కామెడీ ఎంటర్ టైనర్‌గా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ | Teliyadu, Gurtuledu, Marchipoya Movie Launch With Pooja Ceremony | Sakshi
Sakshi News home page

కామెడీ ఎంటర్ టైనర్‌గా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’

Published Thu, Nov 14 2024 5:44 PM | Last Updated on Thu, Nov 14 2024 5:50 PM

Teliyadu, Gurtuledu, Marchipoya Movie Launch With Pooja Ceremony

నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు  రఘుబాబు  క్లాప్ నివ్వగా,  సంగీత  దర్శకులు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ - మంచి కథ, కథనాలతో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఈ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్లనే పర్పెక్ట్ గా కాస్టింగ్ చేశారు. నిర్మాత శరత్ చెన్నా గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఎంతో ప్యాషన్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ ఈ మూవీని అనేక ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఎంటర్ టైనింగ్ గా రూపొందిస్తున్నాడు. కొత్త హీరో నివాస్, హీరోయిన్ అమిత శ్రీకి నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.

దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. మాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న మా ప్రొడ్యూసర్ శరత్ గారికి, పృథ్వీ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మేమంతా అజయ్ పట్నాయక్ గారి టీమ్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంద. నాయికగా ఇది నా ఫస్ట్ మూవీ. తొలి చిత్రంతోనే మంచి అవకాశం కల్పించిన నిర్మాత శరత్ గారికి, దర్శకుడు వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరో నివాస్ మాట్లాడుతూ - అందరికీ నమస్కారం. మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన గెస్ట్ లు రఘుబాబు గారు, పృథ్వీగారు, ఆర్పీ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మంచి వినోదాత్మక చిత్రమిది. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement