టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి : కూసుకుంట్ల | TRS party Development : kusukuntla | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి : కూసుకుంట్ల

Published Wed, Apr 16 2014 4:24 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

TRS party Development : kusukuntla

మర్రిగూడ, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అజలాపురం, తమ్మడపల్లి, తిరుగళ్లపల్లి, మర్రిగూడ గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అజలాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పలువురు ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో దోనూరు వెంకట్‌బాబు, రామిడి వెంకటరమణారెడ్డి, అజలాపురం పుల్లయ్య, సామ జగన్ మోన్‌రెడ్డి, రామిడి వెంకట్‌రెడ్డి, ఎడ్లకొండ శ్రీశైలం, మల్లేశం, పద్మయ్య, సత్తయ్య, నర్సింహ, వెంకటయ్య, బిచ్చానాయక్, రాములు తదితరులున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు బంటు జగదీశ్వర్, బచ్చు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
 మునుగోడులో టీఆర్‌ఎస్‌లో చేరిక
 టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూసుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గూడపూర్ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 100మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం సత్యం, పెరమాండ్ల లక్ష్మయ్య, దర్శనం విజయ్, మేడి అశోక్, వంటపాక వెంకన్న, దండు యాదయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement