manik rao
-
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
ఎంపీపై దాడి అప్రజాస్వామికం! : ఎమ్మెల్యే మాణిక్‌రావు
సాక్షి, మెదక్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి అప్రజాస్వామికమని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. జహీరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాతీర్పును ఎదుర్కొనలేకనే భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం దారుణమన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఐడీసీ చైర్మన్ తన్వీర్, ఎస్సీ కార్పొరేషన చైర్మన్ నరోత్తం, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ ఖండించాలి! ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పన్నారు. హింస రాజకీయాలను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. ఎంపీపై దాడి అమానుషం.. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడం అమానుషమని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌చైర్మన్ మఠం భిక్షపతి ఖండించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న ఆయనపై కత్తితో దాడి చేయడం దర్మార్గమన్నారు. ప్రభాకర్‌రెడ్డి త్వరగా కొలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ముమ్మాటికీ ప్రతిపక్షాల దాడే.. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్రనేనని సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. అధికారం కోసం ప్రతిపక్షాలు ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు రెచ్చగొట్టే ప్రసంగాలతో హింస రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
కాంగ్రెస్ ప్రచార నగారా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార నగారా మోగించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు తాము అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు చేసే మేలు గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్ వేదికగా ప్రచార షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. గడప గడపకూ చేరేలా.. ఈసారి ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలన్న ఆశతో ముందుకెళుతున్న కాంగ్రెస్ 100 రోజు ల ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించనుంది. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేళ్ల పాలనలో చేయలేని పనులను ఎత్తిచూపుతూ కరపత్రాలు ప్రచురించి, వాటి ని రాష్ట్రంలోని గడపకూ చేర్చి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని శనివారం ప్రకటించనుంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్నర్ మీటింగ్‌లకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గతంలో ప్రతిపాదించిన విధంగా సీనియర్ నేతల బస్సుయాత్ర షెడ్యూల్‌ను కూడా ప్రకటించే అవ కాశం ఉందని సమాచారం. ఇక సెపె్టంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్న కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టో కోసం ఇప్పటికే ప్రకటించిన కొన్ని ప్రధానాంశాలతో పోస్టర్లు రూపొందించి రాష్ట్రమంతటా వేయాలనే ఆలోచనలో ఉంది. మొత్తమ్మీద కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి అవసరమైన అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ శనివారం నాటి షె డ్యూల్ ప్రకటన ఉంటుందని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. దీనిపై టీపీసీసీ సీనియర్ నేత మల్లురవి ‘సాక్షి’తో మాట్లాడారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కాంగ్రెస్ ఏమేం చేస్తుందన్నది ప్రజలకు వివరిస్తామని.. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారాన్ని శనివారం ప్రారంభించనున్నామని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకటన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. -
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం చరిత్ర ఇదే...
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం జహీరాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మాణిక్యరావు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ మంత్రి జె.గీతారెడ్డిని 37773 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో భారీ తేడాతో ఓటమి చెందారు. ఆమె జహీరాబాద్ నుంచి రెండుసార్లు, గజ్వేల్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవులు నిర్వహించారు. మాణిక్యరావుకు 96598 ఓట్లు రాగా, గీతారెడ్డికి 62125 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన జంగం గోపీకి 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్ లలో మంత్రిగా గీతారెడ్డి పనిచేశారు. జహీరాబాద్ జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు రెడ్లు గెలవగా, ఒకసారి బిసి(ముదిరాజ్) వర్గానికి చెందిన నేత గెలుపొందారు. రెండుసార్లు ముస్లింలు గెలిచారు. గీతారెడ్డి ప్రముఖ మహిళానేత, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు. జె. ఈశ్వరీబాయి కుమార్తె. జహీరాబాద్‌లో అత్యధికసార్లు గెలిచిన ఘనత మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి. ఎమ్.బాగారెడ్డికి దక్కింది. ఆయన 1957 నుంచి వరుసగా ఏడుసార్లు 1985 వరకు గెలిచారు. బాగారెడ్డి 1989 నుంచి 1998 వరకు నాలుగుసార్లు మెదక్ నుంచి లోక్‌సభకు గెలిచారు. బాగారెడ్డి గతంలో చెన్నా, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. జహీరాబాద్‌లో రెండుసార్లు గెలిచిన ఫరీదుద్దీన్ 2004లో డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో సభ్యునిగా ఉన్నారు. 2009లో ఈ స్థానం రిజర్వుడ్ కావడంతో హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత
* అనారోగ్యంతో చికిత్సపొందుతూ హైదరాబాద్‌లో తుదిశ్వాస * రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన మాణిక్‌రావు * నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపు * 14 ఏళ్ల పాటు వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు * తెలంగాణ తొలి ఉద్యమంలో కీలక పోరు తాండూరు, హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్‌రావు (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శశిప్రభ, ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆయన... పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి హయాంలో దాదాపు 14 ఏళ్ల పాటు వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారు. కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటు న్న మాణిక్‌రావు సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం పక్షవాతం రాగా.. అప్పటి నుంచీ ఆరోగ్యం క్షీణించింది. వారం క్రితం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. 1969లో తొలిసారి ఎమ్మెల్యేగా.. మాణిక్‌రావు 1964లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో అరెస్టై 3 నెలల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1972లో రెండోసారి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై జలగం వెంగళరావు సర్కారులో వాణిజ్య,సమాచార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.1978లో మూడోసారి శాసనసభకు ఎన్నికై .. చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్అండ్బీ, వాణిజ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1983లో నాలుగోసారి విజయం సాధించారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తాండూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మాణిక్‌రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తపించేవారని, రాష్ట్ర ఏర్పాటుతో తన కల సాకారమైందని ఆనందించారని ఆయన సన్నిహితులు చెప్పారు. కాగా మాణిక్‌రావు మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సోమాజిగూడలోని నివాసంలో మాణిక్‌రావు భౌతికకాయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్‌అలీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు సందర్శించి, నివాళులు అర్పించారు. అనంతరం మాణిక్‌రావు కుటుంబ సభ్యులు భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 2:30 గంటలకు తాండూరుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. -
మాజీ మంత్రి మాణిక్‌రావు కన్నుమూత
తాండూరు(రంగారెడ్డి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎం. మాణిక్‌రావు(86) నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్‌రావును కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. మాణిక్‌రావు రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 14 సంవత్సరాల పాటు వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఎట్టకేలకు టీడీపీ తొలిజాబితా
తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దాదాపు 20ఏళ్ల క్రితం అన్నదమ్ములు రాష్ట్ర మాజీ మంత్రి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో బాబాయ్ నారాయణరావు కాంగ్రెస్ నుంచి, అబ్బాయి నరేష్ (నారాయణరావు సోదరుడు చంద్రశేఖర్ కుమారుడు) టీడీపీ నుంచి ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఇంత కాలం ఒకే పార్టీ (కాంగ్రెస్) ..ఒకే కుటుంబంగా ఉన్న మహరాజ్‌లు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఎన్నికల సమరంలో బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2009 సార్వత్రిక ఎన్నికల తరువాత మాజీ ఎమ్మెల్యే నారాయణరావు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో ఆయన రాజకీయ పునరాగమనం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని వీడిన నరేష్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలు నారాయణరావు, నరేష్‌లకు సోమవారం టికెట్లను ఖరారు చేశాయి. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్‌కు అధిష్టానం మరో అవకాశాన్ని ఇచ్చినా ఆయన సుముఖత చూపలేదు. తనకు బదులు బాబాయ్ నారాయణరావుకు టికెట్ ఇవ్వాలని విన్నవించారు. చివరికి రమేష్ విన్నపాన్ని అధిష్టానం ఆమోదించింది. దాంతో నారాయణరావు తెరపైకి వచ్చారు. ఇదే విధంగా 1994లో నారాయణరావు, ఆయన సోదరుడు మాణిక్‌రావు కాంగ్రెస్ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు పోటీ చేశారు. దాదాపు 20ఏళ్ల తరువాత ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్, అబ్బాయ్ తలపడుతుండటం గమనార్హం. ఈనేపథ్యంలో వీరి కుటుంబసభ్యులు ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలబడతారనే సర్వత్రా ఆసక్తికరంగా మారింది.