సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతిచెందాడు. నంద్యాల- ఆత్మకూరు రోడ్డులో శుక్రవారం బుల్లెట్‌పై వెళ్తున్న జవాన్ నివాస్‌రెడ్డిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అతను సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. సంక్రాంతి పండుగ కోసం నివాస్ రెడ్డి సెలవుపై వచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment