జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గం
జహీరాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మాణిక్యరావు మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ మంత్రి జె.గీతారెడ్డిని 37773 ఓట్ల ఆదిక్యతతో ఓడిరచారు. 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన గీతారెడ్డి 2018లో భారీ తేడాతో ఓటమి చెందారు. ఆమె జహీరాబాద్ నుంచి రెండుసార్లు, గజ్వేల్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికై మంత్రి పదవులు నిర్వహించారు. మాణిక్యరావుకు 96598 ఓట్లు రాగా, గీతారెడ్డికి 62125 ఓట్లు వచ్చాయి.
బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన జంగం గోపీకి 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్ లలో మంత్రిగా గీతారెడ్డి పనిచేశారు. జహీరాబాద్ జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు రెడ్లు గెలవగా, ఒకసారి బిసి(ముదిరాజ్) వర్గానికి చెందిన నేత గెలుపొందారు. రెండుసార్లు ముస్లింలు గెలిచారు. గీతారెడ్డి ప్రముఖ మహిళానేత, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు.
జె. ఈశ్వరీబాయి కుమార్తె. జహీరాబాద్‌లో అత్యధికసార్లు గెలిచిన ఘనత మాజీ మంత్రి, మాజీ ఎమ్.పి. ఎమ్.బాగారెడ్డికి దక్కింది. ఆయన 1957 నుంచి వరుసగా ఏడుసార్లు 1985 వరకు గెలిచారు. బాగారెడ్డి 1989 నుంచి 1998 వరకు నాలుగుసార్లు మెదక్ నుంచి లోక్‌సభకు గెలిచారు. బాగారెడ్డి గతంలో చెన్నా, అంజయ్య, భవనం, కోట్ల మంత్రివర్గాలలో పనిచేశారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. జహీరాబాద్‌లో రెండుసార్లు గెలిచిన ఫరీదుద్దీన్ 2004లో డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో సభ్యునిగా ఉన్నారు. 2009లో ఈ స్థానం రిజర్వుడ్ కావడంతో హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
జహీరాబాద్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment