![Collector Nivas Says Basic Infrastructure Is Compulsory In Every Hostel In Srikakulam - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/12/Nivas.jpg.webp?itok=BD7P9MVN)
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో సంపూర్ణ మార్పులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శుక్రవారం సాయం త్రం స్థానిక బాపూజీ కళా మందిరంలో వసతి గృహ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వసతి గృహాల్లోనూ మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనాలు తయారు చేశామని, రూ.10 లక్షల లోపు విలువ కలిగిన అంచనాలను వెంటనే మంజూరు చేస్తామన్నారు. ప్రతి వసతి గృహాని కి ఒక ఇంజినీర్‌కు బాధ్యతలు అప్పగించామ న్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో రూ. 20 లక్షల సర్వశిక్ష అభియాన్ నిధులతో మరమ్మతులు చేపట్టామన్నారు. మరుగుదొడ్లు, ఇతర పనుల కోసం రూ.11 కోట్లతో అంచనాలు త యారు చేశామన్నారు. మొదటి దశలో దాదాపు రూ.6 కోట్లతో పనులను చేపడతామన్నారు.
హౌస్ కీపింగ్‌కు అనుమతులు..
సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా హౌస్ కీపింగ్‌కు అనుమతులు వచ్చాయని త్వరలోనే మంజూరు చేస్తామన్నా రు. వసతి గృహాల శుభ్రతపై సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, మరుగుదొడ్లలో విధిగా రన్నింగ్ వాటర్ ఉండాలన్నారు. మరుగు దొడ్ల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. దుస్తులు ఆరవేసేందుకు సదుపాయం కల్పించాలన్నారు.
కొన్ని గురుకులాల్లో అన్నం, పప్పుచారుతో భోజనం పెడుతున్నారన్నారు. మెనూలో తేడా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో టెండర్లను ఖరారు చేసి, ప్రతి వసతి గృహానికి స్టీమ్ కుక్కర్, గ్రయిండర్, మిక్సీలను సరఫరా చేస్తామన్నారు. ప్రతి వసతి గృహంలో నూ మెనూ బోర్డును ప్రదర్శించాలని, భోజనాల ఫొటోలను ప్రతి రోజూ అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
వారంలో ఒక రాత్రి నిద్రపోవాలి
సంక్షేమాధికారులు వారంలో ఒక రాత్రి వసతి గృహంలో ని«ద్రపోవాలన్నారు. విద్యార్థుల్లో గుణాత్మకత విద్యా విలువలు వారిలో ప్రేరణ కల్పిస్తాయన్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, సమాజిక విలువలను వివరించాలన్నారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. గతేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన పోలాకి, రాజాం బీసీ వసతి గృహ అధికారులను అభినందించారు. వసతి గృహ సమస్యలపై మొబైల్ యాప్‌ను తయారు చేయడం జరిగిందన్నారు.
మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో వసతి గృహాల పరిశీలకులు పి.రజనీకాంతరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.కాంతిమతి, బీసీ సంక్షేమాధికారి కె.కె.కృతిక, బీసీ కార్పొరేషన్ ఈడీ జి.రాజారావు, ఇంజినీరింగ్ అధికారులు సి.సుగుణాకరరావు, కె.భాస్కరరావు, గుప్త, రామం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment