అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి | Srija Konidela Ex Husband Sirish Bharadwaj Passed Away | Sakshi
Sakshi News home page

శిరీష్ భరద్వాజ్ కన్నుమూత

Published Wed, Jun 19 2024 11:11 AM | Last Updated on Wed, Jun 19 2024 12:18 PM

Srija Konidela EX Husband Sirish Bharadwaj Passed Away
  • శిరీష్‌ భరద్వాజ్‌.. చిరంజీవి మాజీ అల్లుడు
  • చిరు చిన్న కూతురు శ్రీజతో 2007లో శిరీష్‌ ప్రేమ వివాహం
  • ఆర్య సమాజ్‌లో వివాహం.. వివాదంతో మీడియాకు ఎక్కిన జంట
  • ఆపై మెగా కుటుంబంతో కలిసిపోయిన అల్లుడు
  • అనూహ్యంగా శిరీష్‌పై అదనపు కట్నం వేధింపుల కేసు 
  • ఏడేళ్ల కిందట విడాకులు మంజూరు.. ఆపై మరో వివాహం
 

 

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త  శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో మృతి చెందారు. 2007లో శ్రీజను శిరీష్‌ భరద్వాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది.  అదనపు కట్నం కోసం శిరీష్‌ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు.

శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను శిరీష్‌ భరద్వాజ్‌ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు చెన్నైలో ఉన్నట్లు సమాచారం. అయితే, కొంత కాలంగా శిరీష్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన లంగ్స్ డ్యామేజ్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సమయం క్రితం మృతి చెందారు. 2017లో శిరీష్‌ భరద్వాజ్‌ బీజేపీలో చేరారు. కానీ, పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఆయన ఎక్కడ కనిపించలేదు.

ఆర్య సమాజ్‌లో వివాహం
కొణిదెల శ్రీజకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఆమె చదువుకుంటున్న రోజుల్లో ప్రతిరోజూ ఎల్బీ స్టేడియం వరకు వెళ్లి ప్రాక్టీస్‌ చేసేది. ఆమె ప్రతిభను చూసిన వారందరూ కూడా నేషనల్‌ రేంజ్‌కు చేరుకుంటుందని ఆశించారు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో  అక్టోబరు 17, 2007న శిరీష్ భరద్వాజ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లే కావడంతో చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పారు. వారందరినీ కాదని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుని మీడియా ముందుకు వచ్చారు. 

శ్రీజ మేజర్‌ కాగానే ఆమె పేరుతో రూ. 32 కోట్లు చిరంజీవి డిపాజిట్‌ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ డబ్బును కాజేసేందుకే పెళ్లి పేరుతో ఆమెను ట్రాప్‌లో పడేశాడని భరద్వాజ్‌పై ఆరోపణ ఉంది. శ్రీజ పేరుతో బేగంపేటలో ఉన్న ఒక ఫ్లాట్‌ను కూడా అప్పట్లో భరద్వాజ్‌ తీసుకున్నారట. వివాహం తర్వాత శిరీష్ భరద్వాజ్‌ కరెక్ట్‌ వ్యక్తి కాదని శ్రీజ ఆరోపించింది. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement