జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదలకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక బీసీఎన్‌ఎల్ టవర్ ఎక్కి కిందకు దూకేస్తామని హెచ్చరిస్తున్నారు. టవరెక్కిన కుమార్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మోసిన్‌లను కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గుమ్మడిదల ప్రధాన రహదారిపై అఖిల పక్షనాయకులు రాస్తారోకోకు దిగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కాసేపు స్తంభించింది.
టవరెక్కిన యువకులు
Published Sun, Oct 2 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
Advertisement
Advertisement