nivas
-
ఆసక్తికరంగా 'రహస్య' టీజర్
ప్రస్తుతం కొత్త కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ చిత్రాలకంటే కొత్తగా ఉన్నా సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు. థియేటర్లో వచ్చి చూసేంత కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. దర్శకనిర్మాతలు సైతం అదే కోణంలో సినిమాలు రూపొందిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రహస్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రూపుదిద్దుకుంటోంది. నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ శ్రీ మీగడ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమి.ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: సమంత ఎక్కడ? ఆమె సైలెన్స్‌కు కారణం ఇదేనా?) తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. 52 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ టీజర్.. సినిమా పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది. క్రైం మిస్టరీ నేపథ్యంలో మిస్టరీ కథాంశంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. అంతుచిక్కని ఓ క్రైం ఇన్సిడెంట్‌ని పోలీసు వర్గాలు ఎలా ఛేదించాయి? ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలాంటివి? అనే పాయింట్ తో రియలిస్టిక్‌గా ఈ రహస్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీకి తెర రూపమిచ్చారని తెలుస్తోంది. -
Rahasya Movie: ఎన్ఐఏ అధికారిగా నివాస్ శిష్టు
ప్రస్తుతం కొత్త కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రొటీన్ చిత్రాలకంటే కొత్తగా ఉన్నా సినిమాలనే జనాలు ఇష్టపడుతున్నారు. థియేటర్లో వచ్చి చూసేంత కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్. దర్శకనిర్మాతలు సైతం అదే కోణంలో సినిమాలు రూపొందిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రహస్య అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రూపుదిద్దుకుంటోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ శ్రీ మీగడ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమి.ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి హీరో నివాస్ కారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో నివాస్.. విశ్వతేజ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నివాస్ ఎన్ఐఏ అధికారికగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే నివాస్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని ప్రేక్షకుల ముందుంచబోతున్నారు. ఎస్ఎస్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించబోతోన్నారు. ఈ మేరకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. -
కృష్ణా జిల్లా కోడూరులో కలెక్టర్ నివాస్ ఆకస్మిక తనిఖీలు
-
‘సాగర సంగమం’ ఫోటోగ్రాఫర్ కన్నుమూత
ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీఎస్ నివాస్ (73) సోమవారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కేరళలోని కోళిక్కోడ్‌లో ప్రభుత్వాస్పత్రిలో కన్నుమూశారు. క్యాలికట్‌లోని నడక్కావులో పుట్టారు నివాస్. చెన్నైలోని అడయార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలిం టెక్నాలజీలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేశారు. ఛాయాగ్రాహకుడిగా ఆయన తొలి చిత్రం మలయాళ ‘సత్యత్తింటే నిళల్’ (1975). మలయాళ చిత్రం ‘మోహినీయాట్టమ్’ ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. భారతీరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్–రజనీకాంత్–శ్రీదేవి కాంబినేషన్లో రూపొందిన ‘16 వయదినిలే’ (1977) చిత్రం ద్వారా తమిళ తెరకు పరిచయమయ్యారు. మలయాళ, తమిళ చిత్రాలు చేస్తూ ‘వయసు పిలిచింది’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చేసిన ‘నిమజ్జనం’ (1979) ఆయనకు ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. చిరంజీవి ‘పునాదిరాళ్లు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ ‘సాగర సంగమం’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడు నివాసే. భారతీరాజా లీడ్ రోల్లో నటించిన తమిళ చిత్రం ‘కల్లుక్కుళ్ ఈరమ్’ ద్వారా దర్శకుడిగా మారారు నివాస్. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో 3 సినిమాలకు దర్శకత్వం వహించారు. నివాస్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సంపూర్ణ మార్పులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం సాయం త్రం స్థానిక బాపూజీ కళా మందిరంలో వసతి గృహ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతి గృహాల్లోనూ మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనాలు తయారు చేశామని, రూ.10 లక్షల లోపు విలువ కలిగిన అంచనాలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. ప్రతి వసతి గృహాని కి ఒక ఇంజినీర్‌కు బాధ్యతలు అప్పగించామ న్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రూ. 20 లక్షల సర్వశిక్ష అభియాన్ నిధులతో మరమ్మతులు చేపట్టామన్నారు. మరుగుదొడ్లు, ఇతర పనుల కోసం రూ.11 కోట్లతో అంచనాలు త యారు చేశామన్నారు. మొదటి దశలో దాదాపు రూ.6 కోట్లతో పనులను చేపడతామన్నారు. హౌస్ కీపింగ్‌కు అనుమతులు.. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా హౌస్ కీపింగ్‌కు అనుమతులు వచ్చాయని త్వరలోనే మంజూరు చేస్తామన్నా రు. వసతి గృహాల శుభ్రతపై సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, మరుగుదొడ్లలో విధిగా రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. మరుగు దొడ్ల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. దుస్తులు ఆరవేసేందుకు సదుపాయం కల్పించాలన్నారు. కొన్ని గురుకులాల్లో అన్నం, పప్పుచారుతో భోజనం పెడుతున్నారన్నారు. మెనూలో తేడా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో టెండర్లను ఖరారు చేసి, ప్రతి వసతి గృహానికి స్టీమ్ కుక్కర్, గ్రయిండర్, మిక్సీలను సరఫరా చేస్తామన్నారు. ప్రతి వసతి గృహంలో నూ మెనూ బోర్డును ప్రదర్శించాలని, భోజనాల ఫొటోలను ప్రతి రోజూ అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వారంలో ఒక రాత్రి నిద్రపోవాలి సంక్షేమాధికారులు వారంలో ఒక రాత్రి వసతి గృహంలో ని«ద్రపోవాలన్నారు. విద్యార్థుల్లో గుణాత్మకత విద్యా విలువలు వారిలో ప్రేరణ కల్పిస్తాయన్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, సమాజిక విలువలను వివరించాలన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన పోలాకి, రాజాం బీసీ వసతి గృహ అధికారులను అభినందించారు. వసతి గృహ సమస్యలపై మొబైల్ యాప్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో వసతి గృహాల పరిశీలకులు పి.రజనీకాంతరావు, ఆర్అండ్బీ ఎస్ఈ కె.కాంతిమతి, బీసీ సంక్షేమాధికారి కె.కె.కృతిక, బీసీ కార్పొరేషన్ ఈడీ జి.రాజారావు, ఇంజినీరింగ్ అధికారులు సి.సుగుణాకరరావు, కె.భాస్కరరావు, గుప్త, రామం తదితరులు పాల్గొన్నారు. -
గురుకులం నిర్వహణపై కలెక్టర్ కన్నెర్ర
సాక్షి, శ్రీకాకుళం : కలెక్టర్ జి.నివాస్ హఠాత్తుగా కంచిలిలోని ఏపీ బాలయోగి గురుకులంలో ప్రవేశించారు. నేరుగా భోజన శాల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పిల్లలకు ఏం వడ్డించారో స్వయంగా చూసి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించిన మెనూ అమలు కాలేదని గ్రహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సివుండగా.. వారు ఇళ్లకు వెళ్లినట్టు తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. గురుకులం ప్రిన్సిపాల్, నలుగురు టీచర్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకు వడ్డించలేదని ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్‌ను ప్రశ్నించారు. కేవలం పప్పుచారుతోనే పిల్లలు ఎలా తింటారని నిలదీశారు. దీనికి గల కారణమేంటని ప్రశ్నించగా కూరలు తీసుకురావడం ఆలస్యమైందని ప్రిన్సిపాల్ చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సమయంలో ఉపాధ్యాయులు, మిగ తా సిబ్బంది హాజరును పరిశీలించగా, అప్పటికి నలుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. దీనిపై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయకుండా ఇంటికి వెళ్లడం ఏమిటని నిలదీశారు. పిల్లలకు పప్పుచారుపెట్టి .. మీరు మాత్రం మాంసాహా రాలుతినడానికి ఇళ్లకు వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. నాలుగో వంతు పిల్లలు కూడా లేరు కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో 400 మంది పిల్లలకు 70 నుంచి 80 మంది మాత్రమే హాజరు కావడం, వారు కూడా యూనిఫారాలు ధరించకపోవడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఇదేం క్రమశిక్షణ అని ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశ్నించారు. కలెక్టర్ పర్యటనలో గురుకుల నిర్వహణ తీరు, విద్యార్థుల వసతి తదితర అంశాలను, రికార్డులను పరిశీలించారు. దాదాపు 40 నిమిషాలపాటు ఆయన తనిఖీలు కొనసాగాయి. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. లోపాలకు గల కారణాలను గురుకుల సిబ్బందిని అడిగారు. వారి సమాధానాలకు కలెక్టర్ సంతృప్తి చెందకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన సిబ్బందిలో కన్పించింది. ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ గురుకుల ప్రిన్సిపాల్ ఎన్.బాలాజీ నాయక్, ఉపాధ్యాయులు టి.వి.రమణ, పి.సురేష్, జి.జయరాం, పి.అమ్మాయమ్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ జి.నివాస్ ప్రకటించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్‌తోపాటు మండల ప్రత్యేకాధికారి ఆర్.వరప్రసాద్, తహసీల్దార్ కె.డిసెంబరరావు, ఎంపీడీఓ చల్లా శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ కోసం బాహుబలి రైటర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బయోపిక్ కోసం దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఈ చిత్రం కోసం సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నివాస్ డైరెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం విజయేంద్ర వర్మతో నివాస్ చర్చించగా.. ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. తొలుత ఈ చిత్రాన్ని కేవలం డాక్యుమెంటరీగానే చిత్రీకరించాలని నిర్మాతలు భావించారు. అయితే చివరకు దీనిని కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. బాహుబలి రైటర్ ఎంట్రీతో ఆ పని మరింత సులువు కానుంది. తారాగణం, మిగతా టెక్నీషియన్లపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతిచెందాడు. నంద్యాల- ఆత్మకూరు రోడ్డులో శుక్రవారం బుల్లెట్‌పై వెళ్తున్న జవాన్ నివాస్‌రెడ్డిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అతను సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. సంక్రాంతి పండుగ కోసం నివాస్ రెడ్డి సెలవుపై వచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఏపీఈపీడీసీఎల్ ఇన్చార్జి సీఎండీగా నివాస్
సాక్షి, విశాఖపట్నం ఏపీ ఈపీడీసీఎల్ ఇన్చార్జి సీఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఎండీగా ఉన్న రేవు ముత్యాలరాజు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విషయంతెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జి బాధ్యతలను నివాస్‌కు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌ను సీఎండీగా నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. యలమంచిలి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ యలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్.శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. ఆయనను కౌన్సెలింగ్‌లో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత ఆ పోస్ట్‌లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీహెచ్ ప్రమీలను నియమించారు. దీంతో ఎస్.శ్రీనివాసరావును గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.సత్యనారాయణను యలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.