న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.
కవిత బెయిల్‌పై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెయిల్ విషయంలో కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయిదునెలలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడిందని, అన్యాయంగా కవితను జైల్లో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడి పెట్టి దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని, కేంద్రమత్రిగా ఉండి బండి సంజయ్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్‌పై కేసులు వేస్తామని, బెయిల్‌ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని విమర్శించారు. కోర్టులో జరిగిన వాదనలు సమాజం చూసిందని, ఈబీ, సీబీఐ వరి కనుసన్నల్లో నడుస్తున్నాయనేది దేశం మొత్తం తెలుసని అన్నారు.
బెయిల్ రావడం ఆలస్యమైనా.. న్యాయం గెలిచిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నిజం ఆలస్యంగా గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.
‘చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్‌కు అసలు తెలివి ఉందా? సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌గా ఐదేళ్ళు పని చేశారు
కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.
ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితలపై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారు
బండి సంజయ్ తెలంగాణలో 750 కోట్ల సివిల్ సప్లై స్కాం పై ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ పై ఎందుకు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఆడబిడ్డ బెయిల్ వస్తే ఎందుకింత అక్కసు?
- మాజీ మంత్రిగంగుల కమలాకర్.
Comments
Please login to add a commentAdd a comment