‘‘ఈ విశ్వమే పెద్ద మిస్టరీ. ఇతిహాసాలు, పురాణాల ప్రకారం పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు. ఈ లోకాల మధ్య తిరిగిన వాళ్లు ఉన్నారని చెబుతుంటారు. అయితే వాళ్లు ఎలా తిరిగారు? సైన్స్ ప్రకారం వామ్‌హోల్స్‌తో ట్రావెల్ చేస్తే ఇంకో టైమ్‌లోకి ఎలా వెళతాం? అన్న అంశాలనే ‘రహస్యం ఇదం జగత్’ సినిమాలో చూపిస్తున్నాం’’ అని దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ అన్నారు. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రహస్యం ఇదం జగత్’.
కోమల్ ఆర్. భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కోమల్ ఆర్. భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఎమ్‌ఎస్ పూర్తి చేసి, ఉద్యోగం చేశాను. సినిమాలపై ప్యాషన్‌తో ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశా. ఆ తర్వాత ‘రహస్యం ఇదం జగత్’ సినిమా తీశాను.
సడన్‌గా సినిమాల్లోకి రావడం అనేది కాస్త రిస్కే.. కాదనను. కానీ లైఫ్‌లో రిస్క్ ఉండాలి. శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగిందన్న విషయం నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసింది. ఆశ్చర్యకరంగా ఆ తవ్వకాలు జరిగిన ప్రదేశం అమెరికాలో నేనుండే చోటుకు దగ్గరగానే ఉంటుంది. ఇలా ఈ సినిమా కథే నన్ను వెతుక్కుంటూ వచ్చిందనిపించింది. ఈ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను చెప్పాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment