బస్డాండ్ ఎదుట బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపుచేస్తున్న పోలీసులు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో శుక్రవారం మంత్రుల పర్యటన సందర్భంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారం రోజులుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి అనుచరగణంతో నియోజకవర్గానికి రావడం, బీజేపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని పోటాపోటీ నినాదాలు, తోపులాటతో పరిస్థితి వేడెక్కింది.
దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హబ్సీపూర్‌లో గోదాముల ప్రారంభోత్సవం సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కా సేపు తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు ఇబ్బందికి గురయ్యారు. దీంతో మంత్రి హరీశ్‌రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి మంత్రుల బృందం దుబ్బాక బస్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లింది.
అప్పటికే అక్కడ మోహరించిన బీజేపీ నాయకులు మరో సారి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయి తే అధికారిక కార్యక్రమంలో ఎవరూ నినాదాలు చేయొద్దని ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ కార్యకర్తలకు నచ్చజేప్పే ప్రయ త్నం చేసినా వారు వినలేదు. బారికేడ్లను పక్కకు నెట్టేసి కార్యక్రమ ప్రాంగణంలోకి చొచ్చు కొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఉద్రిక్తతల మధ్య మంత్రులు దుబ్బాకలో కొత్తగా నిర్మించిన బస్టాండ్, కొత్త బస్సులను ప్రారంభించారు. ఆపై మంత్రులు అక్కడి నుంచి వెళ్లడంతో బీజేపీ శ్రేణులు సైతం వెళ్లిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment