మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. ఆయన మృతి గురించి పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. అయితే, తాజాగా ఆమె అమ్మగారు పలు ఆసక్తికరమైన విషయలాను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భరద్వాజ్ లంగ్స్ డ్యామేజ్ వల్ల చనిపోయారని వచ్చని రూమర్స్‌లో నిజం లేదని ఆమె తెలిపారు.
శిరీష్ భరద్వాజ్ ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) వల్ల చనిపోయాడని ఆమె ఇలా తెలిపారు. 'కొన్నేళ్లుగా మేము హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. చికిత్స కోసం శిరీష్ భరద్వాజ్‌ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో చేరిపించాం. మే 13న భరద్వాజ్ పుట్టినరోజు ఉంది. సెలబ్రేషన్ చేసుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురికావడం జరిగింది. దీంతో మే 17న అపోలో ఆసుపత్రిలో చేర్పించాము. సుమారు 30రోజుల పాటు అక్కడ చికిత్స తీసుకుంటున్న క్రమంలో కార్డియాక్ అరెస్ట్ వల్ల జూన్ 19న మరణించాడు. కానీ, కొన్ని మీడియా సంస్థలు భరద్వాజ్ మరణం గురించి తప్పుగా రాశారు. అందులో ఎలాంటి నిజం లేదు.
శ్రీజ ఎలా ఉంటుందంటే..
2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా శ్రీజ గురించి భరద్వాజ్ అమ్మగారు ఇలా చెప్పారు. శ్రీజ చాలా మంచి అమ్మాయి. అందరూ అనుకున్నట్లుగా ఆమెను తప్పు పట్టాల్సిన పనిలేదు. వారి పెళ్లి జరిగి చాలా ఎళ్లు అయింది. వాళ్లు ఎందుకు విడిపోయారు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ, శ్రీజ- భరద్వాజ్‌లకు జన్మించిన కూతురు నివృత్తి మాత్రం తండ్రి మాదిరే పోలికలు ఉన్నాయి. ఆ పాపను చూస్తే చాలు భరద్వాజ్‌ను చూసినట్లే ఉంటుంది.
భరద్వాజ్ మరణం తర్వాత మెగాస్టార్ కుటుంబానికి సమాచారం ఇచ్చాం. కానీ, వారిలో ఎవరూ అంత్యక్రియలకు కూడా రాలేదు. నా వరకు అయితే నా మనవరాలిని (నివృత్తి) చూడాలని ఉంటుంది. వారు పెద్దవాళ్లు కదా..! వాళ్ల ఇష్టం ఆ అవకాశం కల్పిస్తారో లేదో.. అందరి మాదిరి నా మనవరాలిని చూడాలని నాకు ఉంటుంది. నా భర్త లాయర్‌గా పనిచేసేవారు. 2016లో ఆయన కూడా మరణించారు. ఇప్పుడు నేను చిన్న అబ్బాయితో ఉంటున్నాను.
మాకు ఎవరూ డబ్బు ఇవ్వలేదు
శ్రీజ నుంచి భరద్వాజ్ రూ. 33 కోట్లు తీసుకున్నట్లు ఒకప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ అంశంపై ఆమె ఇలా స్పందించారు. 'మా కుటుంబంలో ఎవరూ డబ్బు తీసుకోలేదు. అంత డబ్బు తీసుకుంటే.. మేము అద్దె ఇంట్లో ఎందుకు ఉంటాం..? దానిని చాలామంది తప్పుగా చెప్పుతున్నారు. ఆ కుటుంబం నుంచి మాకు డబ్బు ఇస్తామని చెప్పిన మాట నిజమే.. కానీ, మేము వద్దని చెప్పాం. ఆ డబ్బును మా మనవరాలు (నివృత్తి) కోసం ఉపయోగించమని చెప్పాం.' అంటూ భరద్వాజ్ అమ్మగారు ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ ఆర్టీసీలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయినట్లు ఆమె అన్నారు. వారి మనవరాలు నివృత్తిని చూడలనే కోరిక ఉన్నట్లు ఆమె పదేపదే ఎమోషనల్‌గా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment