మెదక్: త్వరలో రూ.లక్షకుపైగా ఉన్న రైతు రుణాలను సైతం మాఫీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో విలేకరులతో మాట్లాడు తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు రూ.99,999వరకు రుణాలన్నీ మాఫీ అయ్యాయని అన్నారు. బ్యాంకు అకౌంట్లు వినియోగంలో లేకపోవడంతో కొంతమందికి ఇబ్బంది అవుతున్నట్లు తెలిసిందన్నారు.
ఆర్థిక, వ్యవసాయ శాఖల కార్యదర్శులతో మాట్లాడి సమస్య పరిష్కార మయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని, ఆ రెండు పార్టీలకు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పు డు అభ్యర్థుల దరఖాస్తులు అమ్ముతోందని, ఆ పార్టీ అధికా రంలోకి వస్తే రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందని అన్నారు.
కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 35 –40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీ ఆరాటపడుతోందన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా గతంలోకంటే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఇంటి ముందు అభివృది్థ.. కంటి ముందు అభ్యర్థి నినాదంతో ముందుకు పోతామని ఆయన తెలిపారు. హరీశ్ వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment