
మీకు పల్లీలంటే ఇష్టమేనా? ఊరికే ఇష్టమని తల ఊపడం కాదు... నిమిషానికి ఎన్ని పల్లీలు ఒలవగలరో చెప్పండి. పల్లీలంటే వీజీనే ఒలవడం. అదే వాల్నట్సయితే..? పల్లీలకంటే ఎక్కువరుచిగా ఉంటాయి కాబట్టి, ఇంకాసిని ఎక్కువే లాగించగలరు. ఆగండాగండి... వొలిచి పెట్టిన వాల్నట్స్ కాదు... వొలుచుకుని తినాల్సొస్తే..? ఎన్ని వలుస్తారు? ఈ వొలుపుడు సంగతిఇప్పుడెందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం... వాల్‌నట్స్ అంటే తెలుసు కదా... అదేనండీ, ఆక్రోటు కాయలు. వేరుసెనక్కాయల మాదిరిగా కాదు... వాటి పై పెంకు బాగా గట్టిగా ఉంటుంది.పగల గొట్టడం మామూలు విషయం కాదు. అలాంటిది ఒక్క నిమిషంలో 212 వాల్‌నట్స్‌ను పగలగొట్టి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. ప్రభాకర్ రెడ్డి అనే 35సంవత్సరాల మార్షల్ ఆర్ట్స్ మొనగాడు.
ఇతను బారులుగా పోసిన వాల్నట్స్‌ను పటాపటా పగలగొట్టేసి అంతకుముందు పాకిస్తాన్‌కు చెందిన మహమ్మద్ రషీద్ అనే వ్యక్తి సృష్టించినరికార్డును బద్దలుగొట్టాడు. అన్నట్టు మన ప్రభాకర్ రెడ్డి ఇలా వాల్‌నట్స్‌ను పగలగొట్టడం 2010 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇతను వాల్‌నట్స్‌పై వీర విహారం చేసిన వీడియోను ఇప్పటికి కొన్ని లక్షలమంది ఆసక్తిగా చూశారట. బాగుంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment