
హైదరాబాద్: దుండిగల్ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి (36) గుండెపోటుతో మృతి చెందారు. 2016 బ్యాచ్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి నెల రోజుల క్రితం నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వాహనాన్ని ఆపే క్రమంలో కింద పడ్డాడు.
కాలికి తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. పూర్తిగా కోలుకున్న అతను మరో రెండ్రోజుల్లో విధుల్లో చేరనున్నట్లు తన సహోద్యోగులకు సమాచారం అందించాడు. గురువారం రాత్రి అతను గుండె నొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment