎవరైనా ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఖబడ్దార్’ అంటూ ప్రభాకర రెడ్డి అక్కడి నుంచి నిష్ర్కమించారు. తర్వాత ప్రభాకర చౌదరి విలేకరులతో మాట్లాడుతూ సమస్యను అధినేత చంద్రబాబుకు వివరించి ఆయన అనుమతితో మైనార్టీనేతలను పార్టీలో చేర్చుకుంటామని క్లుప్తంగా మాట్లాడి వెళ్లిపోయారు. పట్టు కోసమే... సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన జేసీ సోదరులు తాడిపత్రి అసెంబ్లీతో పాటు అనంతపురం పార్లమెంటు సీటు కూడా గెలుచుకున్నారు. ఇవిగాక జిల్లాలో మరో మూడు.. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ వర్గీయుల గెలుపునకు దోహదపడ్డారు. ఈ కారణంగానే జిల్లాలో టీడీపీ అత్యధికంగా 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగల్గిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇంత చేసినా జిల్లాలో తమకు చంద్రబాబు సముచిత స్థానం ఇవ్వలేదన్న భావన జేసీ వర్గీయుల్లో ఉంది. తమ ప్రాబల్యమున్న అనంతపురం పార్లమెంటు పరిధినే అధినేత పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. రెండు మంత్రి పదవులూ హిందూపురం పార్లమెంటు పరిధిలోని పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలకే ఇచ్చారు. మరోవైపు అధినేత చంద్రబాబు బావమరిది బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చంద్రబాబు రెండు రోజుల జిల్లా పర్యటన కూడా హిందూపురం పార్లమెంటు పరిధిలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకే పరిమితం చేయడం గమనార్హం. కనీసం అనంతపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనైనా తాము పట్టు సాధించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందన్న భావన జేసీ వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర చౌదరిని కట్టడి చేయడంపై జేసీ వర్గం దృష్టి కేంద్రీకరించిందని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో తొలి నుంచీ జేసీకి ప్రభాకర చౌదరి ప్రత్యర్థే. ఇటీవలి కాలంలో ప్రభాకర చౌదరి తన పార్టీకే చెందిన నగర మేయర్ స్వరూపకు పలు అడ్డంకులు కలగజేస్తున్నారు. వాస్తవానికి స్వరూప నగర మేయర్ కావడానికి జేసీ సోదరుల ఆశీస్సులు కూడా ఉన్నాయి. మేయర్ స్థానాన్ని అస్థిరపరిచే విధంగా కార్పొరేషన్ వ్యవహారాల్లో ఎమ్మెల్యే జోక్యం ఎక్కువవుతోందన్న విమర్శలూ ఉన్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యే కార్యకలాపాలను కట్టడి చేయకపోతే.. భవిష్యత్‌లో అనంతపురం పార్లమెంటు పరిధిలో తమ పట్టు చేజారిపోయే ప్రమాదముం దని భావించే జేసీ ప్రభాకర రెడ్డి మంగళవారం ఈ చర్యకు ఉపక్రమించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ‘ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పని చేసినవారిని పార్టీలో చేర్చుకోకూడదంటున్న జేసీ సోదరులు కూడా నిన్న మొన్నటి దాకా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారే కదా..’ అని సంప్రదాయక టీడీపీ వర్గాలు లేవనెత్తుతున్న తర్కానికి సమాధానం... ఆధిపత్య పోరులో తర్కానికి తావుండదనే. జిల్లా తెలుగుదేశం పార్టీ.. పరిటాల, జేసీ వర్గాలుగా విడిపోయిన సందర్భంలో మంగళవారం నాటి సంఘటన ఇప్పటికే ఉన్న గ్రూపుల పునరేకీకరణకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
గో టూ..కుప్పం!
4 మండలాలకు నలుగురు ఆర్డీవోస్థాయిఅధికారుల నియామకం కుప్పం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్దేశం 28 లోపు సమగ్ర నివేదికకు ఆదేశం ఖాళీ పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు ఒక్క నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించడంపై విమర్శలు ‘ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపిరికట్టెది మరో దారి’ అంటే ఇదే. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల పరిస్థితి ఒక విధంగా ఉంటే కుప్పం మాత్రం ప్రత్యేకం. 66 మండలాలున్న జిల్లాలో ముగ్గురు ఆర్డీవోలు ఉంటే కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ప్రత్యేకాధికారులుగా నలుగురు ఆర్డీవో స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ తీరుపై ఇటు ఉద్యోగుల్లో, అటు ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, చిత్తూరు: కుప్పం నియోజవర్గంలోని రామకుప్పం, గుడుపల్లె, కుప్పం, శాంతిపురం మండలాలకు ప్రత్యేకాధికారులుగా మైనారిటీ వెల్ఫేర్ డీడీ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామారావు, సివిల్ సప్లయిస్ విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్లు సత్తిబాబు, విశ్వనాథలను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. శనివారం ఉదయమే ఆయా మండలాలకు వెళ్లి అధికారులతో సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆదేశించినట్లు తెలిసింది. నలుగురు అధికారులు తమ సొంత శాఖల పనులను పక్కనబెట్టి హుటాహుటిన శనివారం ఉదయం కుప్పం నియోజకవర్గానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా.. మండలాల్లోని ఉద్యోగులను సమన్వయపరచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేసే బాధ్యతను ప్రభుత్వం వీరికి అప్పగించింది. ముఖ్యంగా రెస్కో(రూరల్ ఎలక్ట్రికల్ కో-ఆపరేటివ్ సొసైటీ), పంచాయతీరాజ్, హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్, ఇళ్లు కేటాయించాలని, విద్యుత్ కనెక్షన్ ప్రతి ఇంటికీ ఉండేలా చూడాలని సూచించారు. ఈ పథకాలన్నిటికీ ‘ఆధార్’తో అనుసంధానం తప్పనిసరి అని కూడా అధికారులు చెప్పారు. వేర్వేరుగా ఓ ప్రణాళికను రూపొందించి ఈనెల 28వ తేదీలోపు అందించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. వెనుకబడిన నియోజకవర్గాల పరిస్థితేంటి బాబు.. కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు 9 ఏళ్లపాటు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మొత్తం మీద పాతికేళ్లుగా నిరాటంకంగా కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. జిల్లా మొత్తం మీదనిరక్షరాస్యత అధికంగా ఉండేది కుప్పం ప్రాంతంలో అంటే అతిశయోక్తి కాదు. చదువు, ఉపాధి లేక అక్కడి వారు పనికోసం వలస వెళుతుంటారు. కుప్పం నుంచి రోజుకు పదివేల మంది కూలీలు కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి ఉదయం రైల్లో వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కుప్పం నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైందో. ఈ క్రమంలో సీఎం కుర్చీ అధిరోహించిన బాబు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఉపక్రమించారు. అయితే కుప్పంలాగే సత్యవేడు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాలు కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. పైగా ఇందులో మొదటి మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. వీటి అభివృద్ధిని విస్మరించి కుప్పం ప్రాంతానికి మాత్రమే నలుగురు ప్రత్యేకాధికారులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పానికి మాత్రమే సీఎం అన్నట్లు చంద్రబాబు వ్యవహరించ డం తగదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కుప్పంలో ఖాళీలనూ పూరించాల్సిందే కుప్పం నియోజకవర్గంలో ఉపాధ్యాయ, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అవసరమైతే జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బలవంతంగానైనా అధికారులను కుప్పానికి బదిలీ చేయాలని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అధికారుల ఇష్టాలతో పనిలేకుండా ‘గో..టు కుప్పం’ అని ఆర్డర్ కాపీ చేతిలో పెట్టేందుకు సిద్ధమైంది. అభివృద్ధి కోసమే ప్రత్యేకాధికారుల నియామకం కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించాం. అధికారులను సమన్వయపరచి అభివృద్ధిని వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మా నిర్ణయమే. ప్రభుత్వ నిర్ణయం. -శ్రీధర్, జాయింట్ కలెక్టర్, చిత్తూరు. -
50 తండాలకు పంచాయతీ హోదా
తూప్రాన్ : జనాభా ప్రాతిపదిక సుమారు 500 మంది ఉన్న తండాలకు పంచాయతీలుగా హోదా కల్పిస్తున్నట్లు డీపీఓ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన తూప్రాన్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు ఇంటింటి సర్వే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 500 జనాభా కలిగిన గిరిజన తండాలను గుర్తించడం జరిగింది. జిల్లాలో మొత్తం 463 గిరిజన తండాలు ఉండగా అందులో 500 మందికి పైబడి జనాభా ఉన్న గ్రామాలు 50 ఉన్నాయన్నారు. త్వరలోనే ఈ తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వివరించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 182 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను త్వరలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు : జిల్లాలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలుపొందిన ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ప్రజా ప్రతినిధులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డీపీఓ వివరించారు. వివిధ కార్యక్రమాల్లో వారు అనుసరించాల్సిన పద్ధతులు, చర్యలపై ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. త్వరలో తేదీని ఖరారు చేస్తామన్నారు. నోటీసులు జారీ చేశాం : రూ. 1.10 లక్షల అవినీతికి పాల్పడిన మండలంలోని మనోహరాబాద్ సర్పంచ్ సంతోషకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు డీపీఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆమెకు చెక్ పవర్‌ను రద్దు చేశామని, అయితే పంచాయతీ ఉద్యోగుల వేతనాలను దృష్టిలో ఉంచుకుని ఈఓపీఆర్డీ రాఘవరావు, సర్పంచ్ జాయింట్ అకౌంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పింఛన్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోహరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీదేవిపై విచారణ కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ చిట్టిమిళ్ల శివ్వమ్మ, పంచాయతీ ఈఓ ైెహ మద్ అలీ, ఆర్డబ్ల్యూ ఏఈఈ రాజ్యలక్ష్మి, వార్డు సభ్యులు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 21 నుంచి పారిశుద్ధ్య వారోత్సవాలు సంగారెడ్డి అర్బన్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 21వ తేదీ నుంచి 26 వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విశ్వాసమే రక్షిస్తుంది
అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్‌కుమార్ గుడివాడ : ఏసుక్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని, ఆయనపట్ల విశ్వాసమే మానవులను సర్వదా రక్షిస్తుందని ప్రపంచ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ స్పష్టంచేశారు. బుధవారం స్థానిక పెదఎరుకపాడులో పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి నూతనంగా నిర్మించిన న్యూలైఫ్ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన సభలో సువార్త ఉపన్యాసం చేశారు. వేల సంఖ్యలో హాజరైన క్రైస్తవ విశ్వాసులనుద్దేశించి మాట్లాడుతూ మానవులు చేసిన పాపాలకు ఆయన మూల్యం చెల్లించాడని అందుకే క్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని అన్నారు. క్రీస్తు మహిమలు ద్వారా గుడివాడ పట్టణం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ప్రార్థనలు చేశారు. ప్రపంచ సువార్తికుడుగా దేవుడు తనకి ప్రసాదించిన శక్తితో తాను ఈ మాటలు చెప్పగలుగుతున్నానని అన్నారు. ప్రభువునందు విశ్వాసం,కృప వల్ల ప్రతి ఒక్కరూ రక్షించబడతారని చెప్పారు. పాటలతో ఉర్రూతలూరించిన అనిల్‌కుమార్... బ్రదర్ అనిల్‌కుమార్ నూతనంగా రూపకల్పన చేసిన పాటల సీడీలోని కొత్తపాటలు పాడి కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఉర్రూతలూగించారు. ‘నిబ్బరంకలిగి ధైర్యంగా ఉండు..’ అంటూ పాడిన పాట అందరిలో ఉత్సాహాన్ని నింపింది. బ్రదర్ అనిల్‌కుమార్ సందేశాన్ని ప్రముఖ సువార్తికుడు సజ్జా బర్నబాస్ తెలుగులోకి అనువదించారు. న్యూలైఫ్ ప్రార్ధనా మందిరం పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి, బిల్లిపల్లి ఇజ్రాయోల్రెడ్డి పాల్గొనగా అనీల్ వరల్డ్ ఇవాంజలిజం(ఎడబ్ల్యూఈ) రాష్ట్ర కోఆర్డినేటర్ శామ్యూల్ తొలుత అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, మండలి హనుమంతరావు, పాలేటి చంటి, పాస్టర్లు అప్పికట్ల జాషువా, క్రీస్తురాయబారి, సజ్జా బర్నబాస్, టిజె దాస్, భాస్కరరావు, కరుణాసాగర్, జడా జానన్న, నేలపాటి శామ్యూల్ పాల్గొన్నారు. ప్రేయర్ పాస్టర్ ఫెలోషిప్ ఘనసన్మానం... బ్రదర్ అనిల్‌కుమార్‌ను గుడివాడ డివిజన్ ప్రేయర్ పాస్టర్స్ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫెలోషిప్ గుడివాడ డివిజన్ అధ్యక్షులు జి.శ్యాంబాబు, సునీల్‌రెడ్డి, బి.మోషే, డివివి.ప్రసాద్, సంఘ కాపరులు ఆమెన్, పరిశుద్ధ భూషణం, సునీల్, ఎలీషా పాల్గొన్నారు. -
ఖరీఫ్ కష్టాలు
ఖమ్మం వ్యవసాయం : ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుండటంతో రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ ముందుగా నిర్దేశించిన విధంగా విత్తనాలు అందుబాటులో లేవు. పత్తి, మొక్కజొన్న సీడ్స్ ప్రైవేట్ కంపెనీలు విక్రయిస్తున్నప్పటికీ.. వరి, జీలుగు, పిల్లిపెసర, పెసర, జనుము, మినుము, కంది తదితర విత్తనాలు ఏపీ సీడ్స్ ద్వారానే సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాలో పత్తి, వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం సుమారు 1.80 లక్షల హెక్టార్లు కాగా, వరి సుమారు 1.37 లక్షల హెక్టార్లు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం వరి విత్తనాలు సుమారు 24 వేల క్వింటాళ్లు అవసరం కాగా, ప్రస్తుతం ఏపీ సీడ్స్ వద్ద 7,420 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. బీపీటీ 5204 రకం 12,500 క్వింటాళ్లకు గాను 4 వేల క్వింటాళ్లు, ఎంటీయూ-1001 రకం 6 వేల క్వింటాళ్లకు గాను, 200 క్వింటాళ్లు, ఎంటీయూ -1061 రకం 2,500 క్వింటాళ్లకు గాను 220 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎంటీయూ -1010 రకం మాత్రం 3 వేల క్వింటాళ్లకు మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ఇక భూసారాన్ని పెంచే జీలుగు, పిల్లిపెసర, జనుము వంటి విత్తనాలకూ కొరతే ఉంది. వీటిని పూర్తిస్థాయిలో తెప్పించడంలో ఏపీ సీడ్స్ విఫలమైందని రైతులు అంటున్నారు. జీలుగు విత్తనాలు 10 వేల క్వింటాళ్ల సరఫరా లక్ష్యం కాగా, సహకార సంఘాలకు 5 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. పిల్లిపెసర 4 వేల క్వింటాళ్లకు 1000 క్వింటాళ్లు అందుబాటులోఉన్నాయి. జనుము 300 క్వింటాళ్లు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ కోరగా, ఇంత వరకు వాటి జాడే లేదు. పెసర 295, 460 రకం విత్తనాలు రెండూ కలిపి 500 క్వింటాళ్లు కావాలని కోరగా ప్రస్తుతం 200 క్వింటాళ్లు మాత్రమే సిద్ధంగా ఉంచారు. మినుము, కంది వంటి విత్తనాలకు ఇంకా మోక్షమే లేదు. భూసారం పెరిగేదెలా..? మాగాణి భూముల్లో భూసారాన్ని పెంచేందుకు వరి సాగుకు ముందు తొలకరి వర్షాలు కురియగానే జీలుగు, పిల్లిపెసర, జనుము, పెసర విత్తనాలు వేస్తారు. 45 రోజుల తర్వాత ఈ పంటలను దున్ని వరి సాగు చేస్తారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఈ విత్తనాలు పూర్తి స్థాయిలో అందలేదు. దీంతో భూసారం పెరగడం కష్టమేనని రైతులు వాపోతున్నారు. జీలుగు, పిల్లిపెసర విత్తనాలను 50 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. వీటితోనైనా భూసారం పెంచుకోవచ్చని భావించిన రైతులకు అక్కడా నిరాశే ఎదురైంది. ఈ విత్తనాలను సైతం పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. ఇక వరి విత్తనాలైనా పూర్తిస్థాయిలో అందిస్తారో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. విత్తనాల ధరలు ఇలా.. వరి విత్తనాలను నిర్ణీత ధరపై కిలోకు రూ.5 చొప్పున సబ్సిడీపై అందజేయాలని నిర్ణయించారు. బీపీటీ-5204 రకం కిలో రూ.27.50 కాగా, రూ.22.50 చొప్పున, ఎంటీయూ-1001 రకం ధర రూ.25 కాగా, రూ.20కి, ఎంటీయూ -1010 రకం ధర రూ.24.60 కాగా, రూ.19.60కి, ఎంటీయూ-1061 ధర రూ.26.20 కాగా, వీటిని రూ.21.20కి రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. జీలుగు కిలో రూ.30.86 కాగా, వీటిని 50 శాతం సబ్సిడీపై రూ.15.43 చొప్పున, పిల్లిపెసర కిలో రూ.57.96 కాగా, రూ.28.98 పైసలకు, జనుములు రూ.41.76 కాగా, రూ.20.88కి అమ్మాలని నిర్ణయించారు. పెసర కిలోకు రూ.88 కాగా, వీటికి రూ.29.25 పైసలు, మినుములు రూ.74 కాగా, రూ.24.50, కందులు రూ.59 కాగా, రూ.19.50 సబ్సిడీ ఇచ్చి విక్రయించాల్సి ఉంది. అయితే ఆ విత్తనాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో అధిక ధర వెచ్చించి ప్రైవేటు డీలర్ల వద్ద కొనక తప్పేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు సరఫరా చేస్తాం : ఏపీ సీడ్స్ మేనేజర్ రైతులకు అవసరమైన విత్తనాలను సకాలంలో సరఫరా చేస్తామని ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వరి విత్తనాలు వరంగల్, కరీంనగర్, తణుకు, నిడమనూరు వంటి ప్రాంతాల నుంచి రావాల్సి ఉందని చెప్పారు. జీలుగులు ఢిల్లీ నుంచి, పిల్లిపెసర, పెసర, జనుము, మినుము, కంది విత్తనాలు గుంటూరు నుంచి రావాల్సి ఉందన్నారు. గోడౌన్లలో సిద్ధంగా ఉన్న వరి విత్తనాలను ఒకటి, రెండు రోజుల్లో సహకార సంఘాలకు సరఫరా చేస్తామన్నారు. -
‘ఉపాధి’లో అక్రమాలు
నవాబుపేట, న్యూస్‌లైన్: మండలంలో 2013 మార్చి నుంచి 2014 మార్చి వరకు పలు గ్రామాల్లో చేపట్టిన (పూడికతీత, రాతి కట్టలు తదితర పనులు) ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. రూ.3.5 కోట్ల పనులు, పింఛన్లపై వారం రోజులుగా సామాజిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో వెల్లడైన అంశాలపై బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మండల స్థాయి సమావేశం (ప్రజా వేదిక) నిర్వహించారు. ఈ సందర్బంగా తనిఖీ బృందాలు గ్రామాల్లో నిర్వహించిన రికార్డులను సమావేశంలో చదివి వినింపించారు. మండలంలోని అక్నాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్, సీఎస్పీలను తొలగించాలని గ్రామస్తులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీఎస్పీలు డబ్బులు వచ్చినప్పటికీ సకాలంలో ఇవ్వడం లేదని కూలీలు సామాజిక తనిఖీ బృందానికి ఫిర్యాదు చేశారు. చాలా గ్రామాల్లో మస్టర్, పే ఆర్డర్, ఎంబీలలో ఏపీవో, టీఏల సంతకాలు లేవని తనిఖీ బృందం సభ దృష్టికి తీసుకువచ్చింది. యావాపూర్ ఫీల్డ్ అసిస్టెంటును తొలగించాని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాదిరెడ్డిపల్లిలో రూ.1400, అక్నాపూర్‌లో రూ.500, లింగంపల్లిలో రూ.700, కేశపల్లిలో రూ. 500, ఆర్కతలలో రూ.1150, ఇలా అన్ని గ్రామాల్లో మొత్తం రూ.9,775 అవినీతి జరిగినట్లు గుర్తించారు. అవినీతికి బాధ్యులైన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల వద్ద రికవరీ చేయాలని ఉపాధి హామీ జిల్లా ఫైనాన్స్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్రమాలు జరిగిన గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూలీల డబ్బులు కాజేసిన పూలపల్లి సీఎస్పీ సబిత, మమ్మదాన్‌పల్లి సీఎస్పీ పల్లవిలను విధుల నుంచి తొలగించారు. ఉపాధి హామీలో అక్రమాలకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని జిల్లా విజిలెన్స్ అధికారి గుప్తా హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీవో లక్ష్మీదేవి, ఉష, ఆయా గ్రామాల సర్పంచులు, తనిఖీ బృందం సభ్యులు, కూలీలు పాల్గొన్నారు.