జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీల భేటీ | TRS MPs Met Union Minister JP Nadda | Sakshi
Sakshi News home page

జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీల భేటీ

Published Fri, Jan 6 2017 12:48 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

TRS MPs Met Union Minister JP Nadda

ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీలు వినోద్‌కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఆయనను కలిశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర,  ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు కూడా ఉపయోగం ఉంటుందని చెప్పారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న ఆ మూడు రాష్ర్టాల్లోని వెనకబడిన జిల్లాలకు వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి హామి ఇచ్చినట్లు ఎంపీలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement