
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు పెగుతున్నాయి. ఇప్పటికే పలువురు టెలివిజన్ నటీనటులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ వచ్చింది. బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల ఆదివారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వెల్లడించారు. స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా భరద్వాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..)
తన ఆరోగ్యానికి సంబంధించి భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిమిషాల వీడియో పోస్టు చేశారు. తనకు లక్షణాలేవి లేవని, ఎవరూ భయపడవద్దని సూచించాడు. సరైన ఆహార నియమాలు, మందులతో వ్యాధి నుంచి బయట పడవచ్చని పేర్కొన్నారు. అయితే తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక భరద్వాజ్ కరోనా సోకిన విషయంతో తెలియడంతో అతని అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్)
Comments
Please login to add a commentAdd a comment