
అందమైన ప్రేమ చిత్రం
దేశాన్ని పట్టి పీడిస్తున్న ఓ సామాజిక సమస్య కథాంశంగా రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా స్వీయదర్శకత్వంలో ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేమ్ జె. ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. దర్శక-నిర్మాత జె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.
‘బాహుబలి’ చిత్రానికి రచయితగా పని చేసిన అజయ్ కథా, కథనాలు ఈ చిత్రానికి ఓ హైలైట్. ఓ వాణిజ్య చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఇందులో ఉన్నాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సహ-నిర్మాత: కొడాలి సుబ్బారావు, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్.