ఒక ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ హంతకులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి తగని పనులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
బత్తులపల్లి(పొదలకూరు), న్యూస్‌లైన్: ఒక ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ హంతకులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి తగని పనులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. భోగసముద్రం, బత్తులపల్లిలో శనివారం కాకాణి సమైక్యదీవెనయాత్ర నిర్వహించారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఉలవరపల్లికి చెందిన భాగ్యక్ష్మి హత్యకేసులో ప్రధాన నింది తుడు శ్రీనివాసులు ఆదాల అతిథిగృహంలో పోలీసులకు పట్టుపడడం చూస్తే ఎమ్మెల్యే హంతకులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నిందితునికి ఆదాల ఎలా ఆశ్రయంకల్పించారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఒక్కడే హత్య కు పాల్పడలేదని హతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీ సుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పెద్దలతో పాటు, స్థానిక నాయకులు కూడా నిందితులకు అం డగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. స్థానిక ఎస్సై కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. స్వయాన ఎమ్మెల్యే అతిథిగృహంలోనే నిందితుడు పట్టుపడితే నియోజకవర్గ ప్రజలకు దిక్కెవరన్నారు. ఆదాల ఏలుబడిలో మండలంలో నేరాల సంఖ్య పెరిగిందన్నారు.
పార్టీలో చేరిన టీడీపీ కార్యకర్తలు
నేదురుపల్లికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు కాకాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కర్నాటి రవీంద్రబాబుతో పాటు పలువురు కార్యకర్తలను కాకాణి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు వేశారు. కాకాణి వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం బ్రహ్మయ్య, మండలపార్టీ కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ నోటి మాలకొండారెడ్డి, బత్తులపల్లి సర్పంచ్ త్రోవగుంట రమాదేవి, నాయకులు త్రోవగుంట ప్రసాద్, రావూరు వెంగారెడ్డి, గుదె భాస్కర్‌నాయుడు, కాపా భాస్కర్‌నాయుడు, కామినేని కృష్ణంనాయుడు, రావూరు పెంచలరెడ్డి, కుంకు సుబ్బరామనాయుడు ఉన్నారు.