పర్చూరు: పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు తప్పించుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్చూరుకు చెందిన ప్రభాకరశర్మ రైతుల నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసి, రూ. 2 కోట్ల మేర బాకీ పడ్డాడు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అతడిని స్టేషన్లో ఉంచారు. గురువారం వేకువజామున ప్రభాకరశర్మ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.