
నివాస్, అమిత శ్రీ జంటగా వినోద్ కుమార్, రఘుబాబు, పృథ్వీ, భరద్వాజ్, ఖయ్యూం కీలక ΄పాత్రల్లో ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ సినిమా గురువారం ఆరంభమైంది. వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు.
వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ నెల 18న రెగ్యులర్ షూట్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘మా సినిమా పేరులో గుర్తులేదు అని ఉంది కానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుంది’’ అని శరత్‌బాబు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభిలాష్ .ఎం, సంగీతం: అజయ్ పట్నాయక్.
Comments
Please login to add a commentAdd a comment