సాక్షి, మెదక్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. జహీరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాతీర్పును ఎదుర్కొనలేకనే భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం దారుణమన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన చైర్మన్ నరోత్తం, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ ఖండించాలి!
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పన్నారు. హింస రాజకీయాలను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.
ఎంపీపై దాడి అమానుషం..
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడం అమానుషమని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌చైర్మన్ మఠం భిక్షపతి ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న ఆయనపై కత్తితో దాడి చేయడం దర్మార్గమన్నారు. ప్రభాకర్‌రెడ్డి త్వరగా కొలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ముమ్మాటికీ ప్రతిపక్షాల దాడే..
ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్రనేనని సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. అధికారం కోసం ప్రతిపక్షాలు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు రెచ్చగొట్టే ప్రసంగాలతో హింస రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment