kumar goud
-
టవరెక్కిన యువకులు
జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కలపాలని డిమాండ్ చేస్తూ గుమ్మడిదలకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక బీసీఎన్ఎల్ టవర్ ఎక్కి కిందకు దూకేస్తామని హెచ్చరిస్తున్నారు. టవరెక్కిన కుమార్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, మోసిన్లను కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గుమ్మడిదల ప్రధాన రహదారిపై అఖిల పక్షనాయకులు రాస్తారోకోకు దిగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కాసేపు స్తంభించింది. -
కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడి హత్య
వీణవంక(కరీంనగర్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన యువకుడు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తపెల్లి గ్రామానికి చెందిన కుమార్ గౌడ్(22)ను గుర్తు తెలియని వ్యక్తులు ఉరివేసి చంపారు. మృతదేహాన్ని అతని టాటాఏస్ వాహనంలోనే ఉంచి అతని అత్తగారి ఊరైన ఘన్ముకుల శివారులో వదిలేసి వెళ్లిపోయారు. కుమార్ వివాహం ఘన్ముకుల గ్రామానికి చెందిన కోమలతో ఆరేళ్ల క్రితం అయింది. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, కుమార్ హత్యకు కుటుంబకలహాలే కారణమని గ్రామస్తులు అంటున్నారు.