Bharadwaj
-
తెలీదు!
నివాస్, అమిత శ్రీ జంటగా వినోద్ కుమార్, రఘుబాబు, పృథ్వీ, భరద్వాజ్, ఖయ్యూం కీలక ΄పాత్రల్లో ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ సినిమా గురువారం ఆరంభమైంది. వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు.వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ నెల 18న రెగ్యులర్ షూట్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘మా సినిమా పేరులో గుర్తులేదు అని ఉంది కానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుంది’’ అని శరత్‌బాబు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభిలాష్ .ఎం, సంగీతం: అజయ్ పట్నాయక్. -
లైఫ్‌లో రిస్క్ ఉండాలి: కోమల్ ఆర్.భరద్వాజ్
‘‘ఈ విశ్వమే పెద్ద మిస్టరీ. ఇతిహాసాలు, పురాణాల ప్రకారం పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు. ఈ లోకాల మధ్య తిరిగిన వాళ్లు ఉన్నారని చెబుతుంటారు. అయితే వాళ్లు ఎలా తిరిగారు? సైన్స్ ప్రకారం వామ్‌హోల్స్‌తో ట్రావెల్ చేస్తే ఇంకో టైమ్‌లోకి ఎలా వెళతాం? అన్న అంశాలనే ‘రహస్యం ఇదం జగత్’ సినిమాలో చూపిస్తున్నాం’’ అని దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ అన్నారు. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’.కోమల్ ఆర్. భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కోమల్ ఆర్. భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఎమ్ఎస్ పూర్తి చేసి, ఉద్యోగం చేశాను. సినిమాలపై ప్యాషన్‌తో ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశా. ఆ తర్వాత ‘రహస్యం ఇదం జగత్’ సినిమా తీశాను. సడన్‌గా సినిమాల్లోకి రావడం అనేది కాస్త రిస్కే.. కాదనను. కానీ లైఫ్‌లో రిస్క్ ఉండాలి. శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగిందన్న విషయం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఆశ్చర్యకరంగా ఆ తవ్వకాలు జరిగిన ప్రదేశం అమెరికాలో నేనుండే చోటుకు దగ్గరగానే ఉంటుంది. ఇలా ఈ సినిమా కథే నన్ను వెతుక్కుంటూ వచ్చిందనిపించింది. ఈ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను చెప్పాం’’ అన్నారు. -
ఏ లాంగ్వేజ్ అయినా 1 మంత్ లో నేర్చుకోవచ్చు..
-
శిరీష్ భరద్వాజ్ మరణానికి కారణం చెబుతూ తల్లి ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతి గురించి పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. అయితే, తాజాగా ఆమె అమ్మగారు పలు ఆసక్తికరమైన విషయలాను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భరద్వాజ్ లంగ్స్ డ్యామేజ్ వల్ల చనిపోయారని వచ్చని రూమర్స్‌లో నిజం లేదని ఆమె తెలిపారు.శిరీష్ భరద్వాజ్ ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) వల్ల చనిపోయాడని ఆమె ఇలా తెలిపారు. 'కొన్నేళ్లుగా మేము హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. చికిత్స కోసం శిరీష్ భరద్వాజ్‌ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చేరిపించాం. మే 13న భరద్వాజ్ పుట్టినరోజు ఉంది. సెలబ్రేషన్ చేసుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురికావడం జరిగింది. దీంతో మే 17న అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. సుమారు 30రోజుల పాటు అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలో కార్డియాక్ అరెస్ట్ వల్ల జూన్ 19న మరణించాడు. కానీ, కొన్ని మీడియా సంస్థలు భరద్వాజ్ మరణం గురించి తప్పుగా రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు.శ్రీజ ఎలా ఉంటుందంటే..2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా శ్రీజ గురించి భరద్వాజ్ అమ్మగారు ఇలా చెప్పారు. శ్రీజ చాలా మంచి అమ్మాయి. అందరూ అనుకున్నట్లుగా ఆమెను తప్పు పట్టాల్సిన పనిలేదు. వారి పెళ్లి జరిగి చాలా ఎళ్లు అయింది. వాళ్లు ఎందుకు విడిపోయారు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ, శ్రీజ- భరద్వాజ్‌లకు జన్మించిన కూతురు నివృత్తి మాత్రం తండ్రి మాదిరే పోలికలు ఉన్నాయి. ఆ పాపను చూస్తే చాలు భరద్వాజ్‌ను చూసినట్లే ఉంటుంది. భరద్వాజ్ మరణం తర్వాత మెగాస్టార్ కుటుంబానికి సమాచారం ఇచ్చాం. కానీ, వారిలో ఎవరూ అంత్యక్రియలకు కూడా రాలేదు. నా వరకు అయితే నా మనవరాలిని (నివృత్తి) చూడాలని ఉంటుంది. వారు పెద్దవాళ్లు కదా..! వాళ్ల ఇష్టం ఆ అవకాశం కల్పిస్తారో లేదో.. అందరి మాదిరి నా మనవరాలిని చూడాలని నాకు ఉంటుంది. నా భర్త లాయర్‌గా పనిచేసేవారు. 2016లో ఆయన కూడా మరణించారు. ఇప్పుడు నేను చిన్న అబ్బాయితో ఉంటున్నాను.మాకు ఎవరూ డబ్బు ఇవ్వలేదుశ్రీజ నుంచి భరద్వాజ్ రూ. 33 కోట్లు తీసుకున్నట్లు ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ అంశంపై ఆమె ఇలా స్పందించారు. 'మా కుటుంబంలో ఎవరూ డబ్బు తీసుకోలేదు. అంత డబ్బు తీసుకుంటే.. మేము అద్దె ఇంట్లో ఎందుకు ఉంటాం..? దానిని చాలామంది తప్పుగా చెప్పుతున్నారు. ఆ కుటుంబం నుంచి మాకు డబ్బు ఇస్తామని చెప్పిన మాట నిజమే.. కానీ, మేము వద్దని చెప్పాం. ఆ డబ్బును మా మనవరాలు (నివృత్తి) కోసం ఉపయోగించమని చెప్పాం.' అంటూ భరద్వాజ్ అమ్మగారు ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ ఆర్టీసీలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయినట్లు ఆమె అన్నారు. వారి మనవరాలు నివృత్తిని చూడలనే కోరిక ఉన్నట్లు ఆమె పదేపదే ఎమోషనల్‌గా చెప్పారు. -
శిరీష్ భరద్వాజ్ కన్నుమూత
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో మృతి చెందారు. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు.శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్ భరద్వాజ్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే, కొంత కాలంగా శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రితం మృతి చెందారు. 2017లో శిరీష్ భరద్వాజ్ బీజేపీలో చేరారు. కానీ, పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఆయన ఎక్కడ కనిపించలేదు.ఆర్య సమాజ్‌లో వివాహంకొణిదెల శ్రీజకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఆమె చదువుకుంటున్న రోజుల్లో ప్రతిరోజూ ఎల్బీ స్టేడియం వరకు వెళ్లి ప్రాక్టీస్ చేసేది. ఆమె ప్రతిభను చూసిన వారందరూ కూడా నేషనల్ రేంజ్‌కు చేరుకుంటుందని ఆశించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో అక్టోబరు 17, 2007న శిరీష్ భరద్వాజ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లే కావడంతో చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పారు. వారందరినీ కాదని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుని మీడియా ముందుకు వచ్చారు. శ్రీజ మేజర్ కాగానే ఆమె పేరుతో రూ. 32 కోట్లు చిరంజీవి డిపాజిట్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ డబ్బును కాజేసేందుకే పెళ్లి పేరుతో ఆమెను ట్రాప్‌లో పడేశాడని భరద్వాజ్‌పై ఆరోపణ ఉంది. శ్రీజ పేరుతో బేగంపేటలో ఉన్న ఒక ఫ్లాట్‌ను కూడా అప్పట్లో భరద్వాజ్ తీసుకున్నారట. వివాహం తర్వాత శిరీష్ భరద్వాజ్ కరెక్ట్ వ్యక్తి కాదని శ్రీజ ఆరోపించింది. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
కథ విన్నప్పుడే కన్నీళ్లొచ్చాయి
రవితేజ టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. వంశీ దర్శకత్వంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో గాయత్రీ భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం ఢిల్లీ. పుణేలో చదువుకున్నాను. మా నాన్నగారు పైలెట్. అమ్మ సైకాలజిస్ట్. నాకు చిన్నప్పట్నుంచే ఫ్యాషన్ వరల్డ్‌లో ఫేమస్ కావాలని ఉండేది. నా ఏడో తరగతిలోనే ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసి, విజేతగా నిలిచాను. ఆ తర్వాత భరత నాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. హిందీలో అవకాశాలు రావడంతో ఓ సినిమా, మూడు వెబ్ సిరీస్‌లు చేశాను. ‘టైగర్ నాగేశ్వరరావు’ నా తొలి తెలుగు సినిమా. నన్ను ఎంపిక చేయడానికి ముందు దాదాపు 60 మందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రంలో విలేజ్‌లో టామ్‌బాయ్‌లా కనిపించే మణి పాత్ర చేశాను. దర్శకులు వంశీగారు ఈ పాత్ర గురించి దాదాపు మూడు గంటలు వివరించారు. పాత్రలో మంచి ఎమోషన్ ఉంది. కథ వింటున్నప్పుడే కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమా విషయంలో నాకు భాషాపరంగా ఏ ఇబ్బంది లేదు. నాకు తెలుగు టీచర్ ఉన్నారు. ఇక రవితేజగారు సెట్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ తెలుగు సినిమా చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నార్త్ ఇండస్ట్రీలో కాస్త హరీబరీగా ఉంటుంది. కానీ తెలుగు పరిశ్రమలో చాలా ఓర్పుతో వర్క్ చేస్తున్నారు. లభిస్తున్న గౌరవం కూడా ఎక్కువే. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాను ఎంతో ప్రేమిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. -
పెళ్లి ముందు వరకు నాకు ఆ విషయం తెలియదు: అనసూయ
యాంకర్ అనసూయ గురించి అందరికి తెలిసిందే. బుల్లితెరపై గ్లామర్ క్వీన్‌గా పేరు సంపాదించి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తోంది. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీ చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఏ విషయం గురించి అయినా ముక్కు సూటిగా మాట్లాడడం అనసూయకు అలవాటు. తన పర్సనల్ విషయాలను కూడా ఓపెన్‌గానే షేర్ చేసుకుంటుంది. తాజాగా తన భర్త భరద్వాజ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. 9 ఏళ్లుగా ప్రేమలో అనసూయది ప్రేమ వివాహం. ఇంటర్లో ఉన్నప్పుడు భరద్వాజ్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత భరద్వాజ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే అనసూయ వెంటనే ఓకే చెప్పలేదు. ఏడాదిన్నర తర్వాత ఆయన ప్రేమను అంగీకరించింది. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2010లో వివాహం చేసుకున్నారు. మొదట్లో వీరి వివాహానికి కుటుంబం సభ్యులు ఒప్పుకోలేదు. కానీ ఇద్దరూ పట్టుపట్టి మరీ ఒప్పించారు. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కొడుకులు. భరద్వాజ్ కులం ఏంటో తెలియదు: అనసూయ తొమిదేళ్లుగా ప్రేమలో ఉన్నా.. వీరిద్దరి మధ్య కుల ప్రస్థావన ఒక్కసారి కూడా రాలేదట. లగ్న పత్రిక రాసే ముందు వరకు భరద్వాజ్ కులం ఏంటో అనసూయకు తెలియదట. ‘పెద్ద కాపు – 1’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కుల మతాలను నేను ఎక్కువగా పట్టించుకోను. తొమ్మిదేళ్లు ప్రేమలో ఉన్నప్పటికీ.. భరద్వాజ్ కులం ఏంటో నాకు తెలియదు. లగ్న పత్రిక రాసే ముందు గోత్రం, కులం అడిగారు. అప్పుడు ఆయన పలాన కులానికి చెందిన వ్యక్తి అని తెలిసింది. మేమిద్దరం కులమతాలను పట్టించుకోం’ అని అనసూయ చెప్పుకొచ్చింది. -
బీచ్‌లో భర్తపై అనసూయ ముద్దుల వర్షం.. ఫోటోలు వైరల్
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తుంది కూడా. ఇక నేడు అనసూయ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్త భరద్వాజ్‌తో కలిసి థాయ్‌లాండ్ బీచ్‌లో యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలతో అనసూయ బికినీలో ఉంది. సముద్రం ఒడ్డున భర్తతో కలిసి రొమాన్స్ చేసింది. లిప్‌లాక్ ఇస్తూ భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్ట్‌ని షేర్ చేసింది. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే.. వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఈ మధ్య యాంకరింగ్‌కి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇటీవల రంగమార్తాండ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు పలు చిన్న సినిమాల్లోనూ అనసూయ నటిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
బాక్సాఫీస్ వద్ద సీక్వెల్స్ హల్చల్
-
Biel Chess Festival 2022: రన్నరప్ హరిసూర్య భరద్వాజ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీల్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో అమెచ్యూర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుండేపూడి హరిసూర్య భరద్వాజ్ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల హరిసూర్య ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి భారత్‌కే చెందిన మన్మయ్ చోప్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా మన్మయ్కు టాప్ ర్యాంక్ ఖరారుకాగా, హరిసూర్యకు రెండో ర్యాంక్ దక్కింది. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి హరిసూర్య ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ప్రణీత్‌కు రెండో జీఎం నార్మ్ బీల్ చెస్ టోర్నీ మాస్టర్స్ విభాగంలో తెలంగాణకు చెందిన వుప్పాల ప్రణీత్ ఆరు పాయింట్లతో మరో పదిమందితో కలిసి సంయక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా ప్రణీత్ కు 15వ స్థానం దక్కింది. ఈ టోర్నీలో ప్రణీత్ ఇద్దరు గ్రాండ్మాస్టర్లపై గెలిచి, మరో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్ల తో ‘డ్రా’ చేసుకొని రెండో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) నార్మ్ సంపాదించాడు. మూడో జీఎం నార్మ్ సాధించి, 2500 రేటింగ్ పాయింట్ల మైలురాయి అందుకుంటే ప్రణీత్‌కు గ్రాండ్‌మాస్టర్ హోదా ఖరారవుతుంది. గుకేశ్‌కు కాంస్య పతకం బీల్ చెస్ ఫెస్టివల్ గ్రాండ్‌మాస్టర్ ట్రయాథ్లాన్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు కాంస్య పతకం లభించింది. తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల గుకేశ్ క్లాసికల్ విభాగంలో 15 పాయింట్లు, ర్యాపిడ్ విభాగంలో 7 పాయింట్లు, బ్లిట్జ్ విభాగంలో 7.5 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా 29.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. క్వాంగ్ లియెమ్ లీ (వియత్నాం; 35.5 పాయింట్లు) విజేతగా నిలిచాడు. -
14 ఏళ్లకే అద్భుతం అనిపించిన ట్విన్ బ్రదర్స్.. ఇంతకీ ఏం చేశారంటే..?
ఎందుకు? ఏమిటి? ఎలా....అనే ఆసక్తి వీరిని రకరకాల శాస్త్ర,సాంకేతిక పుస్తకాలు చదివేలా చేసింది. కొత్తగా ఆలోచించేలా చేసింది. కొత్త మార్గంలో వెళ్లేలా చేసింది. చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకునేలా చేసింది... పద్నాలుగేళ్ల వయసులో పిల్లలు ఎలా ఉంటారు? సినిమాలంటే బోలెడు ఇష్టపడతారు. సంగీతం అంటే చెవి కోసుకుంటారు. వీరతాళ్లు మెడలో వేసుకొని వీడియో గేమ్స్ ఆడతారు. అయితే దిల్లీకి చెందిన ట్విన్ బ్రదర్స్ యశ్‌రాజ్ భరద్వాజ్, యువరాజ్ భరద్వాజ్ మాత్రం ఈ వయసులోనే తమ వయసుకు మించిన పనులు చేశారు. అద్భుతం అనిపించుకున్నారు. కాస్త వెనక్కి వెళితే.. అందరు పిల్లలలాగే ఈ కవల సోదరులకు క్రికెట్ అంటే చెప్పలేనంత ఇష్టం. చదువు మీద కంటే ఆట మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్లు. ‘ఇలా అయితే చదువు పూర్తిగా దెబ్బతింటుంది. మీరు కొంతకాలం క్రికెట్‌ను దూరం పెడితే మంచిది’ అని బుజ్జగింపు ధోరణిలో చెప్పాడు తండ్రి. ఇక అంతే...అప్పటి నుంచి క్రికెట్ జోలికి వెళ్లలేదు. చదువే వారి ప్రపంచం అయింది. చదవండి: టీచరమ్మ స్కూలు సేద్యం నేషనల్ జాగ్రఫిక్–డిస్కవరీ చానల్స్ చూడడం ద్వారా ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే జిజ్ఞాస పెరిగింది. తమ పుస్తకాలే కాకుండా పై తరగతి పుస్తకాలు చదివేవారు. సందేహాలు వస్తే సీనియర్లను అడిగేవారు. సైన్స్ ఫిక్షన్‌తో పాటు రిసెర్చ్ పేపర్స్, విజ్ఞానదాయకమైన బ్లాగ్స్ విరివిగా చదివేవారు. ప్రాజెక్ట్ మెనేజ్మెంట్ కన్సల్టెన్సీ, ట్రాన్స్ఫర్మెషన్ కన్సల్టింగ్, స్ట్రాటజిక్ స్టడీస్, ఫ్రాడ్ ఎనాలసిస్, డాటా ఎనాలటిక్స్...ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. రకరకాల జర్నల్స్ చదివి వాటి గురించి చర్చించుకునేవారు. రిసెర్చ్ ఐడియాలను రాసుకునేవారు. ఈ క్రమంలోనే సొంతంగా రిసెర్చ్ పేపర్స్ రాయడం నేర్చుకున్నారు. ఫరీదాబాద్(హరియాణా)లోని ‘మానవ్ రచన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో’ ఇంజనీరింగ్ పూర్తికాకముందే బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆల్–ఇన్–వన్ మెడికల్ అసిస్టెన్స్...ఇలా ఎనిమిది అంశాలలో పేటెంట్ పొందారు. ‘క్రికెట్ మానేసినప్పుడు మొదట్లో చాలా బాధ అనిపించింది. అయితే కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, కొత్త విషయాల గురించి ఆలోచించడంలో క్రికెట్లో కంటే ఎక్కువ సంతోషం దొరికింది’ అంటాడు యువరాజ్. రకరకాల బహుమతులు, గ్రాంట్స్, ఫెలోషిప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ అనే కన్సల్టెన్సీ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇది టెక్నాలజీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్...మొదలైన రంగాలలో కన్సల్టింగ్ సర్వీస్‌ను అందిస్తుంది. పేరు పొందిన కంపెనీలు కూడా వీరి క్లయింట్స్ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఇలాంటి క్లిష్ల సమయంలోనూ ‘పెటోనిక్ ఇన్ఫోటెక్’ దెబ్బతినలేదు. ‘ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్ మా ముందు ఎన్నో సవాళ్లను పెట్టింది. ఎన్నో ద్వారాలు తెరవడానికి కారణం అయింది. మునపటి కంటే ఎక్కువ శక్తితో పనిచేశాం. ప్రతి చాలెంజ్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోగలిగాము’ అంటాడు యశ్‌రాజ్ భరద్వాజ్.‘హుందాతనం నిండిన మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాం. చదువే మన ఆస్తి అని ఎప్పుడూ చెబుతుండేవారు నాన్న’ అంటాడు యువరాజ్ భరద్వాజ్. ఈ ఇద్దరిని ఒకేసారి చూస్తే ‘ఎవరు యశ్‌రాజ్?’ ‘ఎవరు యువరాజ్?’ అని వెంటనే పోల్చుకోవడం కష్టం కావచ్చుగానీ ‘ఎవరికి వారు సాటి’ అని మెచ్చుకోవడంలో ఎలాంటి అయోమయానికి తావు లేదు. -
‘స్వాతి చినుకులు’ ఫేం భరద్వాజ్‌కు కరోనా
-
కరోనా: మరో బుల్లితెర నటుడికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు పెగుతున్నాయి. ఇప్పటికే పలువురు టెలివిజన్ నటీనటులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ వచ్చింది. బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల ఆదివారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించారు. స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా భరద్వాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..) తన ఆరోగ్యానికి సంబంధించి భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిమిషాల వీడియో పోస్టు చేశారు. తనకు లక్షణాలేవి లేవని, ఎవరూ భయపడవద్దని సూచించాడు. సరైన ఆహార నియమాలు, మందులతో వ్యాధి నుంచి బయట పడవచ్చని పేర్కొన్నారు. అయితే తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక భరద్వాజ్ కరోనా సోకిన విషయంతో తెలియడంతో అతని అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్) తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్ -
‘పవిత్ర కేసును సీబీఐ విచారించాలి’
ముంబై: ఢిల్లీ వర్సిటీ అనుబంధ భీమ్ రావ్ అంబేద్కర్ కాలేజీ మాజీ ఉద్యోగి పవిత్ర భరద్వాజ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేపట్టాలని ముంబైలోని జేఎన్‌యూ ఢిల్లీ పూర్వ విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సంస్థలు గురువారం డిమాండ్ చేశాయి. ‘ఆమె మృతి చుట్టూ అలుముకున్న పరిస్థితులను చూస్తే సీబీఐ విచారణ చేపట్టాలి. ఢిల్లీ పోలీసులు చేపట్టే దర్యాప్తుపై మాకు నమ్మకం లేద’ని ఏక్తా అనే ఎన్జీవో వ్యవస్థాపకుడు రాకేశ్ శెట్టి అన్నారు. మృతురాలికి న్యాయం చేకూర్చేందుకు, ఆమె మృతి కేసును సీబీఐ విచారణ చేపట్టేలా ఒత్తిడి తీసుకొస్తున్న ముంబై, ఢిల్లీలోని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, అక్టోబర్ ఒకటిన 40 ఏళ్ల భరద్వాజ ఢిల్లీ సెక్రటేరియట్ ప్రాంగణంలో కిరోసిన్ పొసుకొని నిప్పంటించుకుంది. దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరిగ్గా వారం రోజుల తర్వాత మృతి చెందింది. భీమ్రావ్ అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపల్ పలుమార్లు లైంగికంగా వేధించాడని పవిత్ర ఆరోపించడంతో ఆమెను ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగం నుంచి తప్పించారు. 2009 నుంచి ప్రిన్సిపల్‌తో పాటు ఆయన సహచరులు లైంగికంగా వేధిస్తున్నారని పలుమార్లు కేసులు కూడా నమోదుచేసింది. ఈ మేరకుఆమె రాసిన ఫిర్యాదు లేఖలను వర్సిటీ పరిపాలన యంత్రాంగం, ఢిల్లీ లెఫ్ట్నెట్ గవర్నర్లతో పాటు వివిధ సంస్థలకు పంపిచామని అకాడమీక్స్ ఫర్ అక్షన్స్ అండ్ డెవలప్మెంట్ చైర్పర్సన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఏఎన్ మిశ్రా తెలిపారు.