ఏపీఈపీడీసీఎల్ ఇన్‌చార్జి సీఎండీగా నివాస్
సాక్షి, విశాఖపట్నం
ఏపీ ఈపీడీసీఎల్ ఇన్‌చార్జి సీఎండీగా జిల్లా జాయింట్ కలెక్టర్ జె.నివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సీఎండీగా ఉన్న రేవు ముత్యాలరాజు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన విషయంతెలిసిందే. ఆయన స్థానంలో ఇన్‌చార్జి బాధ్యతలను నివాస్‌కు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్‌ను సీఎండీగా నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
యలమంచిలి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ
యలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్.శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. ఆయనను కౌన్సెలింగ్‌లో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత ఆ పోస్ట్‌లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీహెచ్ ప్రమీలను నియమించారు. దీంతో ఎస్.శ్రీనివాసరావును గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.సత్యనారాయణను యలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.