'తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు' | Munugode MLA Prabhakar Reddy takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు'

Published Thu, May 29 2014 1:03 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

Munugode MLA Prabhakar Reddy takes on Chandrababu Naidu

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నల్గొండలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించిన ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకునేలా చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు.

 

హైదరాబాద్లో గండిపేటలో నిన్న మొన్న జరిగిన మహానాడులో రెండు ప్రాంతాలు తనకు సమానమని అన్నారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ప్రభాకర్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని హెచ్చరించారు.



పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపుతూ రాష్ట్రపతి బుధవారం ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ను తెలంగాణలో అధికారాన్ని చేపట్టనున్న టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement