నీట్‌పై కేంద్రాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేస్తున్నాయి
బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం
‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో చోటుచేసుకున్న కుంభకోణాలపై విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాక తప్పదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివిధ కేసుల్లో అన్ని వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్.. ఇలా వివిధ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అందరూ కేసీఆర్ పేరే చెబుతున్నా రన్నారు. రాబోయేరోజుల్లో బీఆర్‌ఎస్‌కు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం (సీఆర్‌ఎస్) ఖాయమన్నారు. టైటానిక్‌షిప్ మాదిరిగా బీఆర్‌ఎస్ నావ మునిగి పోతుందని అన్నారు. బీజేపీలోకి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, అలాగే నక్సలైట్లు, మరెవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.
శనివారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రఘునందన్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే తాను క్షీరసాగర్ నుంచే పని మొదలుపెడతానని, దళితుల భూములను తిరిగి వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మీడియా ప్రతి నిధులు అడిగిన వివిధ ప్రశ్నలకు రఘునందన్‌రావు సమాధానాలిస్తూ.. నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర విభాగానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారంపై స్పందిస్తూ.. ‘ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తా. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారు’అని అన్నారు. జర్నలిస్ట్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధానకార్యదర్శి బింగిస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment