ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
Published Wed, Dec 7 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
చండూరు :గట్టుప్పల గ్రామాన్ని మండలంగా మొదటి ముసాయిదాలో ప్రకటించి చివరగా రద్దు చేయడం పట్ల బాధ్యత వహిస్తూ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రాజీనామా చేయాలని సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి అనంతరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలం కోసం చేస్తున్న నిరసనకు ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. మండల సాధన కమిటీ కన్వీనర్ ఇడెం కై లాసం అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మొదటగా ప్రకటించి తర్వాత రద్దు చేయడంపై అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఇడెం విజయ్ కుమార్, మల్లేష్, కుండే సత్యనారాయణ, సత్తయ్య, నర్సింహ, నామని బుచ్చయ్య, బీమగోని మల్లేశం, కొంగరి కోటయ్య, క్రిష్ణ, యశ్వంత్, పరదీప్, రాజశేఖర్ ఉన్నారు.
Advertisement
Advertisement